ఎగిరి గెంతేస్తున్న కస్టమర్లు.. సింగిల్ ఛార్జ్‌తో 332 కిమీ.. డెలివరీలు స్టార్ట్

కార్ల తయారీ కంపెనీలలో అగ్రగామిగా ఉన్న దిగ్గజ సంస్థ 'ఎంజీ మోటార్ ఇండియా(MG Motor India)' గతంలో లాంచ్ చేసిన 'విండ్సర్ ఎలక్ట్రిక్ (Windsor EV)' కారును కస్టమర్లకు డెలివరీ చేయడం ప్రారంభించింది. ఎంజీ బ్రాండ్ నుంచి వచ్చిన మూడో ఎలక్ట్రిక్ కారు ఇది. ఈ కారు సింగిల్ ఛార్జింగ్‌తో 332 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. పెట్రోల్, డీజిల్ కార్లకు ముగింపు పలుకుతూ, ఈవీ కారును తీసుకోవాలనుకునే వారికి ఇది చాలా మంచి ఆప్షన్. రేంజ్ ఎక్కువగా ఉండటంతో ఇతర ఈవీ కార్లకు గట్టి పోటీ ఇస్తోంది.

ఎంజీ విండ్సర్ ఈవీ ధర రూ. 9.9లక్షలు(ఎక్స్ షోరూం)గా ఉంది. ఈ ధరలో బ్యాటరీ లభించదు. దీన్ని రెంటల్ ప్రాతిపదికన తీసుకోవాలి. దీని కోసం కంపెనీ కొత్తగా బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ (BaaS) అనే విధానాన్ని ప్రవేశపెట్టింది. బ్యాటరీ రెంట్ కిలోమీటర్‌కు రూ. 3.5గా ఉంది.

Mg Windsor Ev Side

ఇలా అయితే ఏడాదికి 50,000 కిలోమీటర్లు తిరిగినా కూడా రూ. 2 లక్షల లోపే ఖర్చు అవుతుంది. ఒక వేళ బ్యాటరీ యూజ్ ఏ సర్వీస్ (BaaS) లేకుండా కారును కొనుగోలు చేయాలనుకుంటే రూ. 13.5 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కారు మూడు ట్రిమ్‌లలో, నాలుగు కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.

MG విండ్సర్ EV లాంచ్ అయిన మొదటి రోజునే 15 వేల కంటే ఎక్కువ బుకింగ్‌లను సాధించింది. పర్యావరణ అనుకూల ప్రయాణాల కోసం వెతుకుతున్న భారతీయులను ఈ కారు బాగా ఆకర్షించింది. సెప్టెంబర్‌లో బుకింగ్‌లు మొదలు కాగా, ఈ పండుగల టైంలో కస్టమర్లకు డెలివరీలు చేస్తున్నారు.

Mg Windsor Ev Front

MG విండ్సర్ EV బ్యాటరీ-ఛార్జింగ్: ఎంజీ విండ్సర్ ఈవీ(MG Windsor EV)37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. దీని ఈవీ మోటార్ 134bhp వద్ద 200Nm టార్కును ఉత్పత్తి చేస్తుంది. కారును ఒక్కసారి ఛార్జింగ్ చేసినట్లయితే 332 కిమీల రేంజ్‌ను అందిస్తుంది. ఇది 45kW DC ఛార్జర్‌తో వేగవంతమైన ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ కేవలం 55 నిమిషాల్లో 10% నుండి 80% వరకు ఛార్జ్ అవుతుంది.

ఎక్స్‌టీరియర్ డిజైన్: బయటి వైపు నుంచి చూసినట్లయితే ఈ కారు సరికొత్త డిజైన్‌తో హెడ్‌ల్యాంప్‌లను కలిగి ఉంది. ఇంకా ఫ్లోటింగ్ రూఫ్‌లైన్, 18-అంగుళాల క్రోమ్ అల్లాయ్ వీల్స్, పాప్-అవుట్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఈవీ పొడవు- 4,295 మిల్లీమీటర్లు, ఎత్తు- 1,677 మిమీ, వెడల్పు- 1,850 మిమీ, వీల్‌బేస్‌- 2,700 మిమీగా ఉంది.

ఇంటీరియర్ డిజైన్: కారు లోపల క్యాబిన్‌‌లో 15.6-అంగుళాల భారీ డిస్‌ప్లే ఉంది. ముఖ్యంగా దీనిలో హైలెట్ ఏమిటంటే 135 డిగ్రీల వరకు వంగి ఉండే సీట్లు ప్రత్యేకంగా ఉంటాయి. ఇది విమానాల్లో బిజినెస్ క్లాస్‌లో కూర్చున్నఅనుభవాన్ని అందిస్తుంది. పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, 360 డిగ్రీల కెమెరా, 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

ఇతర ఫీచర్లు: వైర్‌లెస్ ఛార్జర్, ఏసీ వెంట్‌లతో కూడిన క్లైమేట్ కంట్రోల్, లెవల్ 2 ఏడీఏఎస్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, LED టెయిల్ లైట్ యూనిట్స్‌, వెనుక వైపు గ్లాస్‌హౌస్ కింద కనెక్ట్ చేసిన టెయిల్‌ల్యాంప్‌లు, క్రోమ్ గార్నిష్‌లు, USB ఛార్జింగ్ పోర్టులు, 8.8 అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్‌ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ వంటి పలు ఫీచర్లు ఉన్నాయి.

వీటితో పాటు ఇంకా వినియోగదారులకు నచ్చే పలు లేటెస్ట్ టెక్నాలజీలను ఎంజీ మోటార్ తన విండ్సర్ EV లో అందించింది. ఈ కారు ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్స్ అనే నాలుగు డ్రైవ్ మోడ్‌లను కలిగి ఉంటుంది. పండుగ సమయంలో కారును అందుకుంటున్న కస్టమర్లు తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.

More from DriveSpark

Article Published On: Monday, October 14, 2024, 18:25 [IST]
English summary
Mg motor has started delivering windsor ev all details in telugu
Read more on: #india #auto #mg motor
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+