మహీంద్రా థార్‌ ‘ఎర్త్‌ ఎడిషన్‌' లాంచ్‌.. ఫీచర్లు, కలర్‌ అన్నీ ప్రత్యేకమే.. ఓ లుక్కేయండి.!!

ప్రముఖ భారతీయ ఆటోమొబైల్ సంస్థ మహీంద్రా.. మహీంద్రా థార్‌లో ఎర్త్‌ ఎడిషన్‌ను విడుదల చేసింది. ప్రసిద్ధ థార్‌ ఎడారి పేరుకు తగినట్లుగానే ఎర్త్‌ ఎడిషన్‌(Mahindra Thar Earth Edition)ను విడుదల చేసిన సంస్థ.. ఇందులో కలర్స్‌ నుంచి ఫీచర్ల వరకూ అన్నీ ప్రత్యేకంగా ఉంటాయని తెలిపింది. ఈ కారు ధర, ఇతర సమాచారం ఈ కథనంలో..

మహీంద్రా అండ్‌ మహీంద్రా(Mahindra And Mahindra) ఇటీవల.. స్కార్పియోలో NZ8 సెలెక్ట్ వేరియంట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా థార్ మోడల్‌లో మరొక కొత్త వేరియంట్‌ను స్పెషల్‌ ఎడిషన్‌గా తీసుకొచ్చింది. 'Earth Edition' పేరుతో థార్ ప్రత్యేక ఎడిషన్‌ను మహీంద్రా భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది.

Mahindra-Thar-Earth-Edition-Launch

భారత్‌లో థార్‌(Mahindra Thar SUV) అంటే అర్థం ఎడారి అని తెలిసిందే. తమ వాహనాల పేర్లు ప్రత్యేకంగా ఉండేలా ఈ దేశీ సంస్థ మహీంద్రా.. తమ బ్రాండ్‌ నుంచి ఈ ఎస్‌యూవీకి థార్‌ అని నామకరణం చేసింది. ఈ కారు ప్రజల్లో మరింత ఆదరణ పొంది.. ప్రత్యేకంగా నిలిచేందుకు ఇప్పుడు థార్‌లో ఎర్త్‌ ఎడిషన్‌ను తీసుకువచ్చింది. పేరుకు తగినట్లుగా ఈ ఎస్‌యూవీ కలర్‌ ఇసుక రంగును పోలి ఉంటుంది.

మహీంద్రా థార్‌ ఎర్త్‌ ఎడిషన్‌ శాటిన్ మ్యాట్ 'డెసర్ట్ ఫ్యూరీ' కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది. స్టాండర్డ్‌ వెర్షన్‌తో పోలిస్తే ఎర్త్‌ ఎడిషన్‌ డిజైన్‌ పరంగా స్పెషల్‌గా కొన్ని కాస్మెటిక్‌ మార్పులతో వస్తుంది. ఇంటీరియర్‌ను పరిశీలించినట్లయితే లేత గోధుమరంగు టోన్‌లతో బ్లాక్‌ థీమ్‌తో వస్తుంది. హెడ్‌రెస్ట్‌లపై డూన్ డిజైన్‌లతో కూడిన లేత గోధుమరంగు లెథెరెట్ సీట్లు ఉన్నాయి.

Mahindra-Thar-Earth-Edition-Launch

ఇక AC వెంట్‌లపై డెసర్ట్ ఫ్యూరీ ఇన్‌సర్ట్‌లు.. ఎర్త్‌ ఎడిషన్‌కు కొత్త లుక్‌ను ఇస్తాయి. ఇంకా స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ యాక్సెంట్, 7D ఫ్లోర్ మ్యాట్‌లు, కంఫర్ట్ కిట్, డోర్‌లపై థార్ బ్రాండ్‌ పేరుతో ఆకర్షణీయంగా ఉంటాయి. వీటితో పాటు ప్రతి థార్ ఎర్త్ ఎడిషన్ సీరియల్ నంబర్ 1తో ప్రారంభమయ్యే ప్రత్యేకమైన VIN ప్లేట్‌తో వస్తుండటం విశేషం.

మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్‌ ఇంజిన్‌ విషయానికొస్తే.. ఇందులో స్టాండర్డ్‌ మోడల్‌లోని అదే ఇంజిన్‌ను ఉపయోగించారు. ఈ ఎస్‌యూవీని పెట్రోల్ మరియు డీజిల్ రెండు వెర్షన్లలో కొనుగోలు చేయవచ్చు. అలాగే ఈ రెండింటిలో 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌తో జతచేయబడి ఉంటాయి.

Mahindra-Thar-Earth-Edition-Launch

కాగా మహీంద్రా థార్‌ డీజిల్ వెర్షన్ 2.2 లీటర్ ఇంజిన్ సామర్థ్యాన్ని కలిగి ఉండగా.. ఇది 130 BHP శక్తిని మరియు 300 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక ఇందులోని పెట్రోల్ వెర్షన్ 2.0-లీటర్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఆఫ్‌రోడర్‌ ఈ ఇంజిన్‌ వద్ద 150 BHP శక్తిని మరియు 300-320 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక ధరల విషయానికొస్తే.. మహీంద్రా థార్ ఎర్త్ ఎడిషన్ ధరలు రూ. 15.40 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి. ఇవన్నీ ఎక్స్‌-షోరూమ్‌ ధరలు. ఇందులోని పెట్రోల్ మాన్యువల్‌ వేరియంట్‌(MT) ధర రూ. 15.40 లక్షలు కాగా పెట్రోల్ ఆటోమేటిక్‌ వేరియంట్‌(AT) ధర రూ. 16.99 లక్షలుగా ఉంది.

Mahindra-Thar-Earth-Edition-Launch

మహీంద్రా థార్‌ ఎర్త్‌ ఎడిషన్‌ డీజిల్ MT ధర రూ. 16.15 లక్షలు కాగా డీజిల్ AT ధర రూ. 17.60 లక్షల వద్ద కొనుగోలు చేయవచ్చు. ఈ ఫీచర్లు, ఇంజిన్‌ ఆప్షన్లు అన్నీ LX హార్డ్ టాప్-ఎండ్ ట్రిమ్‌లో మాత్రమే అందుబాటులో ఉంటాయని సంస్థ వెల్లడించింది. వీటి అన్ని యూనిట్లు 4x4 వ్యవస్థలతో అమర్చబడి ఉంటాయని తెలిపింది.

More from DriveSpark

Article Published On: Wednesday, February 28, 2024, 11:11 [IST]
English summary
Mahindra launches thar earth edition with iconic style satin mat desert fury colour
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+