పనోరమిక్‌ సన్‌రూఫ్‌తో రానున్న' మహీంద్రా థార్‌ రాక్స్‌ 5 డోర్‌'.. ఇక దీనిని ఢీకొట్టే SUVలు పుట్టుకొచ్చేనా?

భారతదేశంలో అత్యంత ప్రాచుర్యం పొందిన స్పోర్ట్స్ యుటిలిటీ వాహనం (SUV) ఏదైనా ఉంటే వెంటనే మహీంద్రా థార్ అని చెప్పేస్తారు. ఈ థార్ ఎస్‌యూవీని మహీంద్రా 2010లో ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి దీని అభిమానులు ఈ మోడల్‌ని ఆదరిస్తూ వస్తున్నారు. దీనిని ఫస్ట్‌ జనరేషన్‌లో ఆఫ్ రోడర్‌గా పరిచయం చేసింది. రెండో జనరేషన్‌ నుంచి పూర్తిగా దీని స్టైలింగ్‌ని మార్చేశారు. దీనిని ఒక లైఫ్ స్టైల్ ఆఫ్-రోడర్ ఎస్‌యూవీగా పరిచయం చేయడంతో మార్కెట్‌లో భారీ డిమాండ్‌ని సాధించింది. ఆన్‌రోడ్‌, ఆఫ్‌రోడ్‌లలో ప్రస్తుతం బెస్ట్‌ ఎస్‌యువీగా అమ్ముడవుతుంది.

అయితే ఈ థార్‌ 3-డోర్ వెర్షన్ అంత ప్రాక్టికల్‌గా లేదు అనే వాదన ఉంది. దీనిలోని సీటింగ్‌ సామర్థ్యం అనేది ఓ సమస్యగా ఉంది. ఈ థార్‌లోని వెనుక సీట్‌ ప్రయాణం అలసటగా ఉంటుందని విశ్లేషకులు పేర్కొన్నారు. ఎక్కువ మంది థార్ వెనుక భాగంలోకి ఎక్కేందుకు విముఖత చూపినట్లు కూడా చాలా రివ్యూల్లో తేలింది. అయితే ఈ ఒక్క విషయం పక్కన పెడితే అన్నింట్లోనూ థార్‌ కింగ్‌ మేకర్‌గా ఉంది.

Mahindra-Thar-Roxx-5-Door-Panoramic-Sunroof

దీంతో ఈ సమస్యకు చెక్‌ పెట్టాలని మహీంద్రా థార్‌ 5 డోర్ల వెర్షన్‌లో తీసుకువస్తుంది. దీనికి థార్ రాక్స్‌ (Mahindra Thar ROXX) అని పేరు పెట్టింది. ఈ 5-డోర్ ఎస్‌యూవీని ఆగస్టు 15 న భారత మార్కెట్‌లో విడుదల చేయనుంది. తాజాగా దీనికి సంబంధించిన ఒక్కో టీజర్‌ని మహీంద్రా విడుదల చేస్తూ వస్తుంది. ప్రతీ రోజు వాహనంలోని ఫీచర్లను రివీల్ చేస్తూ హైప్‌ పెంచుతోంది.

ఇక ఇప్పుడు ఎస్‌యూవీ లోపల కూర్చుని ఆకాశాన్ని వీక్షించేందుకు వీలుగా పనోరమిక్ సన్‌రూఫ్‌ని అందించనున్నట్లు కన్ఫర్మ్‌ చేసింది. కొత్త కారు కొనేటప్పుడు భారతీయులు ఎక్కువగా కోరుకునే సన్‌రూఫ్ ఫీచర్‌ని జోడించడంతో థార్‌పై భారీ అంచనాలు పెరుగుతున్నాయి. పనోరమిక్ సన్‌రూఫ్‌ ఫీచర్‌తో మహీంద్రా థార్ రాక్స్ మారుతి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా వంటి ప్రత్యర్థులు దరిదాపులకు కూడా వచ్చే అవకాశం లేదు.

అయితే ఈ ఫీచర్‌ కేవలం టాప్-ఎండ్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తుందని.. మిడ్-స్పెక్ వేరియంట్ల కోసం కంపెనీ సింగిల్-పాన్ సన్‌రూఫ్‌ (Single Pane Sunroof)ని తీసుకురావచ్చని తెలుస్తోంది. కాబట్టి పనోరమిక్ సన్‌రూఫ్ వేరియంట్ల ధరలు ఎక్కువగా ఉంటుందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

మోనోకాక్ ఎస్‌యూవీ (Monocoque SUV)తో పోలిస్తే (Ladder Frame) నిచ్చెన ఫ్రేమ్ తయారీతో కూడిన వాహనాల్లో పనోరమిక్ సన్‌రూఫ్‌ని అందించడం అనేది కష్టమైన పని. అయితే దీన్ని ఇప్పుడు మహీంద్రా అధిగమించింది. ఈ సన్‌రూఫ్‌ ఫీచర్‌తో మహీంద్రా థార్‌ పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎస్‌యూవీగా మారనుంది. ఇక దీని ఇంటీరియర్‌లోని పెద్ద ఫ్లోటింగ్ ఇన్‌ఫోటైన్‌మెంట్‌ స్క్రీన్ ఉన్నట్లు టీజర్‌లో స్పష్టం అవుతుంది.

థార్ రాక్స్‌లో డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, డ్యూయల్ జోన్ క్లైమేట్ కంట్రోల్, వైర్‌లెస్ ఛార్జర్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. అంతే కాకుండా 360 డిగ్రీల సరౌండ్ వ్యూ మానిటర్ మరియు ఆటో-డిమ్మింగ్ IRVMsతో సహా ADAS లెవల్ 2 ఫీచర్లు ఉన్నాయి. ఇంకా మరెన్నో అదనపు ఫీచర్లను అందించే అవకాశం ఉంది.

ఇక ఇంజిన్ ఆప్షన్ విషయానికి వస్తే, కొత్త 5-డోర్ రాక్స్ కూడా 3-డోర్ మోడల్లో కనిపించే అదే 2.0-లీటర్ ఎమ్‌స్టాలియన్ (mStallion) టర్బో పెట్రోల్ మరియు 2.2-లీటర్ ఎంహాక్ (mHawk) డీజిల్‌తో రావచ్చు. ఇక 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది. మహీంద్రా థార్ రాక్స్‌లో రియర్ వీల్ డ్రైవ్, ఆప్షనల్ ఫోర్ వీల్ డ్రైవ్ సెటప్‌ని స్టాండర్డ్‌గా అందించే అవకాశం ఉంటుంది.

More from DriveSpark

Article Published On: Tuesday, July 30, 2024, 17:18 [IST]
English summary
Mahindra thar roxx 5 door equipped with panoramic sunroof confirmed in teaser
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+