మహీంద్రా థార్‌ 5 కొనేందుకు తొందర పడకు సోదరా.. దీనిలో లోపాలు తెలుసుకుని బుక్‌ చేసుకోండి!

గత కొన్ని నెలలుగా ఎంతో ఆసక్తిగా మహీంద్రా థార్ రాక్స్ 5-డోర్ ఎస్‌యూవీ కోసం జనాలు ఎదురు చూశారు. ఈ ఆఫ్‌రోడర్‌ని ఆగస్టు 14 న కొచ్చిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆ కంపెనీ విడుదల చేసింది. గత కొన్ని రోజులుగా, ఆటోమోటివ్ ప్రపంచం మొత్తం థార్ రాక్స్ గురించి మాట్లాడుకుంటుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ అప్‌డేట్స్, అప్ డేటెడ్ క్యాబిన్ అప్‌హోల్‌స్టరీతో పాటు థార్ రాక్స్ తనకంటూ ఓ ఐడెంటిటీని క్రియేట్ చేసుకునే ఫీచర్లను కలిగి ఉంది. మార్కెట్‌లో థార్ 3 డోర్‌కి లభించిన ప్రజాదరణ థార్ రాక్స్‌కి ఖచ్చితంగా ప్రయోజనం చేకూర్చిందనడంలో సందేహం లేదు.

అయితే 3 డోర్‌ థార్‌తో పోల్చితే రాక్స్‌ 5 డోర్‌లో పలు సమస్యలను రాక్స్ చెక్‌ పెట్టినట్లు మహీంద్రా పేర్కొంది. ముఖ్యంగా థార్ రాక్స్ వెనుక సీట్ల ప్రయాణీకుల కోసం ఎక్కువ స్థలం, లెవల్ 2 ఏడీఏస్‌ సేఫ్టీని కలిగి ఉంది. ఇలా కొన్ని ఇతర మోఢిఫికేషన్స్‌తో ఈ స్ట్రాంగ్‌ 4X4లో చాలానే పాజిటివ్స్ ఉన్నాయి. అయితే థార్ రాక్స్‌లో కొన్ని నెగెటివ్స్ కూడా ఉన్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Mahindra Thar Roxx 5 Door

మైలేజీ: మహీంద్రా థార్ 3 ఎస్‌యూవీ మైలేజీలో అంతంత మాత్రమే అని చెప్పాలి. థార్ రాక్స్ కూడా ఈ విషయంలోనూ అదే అడుగుజాడల్లో నడుస్తోంది. ముఖ్యంగా ఆటోమేటిక్ పెట్రోల్ ఆటోమేటిక్ వేరియంట్‌ లీటరుకు 10 కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజీని అలాగే డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్‌ లీటరుకు 12 కిలోమీటర్ల కంటే తక్కువ మైలేజీ ఇవ్వవచ్చు.

వైట్ ఇంటీరియర్: మహీంద్రా థార్ రాక్స్‌లో వైట్ అప్‌హోల్‌స్టరీ క్యాబిన్‌కి మరింత ప్రీమియం అనుభూతిని పెంచుతున్నప్పటికీ.. దీనిని పరిశుభ్రతలో ఉంచడం సవాలుగా ఉంటుంది. మహీంద్రా థార్ రాక్స్ ఆఫ్-రోడర్ కావడంతో ఇంటీరియర్స్‌లో ధూళి, బురదతో వచ్చి చేరే అవకాశం ఉంటుంది. కారు సీట్లపై, రూఫ్ లైనింగ్ వల్ల క్యాబిన్‌ని తడి గుడ్డతో తుడుచుకోవడం ద్వారా మరకలను శుభ్రం చేయవచ్చని మహీంద్రా పేర్కొంది. ఇది మైనస్‌ అని చెప్పవచ్చు.

Mahindra Thar Roxx 5 Door Interior

ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్: థార్ రాక్స్ మరో ప్రధాన లోపం దాని ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్. ఈ సిస్టమ్‌లో ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే సపోర్ట్‌ని కలిగి ఉన్నప్పటికీ.. మీడియా డ్రైవ్ కోసం ఇచ్చిన అనేక కార్లలో ఇది యాక్టివేట్ చేయబడలేదని ఫిర్యాదులు ఉన్నాయి. డ్రైవ్ సమయంలో ఆండ్రాయిడ్ పరికరాలతో కనెక్టివిటీ స్థిరంగా లేదు. మొబైల్ ఫోన్లను ఎప్పటికప్పుడు కనెక్ట్ చేయాలి.

వైర్‌లెస్, వైర్డ్ కనెక్షన్లు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ సమస్యను పరిష్కరించి కారును కస్టమర్లకు పంపిణీ చేయనున్నారు. ఇక మహీంద్రా థార్ రాక్స్ దాని మునుపటితో పోలిస్తే అనేక మెరుగుదలలను తీసుకువస్తున్నప్పటికీ, దీనిని కొనుగోలు చేయాలనుకునే వారు వైట్ ఇంటీరియర్ నిర్వహణ సవాళ్లు, తక్కువ ఇంధన సామర్థ్యం వంటి సమస్యలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి.

Mahindra Thar Roxx 5 Door Steering

మహీంద్రా థార్ రాక్స్ ధర రూ .12.99 లక్షల నుంచి రూ .20.49 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. మహీంద్రా థార్ రాక్స్ 4WD వేరియంట్ల ధరలను ఇంకా ప్రకటించలేదు. థార్ రాక్స్ టెస్ట్ డ్రైవ్‌లు సెప్టెంబర్‌లో ప్రారంభమవుతాయి. బుకింగ్ విండో అక్టోబర్ 3న ఓపెన్ అవుతుంది.

థార్ రాక్స్ 5-డోర్ల లైఫ్‌స్టైల్ ఎస్‌యూవీలలో మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా వంటి వాటికి గట్టి పోటీ ఇవ్వనుంది. వీటితో పాటు హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ మరియు మారుతి సుజుకి గ్రాండ్ విటారా వంటి మిడ్-సైజ్ ఎస్ యూవీలతో కూడా రాక్స్ పోటీపడనుంది.

More from DriveSpark

Article Published On: Thursday, August 29, 2024, 11:55 [IST]
English summary
Mahindra thar roxx 5 door negatives check details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+