ఎస్‌యూవీల్లో రారాజు టీజర్ అదుర్స్.. మహీంద్రా థార్ అంటే మినిమం ఉంటది!
భారతదేశంలో ఎస్‌యూవీ సెగ్మెంట్‌ని మహీంద్రా థార్ 5-డోర్ వెర్షన్ షేక్ చేయబోతుంది. మహీంద్రా ఈ ఎస్‌యూవీకి అధికారికంగా థార్ రాక్స్ (Thar Roxx) అని పేరు పెట్టింది. ప్రస్తుతం 4×4 మరియు 4×2 ఫార్మాట్లలో అందుబాటులో ఉన్న ప్రస్తుత 3-డోర్ థార్ కంటే థార్ రాక్స్ ఎక్కువ మంది వినియోగదారులను ఆకర్షిస్తుందని భావిస్తున్నారు. థార్ రాక్స్ నేరుగా ఫోర్స్ గూర్ఖాతో పోటీ పడనుంది. భారతదేశం ఎదురుచూస్తున్న ఈ ఎస్‌యూవీని మహీంద్రా ఈ సంవత్సరం స్వాతంత్ర్య దినోత్సవం రోజున విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది.
ఇప్పటికే భారీ హైప్‌లో ఉన్న ఈ కారుపై మరోసారి అంచనాలను పెంచే ఫీచర్లతో కంపెనీ విడుదల చేస్తోంది. మహీంద్రా థార్ రాక్స్ 3-డోర్ వెర్షన్‌తో పోలిస్తే మరింత ప్రీమియం డిజైన్ మరియు ఫీచర్లను కలిగి ఉందని ప్రస్తుతం విడుదలైన తాజా టీజర్‌లో స్పష్టం అవుతుంది. తాజాగా మహీంద్రా విడుదల చేసిన ఈ ఎస్‌యూవీ టీజర్ ఇంటర్‌నెట్‌ని షేక్ చేస్తుంది.

రీడిజైన్ చేసిన వర్టికల్ గ్రిల్, అప్డేటెడ్ ఎల్ఈడీ హెడ్ లైట్లు, DRLs, సర్క్యూలర్ ఫాగ్ ల్యాంప్స్, చతురస్రాకారంలో ఉండే LED టెయిల్ లైట్లు, డ్యూయల్ టోన్ ORVMలు టీజర్‌లో కనిపించాయి. బయటి డిజైన్‌లో చేసిన మార్పులను చూపించారు. థార్ రాక్స్‌లో డ్యూయల్ టోన్ డైమండ్ కట్ అల్లాయ్స్, బ్లాక్ ఫ్రంట్ డోర్ హ్యాండిల్స్, బాడీ కలర్ రియర్ డోర్ హ్యాండిల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్స్, ఫ్రంట్ కెమెరా ఉన్నాయి.
3-డోర్ మోడల్‌లో కనిపించే ఆల్-బ్లాక్ బంపర్స్‌కి బదులుగా, ఇప్పుడు భిన్నమైన సిల్వర్ ఫినిషింగ్‌లో బంపర్లను అందించింది. కొత్త 18-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఈ ఎస్‌యూవీకి మరింత ప్రీమియం లుక్‌ని అందించనుంది. ఇందులోని రెండు అదనపు డోర్లు మరియు వెనుక భాగంలో అదనపు సీట్లను కలిగి ఉండటంతో వీల్ బేస్‌లో కొన్ని మార్పులు చేసినట్లు అర్థం అవుతుంది.

థార్ రాక్స్ ఇంటీరియర్స్ కోసం ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో టీజర్‌లో వెల్లడించలేదు. అయితే ఇప్పటికే విడుదలైన చిత్రాల ప్రకారం ఈ ఎస్‌యూవీలో వచ్చే ఫీచర్లు తెలిసిపోతున్నాయి. థార్ రాక్స్ హై వేరియంట్లలో పనోరమిక్ సన్‌రూఫ్ అందించే అవకాశం ఉంది. ఇందులో బిగ్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, డ్యూయల్ టోన్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
ఇంటీరియర్స్‌లో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, రెయిన్ సెన్సింగ్ వైపర్లు, పుష్ బటన్ స్టార్ట్‌తో కీలెస్ ఎంట్రీ, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. ఇక ఈ థార్ రాక్స్ సేఫ్టీ కిట్‌లో ఆరు ఎయిర్ బ్యాగ్స్, ఫ్రంట్ మరియు రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESP), ఎబిఎస్ విత్ ఇబిడి మరియు లెవల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) ఉన్నాయి.
150 bhp పవర్ మరియు 300 nm టార్క్ ఉత్పత్తి చేసే 2.0-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ మరియు 132bhp మరియు 300 nm టార్క్‌ని ఉత్పత్తి చేసే 2.2-లీటర్ ఎంహాక్ డీజిల్ ఇంజిన్ ఉన్నాయి. ఈ ఇంజిన్లు 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్‌షన్‌తో జతచేయబడతాయి.
ఫోర్స్ గూర్ఖా 5-డోర్ మోడల్‌తో పాటు, మారుతి సుజుకి జిమ్నీకి థార్ రాక్స్ పోటీగా ఉండనుంది. అదే సమయంలో దాని ఆఫ్-రోడ్ సామర్థ్యాలను ఈ ఎస్‌యూవీలోనూ నిలుపుకోనుంది. కొత్త ఎస్‌యూవీ ఎక్స్-షోరూమ్ ధర రూ .15 లక్షల నుంచి ప్రారంభమవుతుందని భావిస్తున్నారు. ఆగస్టు 15న లాంచ్ అయిన వెంటనే డెలివరీ ప్రారంభించాలని కంపెనీ యోచిస్తోంది.


Click it and Unblock the Notifications








