గంటలో 1.76 లక్షల బుకింగ్స్.. హాట్ కేకుల్లా ఆఫ్‌రోడర్ ఎస్‌యూవీని బుక్ చేసుకుంటున్న జనాలు!
ఆగస్టు 14న మహీంద్రా థార్ రాక్స్ (Mahindra Thar Roxx- 5 Door) లాంచ్ అయింది. అయితే ఈ కారు బుకింగ్స్ నిన్న అధికారికంగా ప్రారంభం అయ్యాయి. నిన్న సరిగ్గా ఉదయం 11 గంటలకు మహీంద్రా బుకింగ్స్ స్వీకరించడం ప్రారంభించింది. బుకింగ్స్ ప్రారంభ అయిన కాసేపటికే మహీంద్రా యాజమాన్యం సైతం ఆశ్చర్యపోయేలా రెస్పాన్స్ వచ్చింది. కేవలం 60 నిమిషాలు లేదా 1 గంటలో ఈ మహీంద్రా థార్ రాక్స్‌ని ఏకంగా 1.76 లక్షల మందికి పైగా బుక్ చేసుకున్నారు. ఒక్క గంటలోనే 1,76,218 యూనిట్ల బుకింగ్స్‌ని అందుకుని రికార్డు తిరగరాసింది.
ఇది ఆటోమొబైల్ చరిత్రలోనే అతిపెద్ద విషయం అని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం గంట వ్యవధిలోనే 1.76 లక్షల మంది బుక్ చేసుకున్నారంటే థార్‌కి ఏ రేంజ్‌లో క్రేజ్ ఉందో అర్థం అవుతుంది. ఇక రానున్న రోజుల్లోనూ మహీంద్రా థార్ రాక్స్ సరి కొత్త అమ్మకాల రికార్డులను నెలకొల్పుతుందని భావిస్తున్నారు. ఈ 5 డోర్ల ఆఫ్-రోడ్ ఎస్‌యూవీ ఆరు వేరియంట్లలో లభిస్తుంది.

ఇది ఎంఎక్స్ 1, ఎంఎక్స్ 3, ఎంఎక్స్ 5, ఎఎక్స్ 3 ఎల్, ఎఎక్స్ 5 ఎల్ మరియు ఎఎక్స్ 7 ఎల్ అనే వేరియంట్లలో కస్టమర్లకు తమకు నచ్చిన దాన్ని బుక్ చేసుకోవచ్చు. వీటి ధరలు భారతీయ మార్కెట్‌లో రూ .12.99 లక్షల ప్రారంభ ధరతో ప్రారంభం కానున్నాయి. టాప్ వేరియంట్ ధర రూ.22.49 లక్షలుగా ఉంది. ఇవి ఎక్స్-షోరూమ్ ధరలు మాత్రమే.
మహీంద్రా థార్ రాక్స్ మొత్తం 2 ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇది 2.0 లీటర్ ఎంస్టాలియన్ (mStallian) టర్బో పెట్రోల్ 2.2 లీటర్ ఎంహాక్ (M Hawk) డీజిల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇక ఇందులో 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ టార్క్ కన్వర్టర్ ఆప్షన్స్ ఉన్నాయి. ఇది లీటరుకు 12.4 నుండి 15.2 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది.

ఇందులో టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్, పనోరమిక్ సన్‌రూఫ్ వంటి ఫీచర్లు థార్ రాక్స్‌లో ఉన్నాయి. ఇక ప్రయాణికుల సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్స్, ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), 4 డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి.
థార్ రాక్స్ బయట ఆకర్షణీయమైన డిజైన్‌ని కలిగి ఉంది. ఇందులో ఎల్‌ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్, 'సీ' షేప్‌ని పోలిన LED DRLs, సర్క్యూలర్ ఫాగ్ లైట్లు, అల్లాయ్ వీల్స్, LED టెయిల్ లైట్స్ ఉన్నాయి. ఇంటీరియర్‌లో మంచి డ్యూయల్ థీమ్‌ని కలిగి ఉండనుంది. ఇది సులభంగా 5 మందిని తీసుకెళ్లగలదు. ఇందులో 447 లీటర్ల బూట్ స్పేస్ కూడా ఉంది.
కొద్ది రోజుల క్రితమే కొత్త మహీంద్రా థార్ రాక్స్ ఎస్‌యూవీ మొదటి యూనిట్‌ని వేలం వేయగం రికార్డు ధర పలికింది. ఈ మొట్ట మొదటి యూనిట్ కోసం సుమారు రూ .1.31 కోట్లకు అమ్ముడుపోయింది. ఈ థార్ రాక్స్‌కి సంబంధించిన టెస్ట్‌డ్రైవ్స్ కూడా ఆరంభం అయ్యాయి. ఆసక్తి ఉన్న కొనుగోలుదారులు సమీపంలోని షోరూమ్‌ని సందర్శించి డ్రైవ్ చేసి పరీక్షించవచ్చు. అతి త్వరలోనే వీటి డెలివరీలు ప్రారంభం కానున్నాయి.
ప్రస్తుతం మహీంద్రా థార్ 3 డోర్ భారతీయ మార్కెట్ లోని ఆఫ్-రోడ్ ఎస్‌యూవీలలో నంబర్ వన్‌గా ఉంది. దీనికి గట్టి పోటీని ఇచ్చేందుకు మారుతి సుజుకి జిమ్నీ, ఫోర్స్ గూర్ఖా ఆఫ్‌రోడ్ ఎస్‌యూవీలు అందుబాటులో ఉన్నా కానీ థార్‌కి ఏమాత్రం పోటీని ఇవ్వలేక పోయాయి. ఆకర్షణీయమైన ధరలో మంచి పవర్‌ఫుల్ ఇంజిన్‌తో వీటిని ప్రవేశపెట్టినప్పటికీ థార్‌కి ఏమాత్రం పోటీని ఇవ్వలేకు పోతున్నాయి. ఇది థార్‌కి ఉన్న క్రేజీకి అద్ధం పడుతోంది.


Click it and Unblock the Notifications








