జీరో డౌన్‌పేమెంట్‌తో ఈ కంపెనీ కార్లను కొనుగోలు చేయవచ్చు.. ఆఫర్ అదిరిందయ్యా చంద్రం!
భారత ఆటోమొబైల్ మార్కెట్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగుతోంది జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ సంస్థ. ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తూ మార్కెట్లో జోరు పెంచుతోంది. ఇదే క్రమంలో వినియోగదారులను ఆకర్షించేందుకు అనేక కొత్త స్కీమ్స్‌తో ముందుకు వస్తోంది. "బ్యాటరీ యాస్ ఏ సర్వీస్" పేరుతో ఇటీవలె ఒక ప్రత్యేక స్కీమ్ ప్రకటించింది. ఇప్పుడు జీరో డౌన్ పేమెంట్‌తో తమ కార్లను సొంతం చేసుకోవచ్చని తెలిపింది. ఆ విశేషాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ జీరో డౌన్ పేమెంట్ స్కీమ్.. తన ఐసీఈ వాహనాలైన ఆస్టర్, హెక్టర్ మోడళ్లకు వర్తించనున్నట్లు ఎంజీ మోటార్స్ సంస్థ ప్రకటించింది. దీంతో ఎవరైనా సరే జేబులో ఒక్క రూపాయి లేకపోయినా.. ఈ కారును తమ ఇంటికి తెచ్చుకోవచ్చు. అయితే కొన్ని నిర్దిష్ట పత్రాలు మాత్రం తప్పకుండా సమర్పించాల్సి ఉంటుందండోయ్! ఈ ఆఫర్.. డిసెంబర్ 25 నుంచి డిసెంబర్ 31 వరకు మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఈ రెండు మోడళ్ల కార్లను కొనే వినియోగదారులకు.. 100% వరకు ఆన్-రోడ్ ప్రైస్ ఫండింగ్ అందించనుంది. అంతేకాకుండా.. ఈ కార్లకు సంబంధించి యాక్సెసరీస్ కొనుగోలు చేసేందుకు రూ. 50,000 వరకు ఫండింగ్ సదుపాయాన్ని కూడా కల్పించనున్నట్లు తెలిపింది.
భారత మార్కెట్‌లో విడుదలైనప్పటి నుంచి ఆస్టర్, హెక్టర్ మోడల్ కార్లకు వినియోగదారుల నుంచి మంచి రెస్పాన్స్ లభించింది. SUV మోడల్స్ అయిన ఈ రెండు కార్లు.. హై ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం అందించనున్న ఈ ఆఫర్‌తో ఏడు సంవత్సరాల వరకు ఫైనాన్సింగ్ సదుపాయాన్ని కస్టమర్స్ పొందగలుగుతారు. అంతేకాకుండా.. ఎక్స్టెండెడ్ వారంటీతో పాటు లోన్ ప్లాన్‌పై మెయింటెనెన్స్ ప్యాకేజెస్ కూడా ఆ సంస్థ అందించనుంది.

ఎంజీ హెక్టర్ SUV టాప్ ఎండ్ వేరియంట్ కారు (ఎక్స్- షోరూమ్) ధర రూ. 13.9 లక్షల నుంచి రూ. 22.57 లక్షలుగా ఉంది. ఇక ఆస్టర్ మోడల్ విషయానికి వస్తే (ఎక్స్- షోరూమ్) రూ. 9.98 లక్షల నుంచి రూ. 18.08 లక్షల మధ్య ఉంటుంది. హెక్టర్ SUV.. Style, Shine pro, Select pro, Smar pro, Sharp pro, Savvy pro అనే ఆరు వేరియంట్లలో అందుబాటులో ఉంది.
ఈ కారు 1.5 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్, 2.0 లీటర్ డీజిల్ ఇంజన్ తో ఉంటుంది. టర్బో పెట్రోలియం 140bhp వద్ద 250Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. డీజిల్ ఇంజన్ అయితే 168bhp వద్ద 350Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో ఈ కారు ఉంటుంది.
ఆస్టర్ విషయానికి వస్తే.. Sprint, Shine, Select, Sharp pro, Savvy pro అనే ఐదు ఐదు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ కారు 1.3 లీటర్ టర్బో పెట్రోల్ 1.5 లీటర్ నాచురల్లీ యాస్పిరేటెడ్ యూనిట్‌తో ఉంటుంది
ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్ మార్కెట్లో ఎంజీ మోటార్ సంస్థ జోరు ప్రదర్శిస్తోంది. ఇక ఇప్పుడు ఐసీఈ కార్ మార్కెట్‌లో తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం ప్రకటించిన ఈ ఆఫర్లతో తమ కార్ల అమ్మకాలు విపరీతంగా పెరుగుతాయని ఆ సంస్థ ఆశిస్తోంది. సేల్స్ విషయంలో ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇస్తూ దూసుకెళ్లే ఉద్దేశంతోనే 2024 ఇయర్ అండ్ ముందు ఈ ఆఫర్ ప్రకటించినట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications








