నిరీక్షణకు తెర.. థార్ 5 డోర్ ఎలా ఉందో చూశారా? ఈ సారి మరింత ముద్దుగా ముస్తాబు!
మహీంద్రా థార్ దేశంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన ఆన్‌రోడ్, ఆఫ్‌రోడర్ ఎస్‌యూవీగా అందుబాటులో ఉంది. భారతీయ ఆటోమోటివ్ రంగంలో దీనిని ఒక అల్టిమేట్ ఫర్ఫామర్‌గా చెప్పవచ్చు. దీనిని బుక్ చేసుకున్న తర్వాత పొందాలంటే దాదాపు సంవత్సరకాలం ఆగాల్సి ఉంటుంది. అంటే ఈ ఆఫ్‌రోడర్‌కి ఎంత డిమాండ్ ఉందో మీరే అర్థం చేసుకోండి. తాజాగా మహీంద్రా 5 డోర్‌కి సంబంధించిన టీజర్ ఆ సంస్థ విడుదల చేసింది. ఇప్పటికే కొత్త ఎస్‌యూవీని ఆగస్టు 15న భారతదేశంలో విడుదల చేయనున్నట్లు కంపెనీ ధృవీకరించింది. ఈ కారుకి సంబంధించిన తొలి చిత్రాలను ఆ సంస్థ విడుదల చేసింది.
ఈ కారుకు సంబంధించిన చిత్రాలను మాత్రమే కాకుండా దాని అధికారిక పేరును కూడా కంపెనీ వెల్లడించింది. మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar ROXX) పేరుతో థార్ 5-డోర్ల వెర్షన్‌ని లాంచ్ చేయనుంది. ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న 5 డోర్ థార్ మార్కెట్లోకి రాబోతోంది. ఇదే SUVని గతంలో 'అరమాడ' పేరుతో విక్రయించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు దీనికి చెక్ పడింది.

ఈ దశలో 5 డోర్ల థార్‌ని థార్ రాక్స్ పేరుతో విక్రయించనున్నట్లు ధృవీకరించబడింది. ప్రస్తుత టీజర్ కూడా ఈ పేరును ధృవీకరించింది. పేరుకు తగ్గట్టుగానే మహీంద్రా ఈ కారును చాలా స్టైలిష్‌గా డిజైన్ చేసింది. ముఖ్యంగా థార్ 3 డోర్ వెర్షన్ మాదిరిగానే ఇది మరింత ఆకర్షణీయంగా, మరింత స్మూత్‌గా కనిపిస్తుంది. దీని ప్రకారం కారు ముందు భాగంలో ఆరు స్లాట్లతో కొత్త గ్రిల్‌ని అందించారు.
5డోర్ థార్‌లో ఫ్రంట్ బంపర్ సరికొత్త రాక్స్‌కి క్రేజీ లుక్‌ని అందింస్తుంది. థార్ రాక్స్‌లో సీ ఆకారంలో ఉన్న DRLలతో కూడిన సర్క్యూలర్ ప్రొజెక్టర్ తరహా హెడ్‌ల్యాంప్, 10.25 ఇంచెస్ స్క్రీన్ మరియు పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఆప్షన్స్ ఉన్నాయి. ముఖ్యంగా దీనిని మరింత సేఫ్టీగా అందించేందుకు లెవెల్ 2 ఏడీఏఎస్ ఫీచర్ కూడా ఇందులో ఉండనుందని చెబుతున్నారు.

టీజర్‌లో చూపించిన విధంగా ఏడిఏఎస్ ఫీచర్ కోసం సెన్సార్లను గ్రిల్ మధ్యలో ఉంచడం మనం చూడవచ్చు. ఇంజిన్ విషయానికొస్తే థార్ 3 డోర్ వెర్షన్‌లో అందించిన మోటారు ఆప్షన్లను కూడా ఇందులోనూ అందించాలని భావిస్తున్నారు. ఆ విధంగానే వస్తే ఈ 5-డోర్ల థార్ లోనూ 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ పెట్రోల్ ఆప్షన్స్ అందించబడతాయి.
పైన తెలిపిన ఇంజిన్ ఆప్షన్లపై అధికారిక ప్రకటనకు త్వరలోనే ఫుల్‌స్టాప్ పడనుంది. ఈ మహీంద్రా థార్‌కి సంబంధించి ఇప్పటికే డీలర్ల వద్ద కొందరు ఔత్సాహికులు అనధికారికంగా బుకింగ్స్ కూడా చేసుకుంటున్నట్లు సమాచారం వస్తుంది. డీలర్లు ఇప్పటికే ఈ కారు కోసం బుకింగ్స్ ప్రారంభించినట్లు వార్తలు వస్తున్నాయి. కారుని విడుదల చేసే ఆగస్టు 15 నుంచే అధికారిక బుకింగ్స్ ప్రారంభం కానున్నాయని తెలుస్తోంది.
థార్ రాక్స్ ధరను కూడా అదే రోజు ప్రకటించే అవకాశం ఉంది. ఈ ఆఫ్ రోడర్ అందుబాటులోకి రావడంతో మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ నుంచి వచ్చిన గూర్ఖా వంటి మోడళ్లకు గట్టి పోటీ ఇవ్వనుంది. తాజా నివేదికల ప్రకారం, మహీంద్రా థార్ రాక్స్ ధర రూ. 15 లక్షల నుంచి రూ. దీని ధర సుమారు రూ.25 లక్షలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ప్రస్తుతం మహీంద్రా థార్ భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. దీనికి పోటీగా ఉన్న ఇతర ఎస్‌యూవీలు దీని దరి దాపుల్లోనూ లేవు. థార్ 3 డోర్‌కి వచ్చిన రెస్పాన్స్ థార్ రాక్స్‌కి కూడా వస్తుందని భావిస్తున్నారు. అయితే ఇది ఫర్ఫామెన్స్‌లో ఎంతవరకు ఆకట్టుకుంటుందో చూడాలి. ఈ వెర్షన్ కూడా ఆఫ్-రోడ్ మరియు లైఫ్ స్టైల్ ఫ్రెండ్లీ కారుగా తయారు చేయబడింది.


Click it and Unblock the Notifications








