మహీంద్రా కార్ల ధరలకు రెక్కలు.. ఆ ప్రముఖ కార్లపై రూ. 57,000 వరకు పెంపుదల

కస్టమర్లకు మహీంద్రా అండ్‌ మహీంద్రా షాకింగ్‌ న్యూస్‌ తీసుకువచ్చింది. తన ప్రముఖ కార్ల ధరలను పెంచినట్లు ప్రకటించింది. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం దేశంలో మహీంద్రా థార్, XUV 700(Mahindra Thar XUV 700) మరియు స్కార్పియో(Scorpio N) N ధర రూ.57,000 పెరిగింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

మహీంద్రా థార్: మహీంద్రా థార్(Mahindra Prices Hike) బేస్‌ వేరియంట్‌ ధర రూ. 10.98 లక్షల నుంచి రూ. 11.25 లక్షలకు పెరిగింది. అదే సమయంలో టాప్‌ ఎండ్‌ వేరియంట్‌ ధర రూ. 16.93 లక్షల నుంచి రూ. 17.20 లక్షలకు చేరుకుంది.

Mahindra-Thar-XUV700-Scorpio-N-Classic-Prices-Hike

అన్ని ఇతర వేరియంట్‌లు రూ. 23,000 నుండి రూ. 35,000 వరకు ధరలను పెంచాయి. ఎల్‌ఎక్స్ పెట్రోల్ హెచ్‌డీ ఎటి రియర్ వీల్ డ్రైవ్ కారుపై అత్యల్పంగా రూ.23 వేలు పెరగ్గా.. AX(O) HD MT MLD డీజిల్ వేరియంట్‌పై రూ. 35,000 వరకు పెరిగింది.

మహీంద్రా XUV 700: మహీంద్రా XUV 700 విషయానికి వస్తే, కొన్ని వేరియంట్లలో మాత్రమే ధరలను పెంచింది. కొన్ని వేరియంట్లపై ధరలను తగ్గించింది. దీని ప్రకారం, బేస్ వేరియంట్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర ప్రస్తుతం 13.99 లక్షలకు ప్రస్తుతం అందుబాటులో ఉంది.. కాగా అంతకుముందు ఇది రూ.14.03 లక్షలు. అంటే ఇప్పుడు రూ.4000 తగ్గింది.

Mahindra-Thar-XUV700-Scorpio-N-Classic-Prices-Hike

తర్వాత మహీంద్రా XUV 700 AS3 మరియు AX5 వేరియంట్‌ల ధర వరుసగా రూ. 8,000 మరియు రూ. 16,000 తగ్గినట్లు సంస్థ తెలిపింది. టాప్ వేరియంట్ AX7L 7 సీటర్ ఆల్ వీల్ డ్రైవ్ డీజల్ ఆటోమేటిక్ వేరియంట్ ధర రూ.42 వేలు పెరగ్గా.. ప్రస్తుతం ఈ కారు ధర రూ.26.99 లక్షలకు అందుబాటులో ఉంది.

మహీంద్రా XUV 700 AX7L 7-సీటర్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ గరిష్ట ధర పెంపు రూ.57,000గా ఉంది. ఈ ధరల పెంపు అంతా 2024 XUV700 వెర్షన్ కారుకు మాత్రమే వర్తిస్తాయి. ఇందులో ప్రధానంగా సెంటర్ కన్సోల్‌లో కెప్టెన్ సీట్లు ఉండగా.. కారు ముందు సీట్లతో వెంటిలేటర్ సీట్లు మరియు ORVM మెమరీ ఫంక్షన్‌తో అందుబాటులో ఉంది. కొత్త కలర్ ఆప్షన్‌గా నాపోలి బ్లాక్‌లో కొనుగోలు చేయవచ్చు.

Mahindra-Thar-XUV700-Scorpio-N-Classic-Prices-Hike

మహీంద్రా స్కార్పియో ఎన్ మరియు స్కార్పియో క్లాసిక్: మహీంద్రా Scorpio N మరియు Scorpio క్లాసిక్‌ కార్ల ధరలపై ఎటువంటి మార్పులు లేకపోవడం శుభ పరిణామం. Z87 4WD డీజిల్ మాన్యువల్, Z8 4WD, Z8L 4WD డీజిల్ ఆటోమేటిక్ ధరలలో ఎటువంటి మార్పు లేదు.

స్కార్పియో ఎన్ పెట్రోల్ మాన్యువల్ వేరియంట్ ధర రూ. 34,000 నుంచి రూ. 39,000కి పెరిగింది. ఆటోమేటిక్ వేరియంట్ ధరల పెంపు కూడా ఉంది. స్కార్పియో ఎన్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్ విషయానికి వస్తే, ధర రూ.17,000 నుండి రూ.20,000 వరకు పెరిగినట్లు తెలుస్తోంది.

Mahindra-Thar-XUV700-Scorpio-N-Classic-Prices-Hike

డీజిల్ వెర్షనల్‌ల విషయానికొస్తే, స్కార్పియో మాన్యువల్ వేరియంట్‌లు రూ. 1,000 నుండి రూ. 39,000 వరకు ధరలు పెంచాయి. డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ విషయానికొస్తే, ధర రూ.11,000 నుండి రూ.26,000 వరకు పెరిగినట్లు మహీంద్రా తెలిపింది.

ప్రస్తుతం స్కార్పియో ఎన్ ధర రూ.13.60 లక్షల నుంచి రూ.24.54 లక్షల మధ్య ఉండగా.. అదే సమయంలో, స్కార్పియో క్లాసిక్ కారు ప్రస్తుతం రూ.13.59 లక్షల నుంచి రూ.17.35 లక్షల ధరకు అందుబాటులో ఉంది. ఈ కారును నాలుగు విభిన్న వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

Mahindra-Thar-XUV700-Scorpio-N-Classic-Prices-Hike

మహీంద్రా స్కార్పియో క్లాసిక్‌ ధర కూడా వేరియంట్ల ప్రకారం రూ. 29,000 నుంచి రూ. 34,000 పెరిగాయి. మార్కెట్‌లో మహీంద్రా కార్లకు ధరల పెంపు ప్రకటించినప్పటికీ, కార్లపై ఈ ధర ప్రభావం లేకుండా ప్రజలు వీటిని కొనుగోలు చేస్తారని మహీంద్రా అండ్‌ మహీంద్రా భావిస్తోంది. పెరిగిన ధరలు ప్రస్తుతం అమల్లోకి వచ్చినట్లు సమాచారం.

More from DriveSpark

Article Published On: Thursday, January 25, 2024, 19:45 [IST]
English summary
Mahindra hikes prices up to rs 57 000 on mahindra thar xuv700 and scorpio n
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+