ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో ఆ కంపెనీ కార్లు నంబర్ వన్.. మీరు కూడా వీటినే ట్రై చేయండి సుమీ!

దేశంలో టాటా ఎలక్ట్రిక్‌ కార్లు మార్కెట్‌లో నంబర్‌.1 గా ఉన్నాయి. అయితే ఇప్పుడు సీన్‌ మారిపోనుంది. అక్టోబర్ 2024లో ఎంజీ మోటార్స్‌ నుంచి ఎంజీ విండ్సర్‌ (MG Windsor EV)ని తన అత్యధిక నెలవారీ అమ్మకాలను నమోదు చేసింది. గత నెలలో ఎంజీ మోటార్స్ మొత్తం 7,045 ఎలక్ట్రిక్‌ కార్ల యూనిట్లను విక్రయించింది. 2023లో విక్రయించిన 5108 ఎలక్ట్రిక్‌ యూనిట్లతో పోలిస్తే 37.92 శాతం వృద్ధి నమోదైంది. భారత్‌లో ఎంజీ మోటార్స్‌ అడుగు పెట్టినప్పటి నుంచి ఇదే అత్యధికం. ప్రస్తుతం ఎంజీ మోటార్స్‌ అమ్మకాల్లో ఎలక్ట్రిక్ వాహనాల వాటా 70 శాతంగా ఉంది. మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్‌ని ఎంజీ మోటార్స్‌ అధిగమించింది.

ఇందులో ప్రధాన కారణం ఎంజీ విండ్సర్ ఈవీ క్రాసోవర్ యుటిలిటీ వెహికల్ (CUV)కి అధిక బుకింగ్స్‌ రావడమే అని చెప్పాలి. ఈ కారు బుకింగ్స్ ప్రారంభమైన మొదటి రోజే 15,000 కస్టమర్లు దీనికి బుక్‌ చేసుకున్నారు. అయితే గత నెలలో విండ్సర్ ఈవీ బెస్ట్ సెల్లర్ ఎలక్ట్రిక్‌ కారుగా నిలిచింది. అంతే కాకుండా సేల్ ప్రారంభమైన మొదటి నెలలోనే 3116 విండ్సర్ ఈవీలను ఆ సంస్థ విక్రయించింది.

MG Windsor EV

విండ్సర్ మార్కెట్‌లో ట్రెండ్‌ సెట్టింగ్‌ చేస్తోంది. అక్టోబర్ 2024 లో భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ప్యాసింజర్ ఎలక్ట్రిక్ కారుగా ఎంజీ విండ్సర్‌ నిలిచింది. ఈ కారుని బ్యాటరీ యాజ్ ఏ సర్వీస్ (BaaS) ప్రోగ్రామ్ కింద ‌అందుబాటులో ఉన్న మొట్ట మొదటి ఎలక్ట్రిక్ కారుగా విండ్సర్ ఈవీ నిలిచింది. కస్టమర్లు బ్యాటరీ రెంటల్ ప్రోగ్రామ్ కింద కేవలం రూ. 9.99 లక్షలు మాత్రమే కావడం విశేషం.

అయితే విండ్సర్‌ ఈవీని బాస్ సర్వీస్‌ కింద ఎంత మంది కొనుగోలు చేశారనే విషయాన్ని ఎంజీ మోటార్స్‌ వెల్లడించలేదు. బాస్‌ ప్రోగామ్‌ కింద ప్రతి కిలోమీటర్‌కి రూ.3.50 అద్దెను చెల్లిస్తే సరిపోతుంది. బ్యాటరీని అద్దెకు తీసుకోకుండా కొనుగోలు చేసే వారు రూ.13.50 లక్షల ప్రారంభ ధరతో కారుని కొనుగోలు చేయవచ్చు. ఎంజీ విండ్సర్ ఈవీ చూడటానికి పెద్ద హ్యాచ్‌బ్యాక్‌ వలె కనిపిస్తుంది.

MG Windsor EV Feauters

ఈ ఎంజీ విండ్సర్‌ ఈవీ ఎక్సైట్ (Excite), ఎక్స్‌క్లూజివ్ (Exclusive), ఎసెన్స్ (Essence) అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీనిని టర్కోయిస్ గ్రీన్, స్టార్‌బర్ట్స్‌ బ్లాక్, పర్ల్ వైట్, క్లే బీజ్ కలర్‌ ఆప్షన్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ఫుల్‌ ప్యాక్డ్‌ ఫీచర్లతో అందుబాటులో ఉంటుంది. ఇందులో 15.6 ఇంచెస్‌ ఫ్లోటింగ్ టచ్‌స్క్రీన్‌, కనెక్టివిటీ ఆప్షన్లు, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్‌ ఉన్నాయి.

అంతే కాకుండా ఎలక్ట్రానిక్ టెయిల్‌గేట్‌, యాంబియంట్ లైటింగ్, స్టీరింగ్ వీల్‌ అమర్చిన మీడియా కంట్రోల్స్, లెవల్-2 ఏడీఏఎస్, 360 డిగ్రీల సరౌండ్ వ్యూ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ తదితర ఫీచర్లు ఉన్నాయి. సీటింగ్‌లోనూ అందరికీ కంఫర్ట్‌గా ఉంటుంది. ఇక సేఫ్టీ పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ఆటో హోల్డ్‌తో ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ ఉన్నాయి.

MG Windsor EV Sales

వీటితో పాటు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ కెమెరాలు, రియర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి. ఇందులోని 38 కిలోవాట్ల లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఫుల్‌ ఛార్జ్ చేస్తే 330 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. 3 కిలోవాట్ల ఛార్జర్‌తో 15 గంటల్లో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు. 7.4 కిలోవాట్ల ఫాస్ట్ ఛార్జర్‌తో గంటలోనే 80 శాతం ఛార్జ్ చేయవచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, November 4, 2024, 12:50 [IST]
English summary
Mg motor electric vehicles sales report october 2024
Read more on: #mg motor #car sales #india
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+