ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ లాంచ్‌.. ధర రూ. 21.25 లక్షలు

MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్(MG Hector BlackStorm Edition Launch) SUV ని నేడు భారత మార్కెట్లో విడుదల చేయబడింది. దీని ప్రారంభ ధర రూ. 21.25 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఎంజీ కంపెనీ నుంచి గ్లోస్టర్ మరియు ఆస్టర్ కార్ల తర్వాత, హెక్టర్ కూడా ప్రత్యేక ఎడిషన్‌తో రావడం కస్టమర్లకు గుడ్‌ న్యూస్‌ అని చెప్పవచ్చు.

ప్రత్యేక ఎడిషన్ కావడంతో, కొత్త MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్‌ SUV బాహ్య డిజైన్‌లో కొన్ని ప్రధాన మార్పులను కలిగి ఉంది. బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ కావడంతో ఈ కారు పూర్తిగా బ్లాక్‌ కలర్‌లో ఉంటుంది. అక్కడక్కడా ఎరుపు రంగు షేడ్స్‌ను కలిగి ఉంటుంది. ఇది కాకుండా, ఈ ఎస్‌యూవీ డిజైన్ చాలావరకు సాధారణ హెక్టర్ కారును పోలి ఉంటుంది.

MG-Hector-Blackstorm-Edition-Launched

ఎక్స్‌టీరియర్‌ పరంగా ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌లో 18-అంగుళాల ఆల్-బ్లాక్ అల్లాయ్ వీల్స్, ఆకర్షణీయమైన LED హెడ్‌ల్యాంప్‌లు, టెయిల్‌లైట్ ఉన్నాయి. ఇంటీరియర్‌ పరంగా డ్యాష్‌బోర్డ్, డోర్ హ్యాండిల్స్, స్టీరింగ్ వీల్, సెంటర్ కన్సోల్ మరియు AC వెంట్‌లను కలిగి ఉంది. ఇంటీరియర్ బ్లాక్ కలర్ ఆప్షన్‌తో వస్తుంది.

ఇక ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌(MG Hector BlackStorm Edition) క్యాబిన్‌ హెడ్‌రెస్ట్‌లో బ్లాక్‌స్టార్మ్‌ బ్యాడ్జింగ్ ఉంది. ఇంకా యాంబియంట్ లైటింగ్ ఎరుపు రంగులో ఆకర్షణీయంగా ఉంటుంది. MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్ 5, 6 లేదా 7 సీట్ల ఆప్షన్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉంది.

MG-Hector-Blackstorm-Edition-Launched
-

ఫీచర్ల పరంగా ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌లో 14-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 7-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లతో వస్తుంది.

ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌(MG Hector BlackStorm Edition Price).. 2 పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. ఇందులోని 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 141 PS శక్తిని మరియు 250 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో కొనుగోలు చేయవచ్చు.

MG-Hector-Blackstorm-Edition-Launched

MG హెక్టర్ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్ SUV 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌తో కూడా అందుబాటులో ఉంటుంది. ఇది కేవలం 168 PS మరియు 350 Nm గరిష్ట టార్క్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందుబాటులో ఉంటుంది. ఇది లీటర్‌కు 15.58 కి.మీ మైలేజ్‌ని కూడా అందజేస్తుందని సంస్థ తెలిపింది.

సేఫ్టీ ఫీచర్ల పరంగా, ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ABS (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), ఫ్రంట్ & రియర్ పార్కింగ్ సెన్సార్‌లు, ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు, TPMS (టైర్) వంటి వాటి ఫీచర్లతో వస్తుంది.

MG-Hector-Blackstorm-Edition-Launched

వీటితో పాటు ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా ఫీచర్‌ను కలిగి ఉంది. భారత మార్కెట్లో టాటా హారియర్ మరియు సఫారీ మోడల్స్ ఈ కారుకు బలమైన ప్రత్యర్థులుగా ఉన్నాయి. ఎంజీ హెక్టర్‌ బ్లాక్‌స్టార్మ్‌ ఎడిషన్‌ వేరియంట్లను బట్టి ధరలు మారుతుంటాయి. పూర్తి వివరాల కోసం షోరూంను సంప్రదించవచ్చు.

More from DriveSpark

Article Published On: Wednesday, April 10, 2024, 18:13 [IST]
English summary
Mg hector blackstorm edition launched in india price features specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+