ఎంజీ మోటార్స్‌ నుంచి రేపే కొత్త ఎలక్ట్రిక్‌ కారు విడుదల.. ధర, టాప్‌ ఫీచర్లు, తెలుసా!

ఎంజీ మోటార్ ఇండియా సరికొత్త ఎలక్ట్రిక్‌ కారు విండ్సర్‌ని రేపు (సెప్టెంబర్ 11)న మార్కెట్‌లో విడుదల చేయనుంది. దేశంలో ఇప్పటికే టెస్ట్‌డ్రైవ్‌ని నిర్వహించింది. ఇప్పటికే పలు టీజర్లు ఇతర సామాజిక మాధ్యమాల ద్వారా కూడా ఈ కారుకు సంబంధించిన వివరాలు ఒక్కొక్కటిగా బయటకు వచ్చాయి. ఈ కొత్త ఆల్-ఎలక్ట్రిక్ వెహికల్ చైనాలో భారీగా సేల్స్‌ అవుతున్న వులింగ్ క్లౌడ్ ఈవీ ఆధారంగా రూపొందించబడింది. ఇది ఇప్పుడు ఎంజీ ఇండియా దాని ఈవీ పోర్ట్‌ఫోలియోలో ZS ఈవీ, కామెట్ ఈవీలతో పాటు ఈ విండ్‍సర్ ఈవీ కూడా విక్రయానికి రేపటి నుంచి అధికారికంగా అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త కారుకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో మీ కోసం..

ఇప్పటి వరకు కంపెనీ తన సోషల్ మీడియా పేజీలలో పంచుకున్న అనేక టీజర్లలో చూపించిన డిజైన్‌తోనే మార్కెట్‌లో అడుగుపెట్టనుంది. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌టీరియర్‌ డిజైన్‌ మరింత అధునాతనంగా ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్ ల్యాంప్స్, ఫ్రంట్ ఫెండర్‌లో మౌంటెడ్ ఛార్జింగ్ పోర్ట్, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్ ఉన్నాయి. ఇంకా పూర్తి డిజైన్‌కి సంబంధించిన వివరాలు రేపు వెల్లడి కానున్నాయి.

MG Windsor EV Launching Tomorrow

ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారులో 50.6 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఉండనుంది. ఇది ఫుల్ ఛార్జ్ చేస్తే లీటరుకు 460 కిలోమీటర్ల రేంజ్‌ ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 136 ps శక్తిని 200 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయునుంది. ఫర్ఫామెన్స్‌లో ఇతర ఎంజీ కార్లతో పోల్చితే ఇందులో భారీ మార్పులు చేసే అవకాశం ఉంది.

ఎంజీ విండ్సర్ 5-సీటర్ వెర్షన్‌లో అమ్మకానికి రావచ్చు. ఈ కొత్త కారులో 15.6 అంగుళాల టచ్ స్క్రీన్, ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్, పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తాయని టీజర్ ఫోటోలను చూస్తే అర్థం అవుతుంది. అంతే కాకుండా ఇందులో ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్, 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి.

MG Windsor EV Launch

ఈ ఎలక్ట్రిక్ కారులోని ప్రయాణికులకు మెరుగైన సేఫ్టీని అందిస్తుందని భావిస్తున్నారు. ముఖ్యంగా ఇందులో సేఫ్టీ కోసం 6 - ఎయిర్ బ్యాగ్స్‌, TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేకులు ఉన్నాయి. అయితే, ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఇంకా తదితర సేఫ్టీ ఫీచర్లు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ పోటీ సరసమైన ధరలోనే కొనుగోలు చేయడానికి అందుబాటులో వస్తుందని భావిస్తున్నారు. దీనిలోని ఫీచర్లు, భారీ డిజైన్‌ మోటార్‌ ఫర్ఫామెన్స్ ఆధారంగా దీని ధర సుమారు రూ.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని భావిస్తున్నారు. ఇది మార్కెట్‌లో టాటా కర్వ్ ఈవీ, బీవైడీ ఈ6 వంటి మోడళ్లతో పాటు ఇవే స్పెసిఫికేషన్స్‌తో వచ్చే కార్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

మొత్తం మీద, రేపు దేశీయ మార్కెట్లో విడుదల కానున్న ఎంజీ విండ్సర్ ఈవీపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే కొందరు నిపుణులు మాత్రం ఇది ఊహించిన దానికంటే తక్కువ ధరకే అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. రాబోయే పండుగ సీజన్‌లో ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే.. ఇది కూడా ఓ మంచి ఆప్షన్‌గా ఉంటుందని ఆటోమొబైల్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, September 10, 2024, 18:13 [IST]
English summary
Mg windsor electric car launching tomorrow expected price and features details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+