బుల్లెట్ రేంజ్‌లో దూసుకుపోతుంది.. సేల్స్‌లో సగం వాటా దీనిదే.. బాగా డిమాండ్ ఉన్న ఈవీ కారు ఇదే
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగింది. గతంలో పెట్రోల్, డీజిల్ కార్లు ఎక్కువగా అమ్ముడు పోగా, ఇప్పుడు ఆ ధోరణి మారిపోయింది. క్రమంగా ప్రజలు ఈవీలకు అలవాటు పడుతున్నారు. ఈ నేపథ్యంలో దిగ్గజ కంపెనీ JSW MG మోటార్ ఇండియా ఈ విభాగంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి అధిక బ్యాటరీ కెపాసిటీతో అధునాతన ఫీచర్లతో నిండిన కార్లను విడుదల చేస్తుంది. దేశీయంగా ప్రజలు ఎంజీ ఈవీ కార్లను ఆదరిస్తున్న నేపథ్యంలో నవంబర్ 2024లో ఎలక్ట్రిక్ కార్ల విక్రయాల్లో మెరుగైన గణంకాలను సాధించిందని తాజాగా విడుదల అయిన డేటాను చూస్తే తెలుస్తుంది. సాధారణ ఇంధన కార్లతో పాట ఈవీల విక్రయాలు కూడా గత ఏడాది కంటే ఈ సారి సానుకూలంగా ఉన్నాయి. ఎంజీ మోటార్ నవంబర్‌లొ 6,019 యూనిట్ల కార్లను విక్రయించింది. దీన్ని బట్టి ఎలక్ట్రిక్ కార్లకు ఏ రేంజ్‌లో డిమాండ్ ఉందో తెలిసిపోతుంది.
ప్రధానంగా ఎంజీ మోటార్‌కు చెందినటువంటి విండ్సర్ EV కారుకు ఇండియాలో మంచి ఆదరణ లభిస్తుంది. దీని ధర తక్కువగా ఉండటం వలన నవంబర్ నెలలో ఎక్కువ మంది వినియోగదారులను ఆకట్టుకుని అమ్మకాల్లో మెరుగైన వృద్ధిని సాధించింది. ఇది నవంబర్ 2024లో 3,144 యూనిట్ల విక్రయాలను సాధించింది. మొత్తంగా చూసినట్లయితే గత నెల ఈవీ కార్ల అమ్మకాల్లో దీని వాటా ఏకంగా 52.23 శాతం ఉండటం గమనార్హం.

కంపెనీ నుంచి ఈ మోడల్ మాత్రమే కాకుండా ఇతర కార్లు కూడా అమ్మకాల పరంగా మెరుగైన గణాంకాలను నమోదు చేశాయి. డేటాను చూసినట్లయితే గత ఏడాది 2023 లో నవంబర్ నెలలో అమ్మకాలు 4,154 యూనిట్లుగా ఉన్నాయి. ఏడాది ప్రాతిపదికన విక్రయాల వృద్ధి 44.90 శాతం పెరగడం గమనార్హం. ముఖ్యంగా నవంబర్ నెలలో విండ్సర్ ఈవీకి వచ్చిన ఆదరణ కారణంగా ఇది సాధ్యమైంది.
అలాగే, ఎంజీ మోటార్ ఇదే ఏడాది అక్టోబర్‌లో విక్రయించిన 7,045 యూనిట్లతో పోల్చినప్పుడు , నవంబర్ నెలలో నెలవారీ ప్రాతిపదికన 14.56 శాతం తగ్గింది. అంటే దాని ముందు నెల కంటే విక్రయాలు 1,026 యూనిట్లు తక్కువగా అమ్ముడుపోయాయి. అయితే విండ్సర్ ఈవీ అక్టోబర్‌లో 3,116 యూనిట్లు అమ్ముడుపోగా, ఈ మోడల్ నవంబర్‌లో స్థిరమైన వృద్ధిని కనబరించింది. ఈ కారు ఫీచర్లు కూడా అద్భుతంగా ఉంటాయి.

దీనితో పాటు ఎంజీ మోటార్ కామెట్ EV, ZS EV అమ్మకాలు కూడా నవంబర్‌లో మెరుగ్గా ఉన్నాయి. ప్రధానంగా 'బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్' అనే పథకాన్ని అందించడం కారణంగా వినియోగదారులు ఈ కంపెనీకి చెందిన ఎలక్ట్రిక్ కార్లకు బాగా ఆకర్షితులయ్యారు. కంపెనీ ఇటీవల కాలంలో పూర్తిగా ఈవీలను తీసుకురావడానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతుంది.
ప్రపంచదేశాలతో పోలిస్తే భారత్ ఈవీ మార్కెట్‌కు అత్యంత సానుకూలంగా ఉండటంతో ఎలక్ట్రిక్ మొబిలిటీ పట్ల బలమైన నిబద్ధతను చూపుతూ, ఎంజీ మోటార్ ఇతర కంటే తక్కువ ధరలో సింగిల్ ఛార్జింగ్‌తో ఎక్కువ దూరం ప్రయాణించే కార్లను తీసుకువస్తుంది. కొత్త ఏడాదిలో కూడా కంపెనీ ఈవీలలో పలు మోడళ్లను మార్కెట్లోకి లాంచ్ చేయడానికి చూస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








