మహీంద్రా థార్ దెబ్బకి మార్కెట్ షేక్.. తుఫానులా విరుచుకుపడింది.. సరికొత్త ట్రెండ్ సెట్టర్..
మహీంద్రా థార్ గురించి దేశంలో తెలియని వారు ఉండరు. కార్లను కలిగి ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దీని గురించి కచ్చితంగా తెలిసి ఉంటుంది. ఇండియాలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా ముందు స్థానంలో ఉంది. దీని డిజైన్ ఒక సింహం లాంటి ఫీలింగ్‌ను కలిగిస్తుంది. దీన్ని డ్రైవింగ్ చేస్తూ, రోడ్లపై వెళ్తుంటే ఆ రాజసమే వేరు. అందరి చూపు కూడా థార్‌పైనే ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ మోడల్‌కు ఉన్నంత డిమాండ్ మరేదానికి కూడా లేదంటే మామూలు విషయం కాదు. ఆఫ్ రోడ్ ప్రయాణాలకు థార్ అత్యుత్తమైన ఆప్షన్‌గా ఉంది. లాంచ్ అయిన కొద్ది రోజుల్లోనే ఇది రికార్డు స్థాయిలో అమ్మకాలను సాధించి ఆటోమొబైల్ రంగంలో సరికొత్త ఒరవడికి తెరలేపింది. మొదటగా 3 డోర్ థార్ పాపులారిటీని గుర్తించిన కంపెనీ 5 డోర్ థార్ రాక్స్‌ను ఇటీవల విడుదల చేయగా, ఇది కూడా అమ్మకాల పరంగా పుంజుకుంటుంది.
అంతటి డిమాండ్ ఉన్న మహీంద్రా థార్ తాజాగా అమ్మకాల పరంగా సరికొత్త మైలురాయికి చేరుకుంది. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫ్యాక్చరర్స్ (SIAM) నుంచి విడుదల అయిన డేటా ప్రకారం, థార్ ఇండియా మార్కెట్లో 2,00,000-యూనిట్ల అమ్మకాలను నమోదు చేసి, దేశంలో అత్యంత డిమాండ్ ఉన్న మోడల్‌గా అవతరించింది. ఇటీవల విడుదల అయిన 5 డోర్ థార్ రాక్స్ దాదాపు 7,110 యూనిట్ల విక్రయాలను సాధించింది.

థార్ మార్కెట్లోకి వచ్చిన 4 సంవత్సరాలలోపే ఈ మైలు రాయికి చేరుకోవడం గమనార్హం. దీంతో పాటు 5 డోర్ థార్ రాక్స్ కూడా మంచి విక్రయాలను నమోదు చేస్తుంది. ఈ ఎస్‌యూవీ మార్కెట్లోకి విడుదలైన ఒక గంటలోనే దాదాపు 1.76 లక్షలకు పైగా బుకింగ్‌లను సాధించి సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది. 3 డోర్ థార్ బాగా ఆకట్టుకోవడంతో దీని ఎఫెక్ట్ రాక్స్‌పై పడి దీనికి డిమాండ్ మరింత పెరిగింది.
మహీంద్రా 3 డోర్ థార్ మొదటి మోడల్ 4 అక్టోబర్ 2020న మార్కెట్లోకి లాంచ్ అయింది. దీని లుకింగ్ డిఫరెంట్‌గా ఉండటంతో పాటు పనితీరు కూడా మెరుగ్గా ఉండటంతో రాను రాను డిమాండ్ మరింత పెరుగుతుంది. దీని ధర ప్రస్తుతం రూ. 11.35 లక్షల నుండి రూ. 17.60 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది టర్బోచార్జ్డ్ పెట్రోల్, డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంది.

మహీంద్రా 5డోర్ థార్ పెట్రోల్, డీజిల్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. దీని ధర రూ.12.99 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి రూ.13.99 లక్షల (ఎక్స్- షోరూమ్) వరకు ఉంది. 3-డోర్ల థార్‌లో ఎక్కువ లగేజీ స్పేస్ ఉండగా, అదే 5-డోర్ థార్ రాక్స్‌లో మరింత ఎక్కువ స్పెస్ ఉంటుంది. ప్రస్తుతం థార్ రాక్స్‌కు డిమాండ్ అధికంగా ఉండటంతో కంపెనీ దీని ఉత్పత్తిని పెంచి, వెయిటింగ్ పీరియడ్‌ను తగ్గించడానికి ప్రయత్నాలు చేస్తుంది.
3-డోర్ థార్‌లో 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, రూఫ్ మౌంటెడ్ ఆడియో స్పీకర్లు, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, స్టీరింగ్ మౌంట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ప్రయాణికుల భద్రత పరంగా ఈ థార్‌లో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ మౌంట్, EBDతో కూడిన ABS,హిల్ స్టార్ట్ అసిస్ట్‌లను కూడా అందించారు.

5 డోర్ థార్ రాక్స్‌లో కూడా అధునాతన ఫీచర్లు ఉన్నాయి. క్యాబిన్‌లో 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టం, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, పనోరమిక్ సన్‌రూఫ్, ఫ్రంట్ ఆర్మ్‌రెస్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షల వరకు ఉంటుంది.


Click it and Unblock the Notifications








