ఖతర్నాక్‌ ఫీచర్లతో ఎంజీ విండ్సర్‌ ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది.. టాటా కంపెనీకి మొదలైన భయం!

దేశంలోని మొత్తం ఎలక్ట్రిక్‌ కార్ల సేల్స్‌లో టాటా మోటార్స్ 60 శాతం వాటాను కలిగి ఉంది. సేఫ్టీ, భారీ రేంజ్‌, మంచి ఫీచర్లు అందిస్తుండంటంతో జనాలు ఎక్కువగా ఈ కంపెనీ కార్లను మాత్రమే కొంటున్నారు. అయితే ఈ కంపెనీకి గట్టి పోటీని ఇవ్వడానికి ప్రముఖ కార్ల తయారీ సంస్థగా గుర్తింపు పొందిన ఎంజీ ఎలక్ట్రిక్ కార్ల శ్రేణిని దేశంలో మరింత విస్తరిస్తోంది. అందులో భాగంగా ఎంజీ ZS, కామెట్ ఈవీ తర్వాత భారత్‌లో తమ మార్కెట్‌ని పెంచుకునేందుకు ఎంజీ విండ్సర్‌ ఈవీని (MG Windsor EV) విడుదల చేసింది.

భారత్‌లో సరసమైన ధరలో, ఆకర్షణీయమైన ఫీచర్లతో పాటు ఎక్కువ రేంజ్‌ అందించే కార్లకు కాస్త గిరాకీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే వీటినే జనాలు ఎక్కవ సంఖ్యలో కొనుగోలు చేస్తారు. అదే స్ట్రాటజీతో ఎంజీ మోటార్ సంస్థ కూడా ఈ సరికొత్త విండ్సర్ ఈవీని విడుదల చేసింది. కొత్త విండ్సర్ ఎలక్ట్రిక్ కారు ధర, ఫర్ఫామెన్స్, ఇతర ఫీచర్ల గురించి మరింత సమాచారం ఈ కథనంలో మీకోసం..

MG Windsor EV Top Things

బ్యాటరీ ప్యాక్: ఈ ఎంజీ విండ్సర్ ఈవీ 38 కిలోవాట్స్‌ బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. దీనిని ఫుల్‌ ఛార్జ్ చేస్తే 331 కిలోమీటర్ల పరిధిని (రేంజ్‌) అందిస్తుంది. దీనిలోని సింగిల్‌ మోటార్‌ 134 bhp పవర్‌ని 200 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. అయితే ఇది బ్యాటరీ యాజ్ ఎ యూజ్‌ కింద బ్యాటరీ కోసం ప్రతీ కిలోమీటర్‌కి రూ. 3.50 లకు చెల్లించాల్సి ఉంటుంది.

డిజైన్: కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ ఎక్స్‌టీరియర్‌ అద్భుతమైన డిజైన్‌ని కలిగి ఉంది. ఇందులోని స్ప్లిట్ LED హెడ్‌ల్యాంప్స్, LED DRL, ప్రొజెక్టర్ హెడ్‌లైట్స్‌, ఫ్రంట్‌, రియర్, ఎల్ఈడీ లైట్స్‌, L ఆకారంలో ఉన్న ఎల్ఈడీ టెయిల్ లైట్లు, ఫ్లష్ ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్స్, 18 ఇంచెస్‌ అల్లాయ్ వీల్స్, 215/55 R 18 టైర్లు ఉన్నాయి.

MG Windsor EV

ఈ కారు 4,295 మిమీ పొడవు, 1,850 మిమీ వెడల్పు, 1,652 మిమీ ఎత్తు కలదు. అంతే కాకుండా ఇది 2,700 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంది. ఇందులో సౌకర్యవంతంగా 5 మంది కూర్చొని ప్రయాణించవచ్చు. కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ టర్కోయిస్ గ్రీన్, పెర్ల్ వైట్, క్లే బీజ్, స్టార్బర్‌బార్ట్స్‌ బ్లాక్ అనే నాలుగు కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

ఫీచర్లు: ఎంజీ విండ్సర్ ఈవీలో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీలెస్ ఎంట్రీ, పుష్ బటన్ స్టార్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ కారులో ఎకో, ఎకో ప్లస్, నార్మల్, స్పోర్ట్ వంటి డ్రైవింగ్ మోడ్స్ ఉన్నాయి.

MG Windsor EV Top Things

సేఫ్టీ ఫీచర్స్: ఎంజీ విండ్సర్ ఎలక్ట్రిక్ కారు ప్రయాణికులకు మంచి సేఫ్టీని అందిస్తుంది. 6-ఎయిర్ బ్యాగ్స్‌, టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఇఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360 డిగ్రీల కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి. అయితే ఇందులో ఏడీఏఎస్ (అడ్వాన్స్‌డ్‌ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌) సేఫ్టీ ఫీచర్లు లేవు.

ధర: కొత్త ఎంజీ విండ్సర్ ఈవీ అత్యంత సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ధర రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్) మాత్రమే. ఇది జేఎస్‌డబ్ల్యూ, ఎంజీ మోటార్ భాగస్వామ్యంతో విడుదల చేసిన తొలి కారు ఇది. ఇది ముఖ్యంగా మార్కెట్‌లో టాటా కార్లకు గట్టి పోటీని ఇస్తుంది.

More from DriveSpark

Article Published On: Wednesday, September 11, 2024, 19:10 [IST]
English summary
Mg windsor ev all top things to know check here in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+