ఈ పొట్టి కారు చాలా గట్టిదండీ.. దేశంలోనే అత్యంత చౌకైన ఆటోమేటిక్‌ కారు కూడా ఇదే!

దేశంలో మెజారిటీ ఫ్యామిలీలు ఎక్కువగా చిన్న కార్లను మాత్రమే కొనుగోలు చేస్తున్నాయి. అందులోనూ బడ్జెట్‌ ధరలో లభించే కార్లను మాత్రమే కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రతీ ఫ్యామిలీలో ఓ కారు అనే కాన్సెప్ట్‌ పెరిగిపోతుంది. కార్లలో ప్రయాణం సులంభంగా, అందరికీ అనుకూలంగా ఉంటాయి. గత కొన్ని నెలలుగా గణాంకాలు సైతం కార్ల అమ్మకాలు పెరిగాయనే విషయాన్నే వెల్లడిస్తున్నాయి. జనాలు చిన్న కార్లలోనూ సేఫ్టీ ఫీచర్లు, కంఫర్ట్‌కి అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారు. గతంలో గేర్‌లెస్ కార్లను కొనడానికి సంకోచించే జనాలు ఇప్పుడు మాన్యువల్ గేర్‌బాక్స్‌కి గుడ్‌ బై చెప్తున్నారు.

గత రెండేళ్లుగా ఆటోమేటిక్ మోడళ్లకు చాలా డిమాండ్ పెరిగింది. ఈ సంఖ్య రోజు రోజుకు ఎక్కువవుతోంది. ఈ ఆటోమేటిక్‌ కార్లతో మహిళలు సులభంగా డ్రైవింగ్ చేయవచ్చు. అంతే కాకుండా ఎక్కువ మైలేజీని సైతం అందిస్తుంది. ముఖ్యంగా సిటీ డ్రైవింగ్‌లో నిరంతరం గేర్లు మార్చడం లేదా మీరు అలసిపోయినప్పుడు ఆటోమేటిక్ డ్రైవింగ్ సహాయపడుతుంది. ట్రాఫిక్‌లో ఆటోమేటిక్ కారు డ్రైవింగ్‌ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది.

MG Comet EV Cheapest Automatic Car

తాజాగా విడుదలవుతున్న ఎంట్రీ లెవల్ కార్లలో ఇప్పుడు ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఆప్షన్‌ని ఉంటుంది. అయితే ఇండియాలో అత్యంత చౌకైన ఆటోమేటిక్ కారు ఏంటని అడిగితే చాలా మంది మారుతి ఆల్టో లేదా రెనాల్ట్‌ క్విడ్ అని ఊహిస్తారు. అలా అయితే మీరు పప్పులో కాలు వేసినట్లే ఎందుకంటే ఎంట్రీ లెవల్‌ కార్లలో ఎంజీ మోటార్‌ నుంచి కామెట్‌ ఈవీ (MG Comet EV) అత్యంత చౌకైన ఆటోమేటిక్‌ కారుగా ఉంది.

అయితే ఇటీవల కామెట్ ఈవీ ధరను తగ్గించడంతో, ఈ మైక్రో ఎలక్ట్రిక్ వాహనం దేశంలో అతి తక్కువ ధర కలిగిన ఆటోమేటిక్ కారుగా నిలిచింది. ఇంత తక్కువ ధరలో ఎలక్ట్రిక్‌ ఆటోమేటిక్‌ కారుని పొందడం అనేది అసాధ్యం అనే చెప్పాలి. తక్కువ ధర, కాంపాక్ట్ డిజైన్‌తో ఆకట్టుకునేలా ఉండటంతో ఈ పొట్టి కారుని జనాలు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. సెలబ్రిటీలు సైతం ఈ కారుని కొనుగోలు చేయడం గమనార్హం.

MG Comet EV Cheapest Automatic Car

అయితే తాజాగా ఈ కారు ధరను కంపెనీ తగ్గిచింది. ఇంతకుముందు ఈ కారు ధర రూ .6.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండేది. ఈ ఎలక్ట్రిక్ రెండు డోర్ల కారుని ఎక్కువ మందికి చేరువ చేయడానికి ఎంజీ మోటార్ బ్యాటరీ-యాజ్‌-ఏ-సర్వీస్ (BaaS) కింద ధరను రూ .4.99 లక్షలకు తగ్గించింది. దీని ప్రకారం బ్యాటరీ ఆప్షన్‌ లేకుండా కిలోమీటరుకు నిర్ణీత మొత్తానికి అద్దెకు చెల్లించి తిరుగవచ్చు.

ఎలక్ట్రిక్‌ కార్లలో బ్యాటరీ ప్యాక్‌ ధర కోసం చాలా ఎక్కువ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు దీనికి బదులుగా వినియోగదారులు వారు నడిపే దూరాన్ని బట్టి బ్యాటరీ వినియోగానికి అద్దె చెల్లించాల్సి ఉంటుంది. దీని ప్యాటరీ ప్యాక్‌ కోసం కిలోమీటర్‌కి రూ.2.50 అద్దె చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. కుటుంబంలో రెండో కారు లేదా ఇంట్లో మహిళల కోసం చిన్న కారు కోసం చూస్తున్న వారికి ఇది సరిపోతుంది.

MG Comet EV

ముందు, వెనుక భాగంలో LED లైట్ బార్లు, బ్రైటర్‌ ఎంజీ లోగో, ఫాగ్ ల్యాంప్స్, LED డేటైమ్ రన్నింగ్ లైట్స్‌ కాంపాక్ట్ లుక్స్‌ ఈ కారుకి ప్రీమియం టచ్‌ని అందిస్తాయి. ఈ ఎంజీ కామెట్ ఒక 3-డోర్‌ కారుగా (వెనక డోర్‌తో కలుపుకుని) ఉంటుంది. రెండు డోర్ల ద్వారా సులభంగా కారులోకి ప్రవేశించవచ్చు. ఇద్దరు పెద్దలు, ఇద్దరు పిల్లలతో ఓ చిన్న ఫ్యామిలీ ఈ కారులో సులభంగా ప్రయాణించవచ్చు.

ఈ ఎంజీ కామెట్ ఈవీ ఇంటీరియర్స్‌ని కూడా అద్భుతంగా తీర్చిదిద్దారు.ఎయిర్‌వెంట్స్‌, బ్లాకీ కప్ హోల్డర్స్, డోర్ ఇన్స్‌ర్ట్స్‌, డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్స్‌ అన్నీ ఇంటీరియర్‌లో చాలా ప్రాక్టికల్‌గా ఉంటాయి. ఇందులోని 17.3 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 230 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. కావున కస్టమర్లు తమకు బ్యాటరీ ఆప్షన్‌ తోనూ దీనిని కొనుగోలు చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, October 7, 2024, 13:27 [IST]
English summary
Mg comet ev cheapest automatic car as it announced battery on rental option
Read more on: #mg motor #cars #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+