గంటలో లక్షా 76 వేల బుకింగ్స్ పొందిన ఏకైక SUV.. ఇది మీ ఇంట్లోకి రావాలంటే ఏడాదిన్నర వెయిట్ చేయాల్సిందే!
మార్కెట్‌లో ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీలలో మహీంద్రా థార్ క్రేజ్ వేరు. దీనిని కొనుగోలు చేసేందుకు జనాలు ఎగబడుతుంటారు. అందువల్ల దీని వెయిటింగ్ పీరియడ్ భారీగా ఉంటుంది. ప్రస్తుతం థార్ రాక్స్ (Mahindra Thar Roxx) 5 డోర్ల వెర్షన్‌లో అందుబాటులో ఉంది. థార్, మహంద్రా ఎక్స్‌యూవీ 3XO, స్కార్పియో సేల్స్‌తో భారత్‌లో మహీంద్రా కార్ల అమ్మకాల్లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఈ కంపెనీ మంచి సేల్స్ రాబడుతోంది. ఇటీవల కాలంలో ఆ సంస్థ విడుదల చేస్తున్న అన్ని ఎస్‌యూవీలు బంపర్ హిట్ అవుతున్నాయి. దీంతో గత నెలలో టాటా మోటార్స్‌ను వెనక్కి నెట్టి దేశంలోనే టాప్ నెం.3 కార్ల తయారీ సంస్థగా మహీంద్రా అవతరించింది. ప్రస్తుతం ఆ కంపెనీ నుంచి మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO టాప్ ఫర్ఫామర్‌గా ఉంది. తాజాగా లాంచ్ చేసిన థార్ రాక్స్ కూడా బుకింగ్స్‌లో దూసుకెళ్తుంది.
మహీంద్రా థార్ రాక్స్ 5 డోర్ కారుని మహీంద్రా 2024 ఆగస్టు 15 న లాంచ్ చేసింది. వాస్తవానికి ఒక రోజు ముందుగానే బేస్ మోడళ్లను విడదుల చేసి ఆశ్చర్యపరిచింది. అక్టోబర్ 3న బుకింగ్ విండో తెరిచిన గంటలోనే ఏకంగా 1.76 లక్షల యూనిట్లను కస్టమర్లు రిజర్వ్ చేసుకున్నారు. దీంతో రోజులు గడుస్తున్న కొద్దీ 5 డోర్ల థార్ బుకింగ్స్ పెరగుతుండటంతో కంపెనీ కూడా వెయిటింగ్ పీరియడ్‌ని పెంచుతోంది.

వీటి బుకింగ్స్‌పై కస్టమర్లు అందుతున్న మెయిల్ లేదా ఇతర అప్‌డేట్స్ చికాకు తెప్పిస్తున్నాయి. తాజాగా ఓ కస్టమర్ ఒక ఎస్‌యూవీని బుక్ చేసుకున్న తర్వాత ఆర్డర్ ప్రకారం మే 2026 లోపు చేస్తామని తెలిపింది. అంటే దాదాపు ఏడాదిన్నర తర్వాతే ఈ ఆఫ్‌రోడర్ అతనికి డెలివరీ చేయబడుతుందని అర్థం. ప్రస్తుతం మహీంద్రా థార్‌ని నాసిక్ లోని ప్లాంట్‌లో తయారు చేస్తున్నారు.
ఈ ప్లాంట్‌లో ప్రస్తుతం నెలకు 9,500 ఎస్‌యూవీలను ఉత్పత్తి చేయగలదు. వీటిలో 3,000 3-డోర్ థార్ ఎస్‌యూవీలు కాగా.. 6,500 థార్ రాక్స్ ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభానికి ముందే థార్ రాక్స్ కొన్ని యూనిట్లను తయారు చేసినట్లు కంపెనీ మీడియాకు తెలిపింది. కానీ అది ఎంత అనేది చెప్పలేదు. బుకింగ్ లెక్కలను పరిశీలిస్తే ఇంకా లక్ష యూనిట్లు ఉత్పత్తి చేయాల్సి ఉంటుంది.

మహీంద్రా గతంలో ఎక్స్‌యూవీ 700, స్కార్పియో ఎన్ ఎస్‌యూవీలను లాంచ్ చేసినప్పుడు కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. అప్పట్లో కంపెనీ ఉత్పత్తిని పెంచడం ద్వారా సమస్యను పరిష్కరించింది. ఇక్కడ కూడా అదే వ్యూహాన్ని ప్రయోగిస్తారా.. లేకం కస్టమర్ల సహనానికి పరీక్ష పెడతారో చూడాలి. త్వరలోనే ఉత్పత్తి సామర్థ్యంపై అప్‌డేట్ ఇచ్చే అవకాశం ఉందని ఆటోరంగం నిపుణులు చెబుతున్నారు.
ఈ మహీంద్రా థార్ రాక్స్ 18 వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు. కొత్తగా థార్ రాక్స్‌ని బ్రౌన్ ఇంటీరియర్ తీసుకువస్తున్నారు. దీని డెలివరీను జనవరి 2025 లో మాత్రమే ప్రారంభం కానున్నాయి. ఇది 5 డోర్ కాబట్టి థార్ రాక్స్ కంటే 3 కంటే పెద్దదిగా కనిపిస్తుంది. 6 ప్యాక్ గ్రిల్, న్యూ వీల్స్, LED DRL, పిల్లర్ మౌంటెడ్ రియర్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి.

డ్యూయల్ 10.25 ఇంచెస్ డిస్ప్లే ఫర్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే అలాగే టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, రియర్ ఏసీ వెంట్స్‌తో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, హార్మోన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్, పుష్ బటన్ వంటివి ఉన్నాయి. ఈ ఎస్‌యూవీలో సింగిల్ పేన్, పనోరమిక్ సన్‌రూఫ్స్ కూడా ఉన్నాయి.
అలాగే సేఫ్టీ కోసం స్టాండర్డ్‌గా ఆరు ఎయిర్‌బ్యాగ్స్, 360 డిగ్రీల కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), లెవల్ 2 ADAS (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్), లేన్ కీపింగ్ అసిస్ట్, క్రూయిజ్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. దీని ప్రారంభ ధర రూ.12.99 లక్షల నుంచి రూ.22.49 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉంది.


Click it and Unblock the Notifications








