ఎంజీ విండ్సర్ ఈవీ విడుదల.. ధర రూ. 9.99 లక్షలు మాత్రమే, కానీ ఓ షరతు ఉంది!
ఎంజీ విండ్సర్ ఈవీ (MG Windsor EV) భారత్‌లో నేడు అధికారికంగా లాంచ్ అయ్యింది. ఇది ఎంజీ జెడ్ఎస్ (MG ZS), ఎంజీ కామెట్ ఈవీ (MG Comet EV) తర్వాత ఆ సంస్థ నుంచి భారత్‌లో అడుగుపెడుతున్న 3 వ ఎలక్ట్రిక్ కారుగా ఉంది. ఈ విండ్సర్ ఈవీ ప్రస్తుతం ఆ కంపెనీ చైనాలో విక్రయించే రీబ్యాడ్జ్డ్ వులింగ్ క్లౌడ్ ఈవీ (Wuling Cloud EV) ఆధారంగా రూపొందించారు. ఈ ఎలక్ట్రిక్ కారుని జిందాల్ స్టీల్ వర్క్స్ (JSW)తో కలిసి ఎంజీ మోటార్ ఇండియా డెవలప్ చేసి లాంచ్ చేసింది. ఇది భారతీయ మార్కెట్‌లో భారీ అంచనాల మధ్య విడుదల అయ్యింది.
ఈ విండ్సర్ ఈవీ ఫస్ట్ ఆల్-ఎలక్ట్రిక్ మల్టీ-పర్పస్ వెహికల్‌గా విడుదలైంది. ఎంజీ దీనిని సీయూవీ (క్రాసోవర్ యుటిలిటీ వెహికల్) గా పిలుస్తుంది. ఈ కొత్త ఈవీ కామెట్ ఈవీ, జెడ్ఎస్ ఈవీల మధ్య ధరతో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ కారు విడుదలతో మార్కెట్‌లో తన గ్రిప్‌ని మరింత పెంచుకోవాలని ఎంజీ మోటార్స్ ఇండియా ప్రస్తుతం లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే దీనిపై భారీ ఆశలు పెట్టుకుంది.

ఎట్టకేలకు విడుదలైన ఈ సీయూవీ ప్రారంభ ధరను రూ .9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)లుగా నిర్ణయించింది. అయితే ఈ కారు బ్యాటరీని మాత్రం రెంటల్ మాడ్యూల్‌లో కిలోమీటరుకు రూ.3.50లు చెల్లించాల్సి ఉంటుంది. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ (BaaS)తో వస్తున్న తొలి ఎలక్ట్రిక్ కారు ఇదే కావడం విశేషం. కావున బ్యాటరీ కోసం కస్టమర్లు అధికంగా చెల్లించాల్సి ఉంటుంది.
అంతే కాకుండా ఈ కారుని బై బ్యాక్ పాలసీలో 3 సంవత్సరాల తర్వాత కూడా 60 శాతం సొమ్ముని తిరిగి పొందవచ్చు. ఈ విండ్సర్ ఈవీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభం కాగా.. టెస్ట్ డ్రైవ్స్ 25 సెప్టెంబర్ నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 12 నుంచి ఈ కార్లను కస్టమర్లకు డెలివరీలు చేయనున్నారు. కిలోమీటర్ తగినట్లుగా బ్యాటరీ సర్వీస్‌ని ఎంచుకోకవడం ద్వారా ఖర్చు గణనీయంగా తగ్గుతుంది.

ఎంజీ విండ్సర్ సీయూవీ వెర్షన్ కావున సెడాన్, ఎస్‌యూవీల మధ్య డిజైన్‌లో ఉంటుంది. దీని ఎక్స్‌టీరియర్ డిజైన్ ప్రత్యేకంగా ఉంటుంది. ఈ విండ్సర్ ఈవీ పొడవు 4,295 మిల్లీమీటర్లు అంటే ఇది జెడ్ఎస్ ఈవీ కంటే కొంచెం చిన్నదిగా ఉంటుంది. 1,677 మిమీ ఎత్తు , 1,850 మిమీ వెడల్పు, 2,700 మిమీ వీల్‌బేస్‌ని కలిగి ఉంటుంది.
ఇది జెడ్ఎస్ ఈవీ కంటే విండ్సర్ ఈవీ చాలా ఎక్కువ రియర్-సీట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. 18 అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ LED DRLs, హెడ్‌లైట్ యూనిట్స్, ఫ్రంట్ ఛార్జింగ్ ఇన్‌లెట్, LED టెయిల్ లైట్ యూనిట్స్ ఉన్నాయి. ఇది ఫ్లష్-ఫిట్టింగ్ డోర్ హ్యాండిల్‌ని కూడా పొందుతుంది. దీనిలో 135 డిగ్రీల వెనుక సీట్లు, ఇది అంతర్జాతీయ విమానాల ఫస్ట్ క్లాస్‌లో ఉంటే సీటింగ్ కలదు.

ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, ఎయిర్ ప్యూరిఫికేషన్ సిస్టమ్, యాంబియంట్ లైటింగ్ వాహనం లోపల మంచి అనుభూతిని అందిస్తుంది. అంతే కాకుండా విండ్సర్ ఈవీలో 8.8 అంగుళాల డ్రైవర్ డిస్ప్లే, 15.6 అంగుళాల భారీ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే సపోర్ట్ ఉన్నాయి.
అంతే కాకుండా లెవల్ 2 ఏడీఏఎస్, 360 డిగ్రీల కెమెరా, 9 స్పీకర్ సౌండ్ సిస్టమ్, పీఎం2.5 ఎయిర్ ప్యూరిఫికేషన్ ఫిల్టర్, ఆరు ఎయిర్ బ్యాగ్స్ తదితర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. విండ్సర్ ఈవీలో 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లు ఉన్నాయి. దీని బూట్ కెపాసిటీ 600 లీటర్లుగా ఉంది.

ఇందులోని 37.9 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందింస్తుంది. ఈ ఎంజీ విండ్సర్ ఈవీ సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 134 bhp, 200 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఎంజీ విండ్సర్ ఈవీ టాటా కర్వ్ ఈవీ, టాటా నెక్సాన్ ఈవి మ్యాక్స్, మహీంద్రా ఎక్స్‌యూవీ 400 వంటి గట్టి పోటీని ఇస్తుంది.


Click it and Unblock the Notifications








