అప్పుడు బుకింగ్స్‌లో.. ఇప్పుడు డెలివరీల్లో దూసుకుపోతున్న 332 కి.మీ రేంజ్ ఈవీ కారు

ఆటోమొబైల్ రంగంలో దిగ్గజ కంపెనీగా పేరున్న JSW MG మోటార్ ఇండియా(JSW MG Motor India) సరికొత్త మైలురాయి సాధించింది. ఇటీవల విడుదల చేసిన విండ్సర్ ఈవీ( Windsor EV) వాహనాలను తన కస్టమర్లకు డెలివరీ చేయడం మొదలుపెట్టింది. అయితే దీనిలో ఒక విషయం గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. అదేంటంటే, కంపెనీ ఒకే రోజులో 101 విండ్సర్ ఈవీలను కస్టమర్లకు డెలివరీ చేయడ గమనార్హం. ఇటీవల ఈ వేడుక బెంగళూరులో జరిగింది. తాము ఎంతగానో ఇష్టపడి బుక్ చేసుకున్న కారు దీపావళికి ముందు ఇంటికి రావడంతో కారు ఓనర్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఇండియాలో మొదటి సారిగా బ్యాటరీ సేవ (BaaS) ఆప్షన్ సదుపాయంతో వస్తున్న ఈ కారు డిజైన్ చాలా అందంగా ఉంది. అలాగే దీనిలో ఫీచర్లు కూడా బోలెడు ఉన్నాయి.

విండ్సర్ ఈవీ( Windsor EV)ని కంపెనీ కొద్ది రోజుల క్రితం విడుదల చేయగా, బుకింగ్స్ ఓపెన్ చేసిన 24 గంటల్లోనే ఏకంగా 15,176 బుకింగ్‌లను సాధించి కస్టమర్ల నుంచి ఎక్కువ డిమాండ్ ఉన్న మోడల్‌గా నిలిచింది. మొదటిసారిగా BaaS సదుపాయంతో వచ్చిన ఈ కారు ప్రారంభ ధర రూ.10 లక్షలుగా ఉంది. బ్యాటరీ సేవ ద్వారా కస్టమర్లు బ్యాటరీని అద్దె ప్రాతిపదికన తీసుకోవచ్చు. అద్దె కి.మీకు రూ.3.5 చొప్పున ఉంటుంది.

Jsw Mg Motor India Delivered 101 Windsor Ev In Bengaluru

ఒక వేళ బ్యాటరీతో కలిపి కావాలనుకుంటే రూ. 13.50 లక్షల నుండి రూ. 15.50 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) చెల్లించాలి. ఈ కారు విలాసవంతమైన అనుభవాన్ని కలిగిస్తుంది. ముఖ్యంగా బ్యాటరీ విషయానికి వస్తే, దీనిని ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే దాదాపు 332 కి.మీ వరకు ప్రయాణిస్తుంది. ఈ రేంజ్ కారుతో లాంగ్ డ్రైవింగ్‌లు కూడా చేయవచ్చు. కొత్తగా కారు కొనాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

ఎక్కువ రేంజ్‌ కోసం కారులో 38 kWh బ్యాటరీ ప్యాక్‌ను అమర్చారు. ప్రధానంగా విండ్సర్ ఈవీలో ఛార్జింగ్ సమస్యను కంపెనీ పరిష్కరించింది. దీని కోసం 45 kW DC ఫాస్ట్ ఛార్జర్‌ని అందించారు. దీంతో కారులో ఉన్న బ్యాటరీ కేవలం 55 నిమిషాల్లో 10 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. ఎలక్ట్రిక్ మోటార్ 134 bhp పవర్ వద్ద 200 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

విండ్సర్ ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే, 100కి పైగా AI- పవర్డ్ వాయిస్ కమాండ్‌లు, 15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే, రియల్ టైమ్ నావిగేషన్, రిమోట్ వెహికల్ కంట్రోల్, సేఫ్టీ అలర్ట్‌లతో పాటు ఇతర 80+ కనెక్టెడ్ ఫీచర్లు కారులో ఉన్నాయి. కారులో ప్రయాణిస్తున్నప్పుడు పాటలను మంచి అనుభూతితో వినడానికి లేటెస్ట్ సౌండ్ సిస్టంను కారులో అమర్చారు.

ఇంకా, రిక్లైనింగ్ రియర్ సీట్, పనోరమిక్ గ్లాస్ రూఫ్, వైర్‌లెస్ ఛార్జింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి. ముఖ్యంగా డ్రైవర్‌కు సహాయకరంగా ఉండటానికి అవసరమైన పలు ప్రత్యేక ఫీచర్లు కూడా కారులో ఉన్నాయి. ఇది ఎకో+, ఎకో, నార్మల్, స్పోర్ట్ అనే నాలుగు డ్రైవింగ్ మోడ్‌లను కలిగి ఉంది.

విండ్సర్ ఈవీ ఎక్సైట్, ఎక్స్‌క్లూజివ్, ఎసెన్స్ అనే మూడు ట్రిమ్‌లలో లభిస్తుంది. స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ అనే కలర్స్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. మార్కెట్లో ఇప్పటికే చాలా ఈవీ కార్లు ఉండగా, MG మోటార్ నుంచి వచ్చిన విండ్సర్ ఎలక్ట్రిక్ కారు టాటా నెక్సాన్ EV , పంచ్ ఈవీ EV, మహీంద్రా XUV400 సెగ్మెంట్‌లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, October 29, 2024, 13:33 [IST]
English summary
Jsw mg motor india delivered 101 windsor ev in single day in bengaluru
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+