ఆ రెండు హ్యుందాయ్‌ కార్లపై అదిరిపోయే డిస్కౌంట్స్‌.. వీటి ప్రారంభ ధరలు రూ. 6 లక్షలు, రూ.7.94 లక్షలు మాత్రమే!

మార్కెట్‌లో ఎస్‌యూవీలకు మంచి డిమాండ్‌ ఉంది. అందులో భాగంగా కంపెనీలు ఈ విభాగానికి చెందిన కార్లను ఎక్కవగా లాంచ్‌ చేస్తున్నాయి. అయితే ఈ సెగ్మెంట్లలో హ్యుందాయ్ (Hyundai) తొలి స్థానంలో ఉంది. దక్షిణ కొరియాకు చెందిన ఈ కంపెనీ నుంచి ఎక్స్‌టర్‌ (Exter), వెన్యూ (Venue), క్రెటా (Creta), అల్కాజర్ (Alcazar), టక్సన్ (Tucson) వంటి స్పోర్ట్స్ యుటిలిటీ కార్లు ఈ కంపెనీ నుంచి కొనుగోలుకి అందుబాటులో ఉన్నాయి. పైన తెలిపిన కార్ల అన్నింటికీ మార్కెట్‌లో డిమాండ్‌ ఎక్కువగా ఉంది. ఇందులో క్రెటా తర్వాత వెన్యూ, ఎక్స్‌టర్‌లు ఎక్కువగా అమ్ముడవుతున్నాయి. చిన్న కుటుంబాలకు సరిపోయే ధరలో అందుబాటులో ఉండటంతో ఇవి ఎక్కువగా ప్రాచుర్యం పొందాయి.

ఈ రెండు ఎస్‌యూవీలను కొన్ని ఆఫర్లతో కొనుగోలు చేయవచ్చు. ఈ పండుగ సీజన్‌ వరకు ఈ ఆఫర్‌ అందుబాటులో ఉండనుంది. ఇక వీటి ఆఫర్‌ విషయానికి వస్తే కాంపాక్ట్ ఎస్‌యూవీ వెన్యూపై రూ.70,629 వరకు, ఎక్స్‌టర్‌పై రూ.32,972 వరకు డిస్కౌంట్ లభిస్తుంది. అంతే కాకుండా ఈ రెండు కార్లపై యాక్ససరీ ప్యాక్స్‌ని కూడా అందిస్తోంది.

Hyundai Venue and Exter SUVs Discount Benefits

వెన్యూలో రూ.21,628 ధర వద్ద ఉన్న ఈ యాక్సెసరీ ప్యాక్‌ని ఇప్పుడు కేవలం రూ.5,999కే కొనుగోలు చేయవచ్చు. వీటిలో డార్క్ క్రోమ్‌లో డోర్ సైడ్ మోల్డింగ్, 3డి బూట్ మ్యాట్, టెయిల్ ల్యాంప్ గార్నిష్, క్యాబిన్ కోసం ప్రీమియం డ్యూయల్ లేయర్ మ్యాట్స్ వంటి యాక్ససరీలను హ్యుందాయ్ అందిస్తోంది. దీంతో కస్టమర్లు తక్కువ ఖర్చుతో కాంపాక్ట్ ఎస్‌యూవీని మరింత ప్రాక్టికల్‌గా, స్టైలిష్‌గా ఇంటికి తెచ్చుకోవచ్చు.

మరోవైపు, ఎక్స్‌టర్‌పై రూ .17,971 యాక్సెసరీ ప్యాక్‌ని కంపెనీ ఇప్పుడు రూ .4,999 లకే అందిస్తోంది. ఇందులో 3డి బూట్ మ్యాట్, నెక్‌రెస్ట్, కుషన్ కిట్, కాస్మెటిక్ అవసరాల కోసం ట్విన్ హుడ్ స్కూప్స్, పియానో బ్లాక్‌తో తయారు చేసిన ఔట్ సైడ్ రియర్ వ్యూ అద్దాలు ఉన్నాయి. ఈ అమౌంట్‌ ఇతర పూర్తి సమాచారం కోసం అధీకృత డీలర్‌షిప్‌ని సంప్రదించండి.

Hyundai Exter Offers

ప్రస్తుతం మైక్రో ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో టాటా పంచ్‌తో పోటీ పడుతున్న ఎక్స్‌టర్ ధర రూ.6.13 లక్షల నుంచి రూ.10.43 లక్షల మధ్య (ఎక్స్ షోరూమ్, ఇండియా) ఉంది. మరోవైపు హ్యుందాయ్ వెన్యూ ధర రూ .7.94 లక్షల నుంచి రూ .13.48 లక్షల (ఎక్స్-షోరూమ్, ఇండియా) మధ్య ఉంది.

ఇక వెన్యూ మారుతి సుజుకి బ్రెజ్జా, టాటా నెక్సాన్, మహీంద్రా XUV 3XO, కియా సోనెట్ వంటి భారతదేశంలోని ప్రసిద్ధ కాంపాక్ట్ ఎస్‌యూవీలకు గట్టి పోటీని ఇస్తుంది. ఇటీవల ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వెన్యూ ఎస్ (O)+ వేరియంట్‌ని సరసమైన ధరలో లాంచ్‌ చేసింది. హ్యుందాయ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో వెన్యూ ఎస్ ప్లస్ వేరియంట్‌ని కూడా లాంచ్ చేసింది.

Hyundai Venue Offer Benifits

కొత్తగా లాంచ్ చేసిన ఈ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9,35,800గా ఉంది. ఈ నెల ప్రారంభంలో ఇదే ఫీచర్‌తో లాంచ్ అయిన వెన్యూ ఎస్(ఓ)+ వేరియంట్ కంటే ఈ కొత్త వేరియంట్ ధర సుమారు రూ.64,100 తక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌తో కూడిన సబ్-4-మీటర్ల ఎస్‌యూవీ కొత్త సరసమైన వేరియంట్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే లభిస్తుంది.

ఇక వెన్యూ 1.2-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడిన ఈ ఇంజిన్ గరిష్టంగా 83 bhp పవర్ వద్ద గరిష్టంగా 114 nm టార్క్‌ని ఉత్పత్తి చేయగలదు. రూ.9 లక్షలకు పైగా దీనిని అందుబాటులోకి తేవడంతో ఫీచర్ల విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. అందుకే ఇంకా టాప్‌లో కొనసాగుతుంది.

ఇక ఇందులోని ఫీచర్ల విషయానికి వస్తే TFT మల్టీ ఇన్ఫో డిస్ప్లే, వైర్‌లెస్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో కూడిన 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రియర్ ఎయిర్ కండిషనింగ్ వెంట్స్, రూఫ్ రైల్స్, 6 ఎయిర్ బ్యాగులు, టీపీఎంఎస్, ESC, హిల్ హోల్డ్ అసిస్ట్, ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

More from DriveSpark

Article Published On: Monday, September 2, 2024, 9:47 [IST]
English summary
Hyundai venue and exter suvs now available with huge discount benefits
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+