భళా మహీంద్రా థార్.. క్రేన్ వల్ల కాలేదు కానీ ఈ ఆఫ్-రోడర్ చేసి చూపింది.. వైరల్ వీడియో!!
మహీంద్రా థార్ ఆఫ్ రోడర్‌లో దీనిని కింగ్‌మేకర్‌గా చెప్పవచ్చు. ఈ ఆఫ్‌రోడర్ ఇప్పటి వరకు పలు సందర్భాల్లో అసాధారణమైన విన్యాసాలు చేసింది. అతికొద్ది రోజుల్లోనే ఇది అతి పెద్ద రెస్క్యూ వాహనంగా కూడా మారిపోయింది. తాజాగా మహీంద్రా థార్ ఓ ఫ్లై ఓవర్ కింద బురదలో చిక్కుకున్న ట్రక్కును (డీసీఎం)ను బయటకు తీసిన వీడియో వైరల్ అవుతుంది. మొదటగా ఈ వాహనాన్ని బయటకు తీసేందుకు వచ్చిన క్రేన్ తేలిపోవడంతో థార్ సహాయంతో దానిని బయటకు తీశారు. మహీంద్రా థార్ పనితీరుకి అక్కడి వారు ఔరా అని ముక్కున వేలేసుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో ఇంటర్‌నెట్‌లో హల్‌చల్ చేస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీ కోసం..
బురదలో ఇరుక్కుపోయిన ట్రక్కును మహీంద్రా థార్ సహాయంతో బయటకు తీసిన వీడియోను ఐ లాస్ట్ డైమెన్షన్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ఆ వీడియో ప్రకారం మొదటగా ఫ్లైఓవర్ కింద క్రేన్‌కి ట్రక్కును కట్టేసి బయటకు లాగేందుకు ప్రయత్నించగా ట్రక్కు బయటకు రాలేక పోయింది. ఆ తర్వాత పలుమార్లు ప్రయత్నించినా ప్రయోగం లేకుండా పోయింది. పలు మార్లు ట్రక్కుని బయటకు లాగేందుకు వారు చేసిన ప్రయత్న బెడిసి కొట్టింది.

ట్రక్కుని బయటకు తీసే క్రమంలో ట్రక్కు పట్టీ విరిగిపోయిన సందర్భాన్ని వీడియోలో చూడవచ్చు. దీంతో క్రేన్‌ని పక్కకు జరిపి మహీంద్రా థార్‌ని అక్కడకు తీసుకువచ్చారు. రెడ్ కలర్ మహీంద్రా థార్ బురదలో అక్కడు చేరుకున్న తర్వాత రివర్స్‌లో ట్రక్కు వద్దకు చేరుకుని బయటకు తీసేందుకు సిద్ధమైంది. ట్రక్కు ఫ్రంట్ బంపర్‌కి మరియు మహీంద్రా థార్ వెనుక టోవ్ హుక్‌కి పట్టీని జత చేశారు.
తర్వాత థార్ డ్రైవర్ ఎస్‌యూవీని నెమ్మదిగా కదిలించడం ప్రారంభించాడు. ఈ సమయంలో మహీంద్రా థార్ ట్రక్కుని బయటకు లాగుతుంది. ముఖ్యంగా మహీంద్రా థార్‌ని ఆఫ్-రోడ్ కింగ్‌గా పిలుస్తారు. ఇది మాన్యువల్ షిఫ్ట్ పార్ట్-టైమ్ 4 వీల్ డ్రైవ్ ద్వారా శక్తిని అందిస్తుంది. థార్ ఎలక్ట్రానిక్ నియంత్రిత బ్రేక్ లాకింగ్ డిఫరెన్షియల్‌తో కూడా అందించబడింది. ఇది థార్ కదలకుండా ఉండటానికి యాక్సిల్ వద్ద జారిపోకుండా ఉండటాన్ని నిరోధిస్తుంది.

మహీంద్రా థార్ మల్టీ ఇంజిన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. ఇందులోని 2.2-లీటర్ డీజల్ ఇంజిన్ 130 bhp మరియు 320nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక రెండో ఇంజిన్ ఆప్షన్‌లో అందుబాటులో ఉన్న 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 150 bhp పవర్ మరియు 32nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫైనల్‌గా 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ 119bhp పవర్ మరియు 300nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.
త్వరలోనే ఈ కారు ఈవీ వెర్షన్‌లో కూడా రానుంది. అడ్వెంచర్, ఆఫ్ రోడ్ రైడింగ్‌ల కోసం మహీంద్రా థార్ కింగ్ మేకర్‌గా ఉంది. అందువల్ల దీనిని కొనేందుకు జనాలు ఏడాది కాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. దీని ధరలు రూ. 14.05 లక్షల నుంచి ప్రారంభం కానున్నాయి. తాజాగా కేదర్‌నాథ్‌లోనూ పర్యాటకులను రక్షించేందుకు మహీంద్రా థార్ సేవలను వినియోగించనున్నారు. ఇందుకోసం రెండు థార్‌లను అధికారులు అక్కడికి చేర్చారు.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








