MG Windsor EV Review Video ఎంజీ కొత్త ఎలక్ట్రిక్‌ కారుని కొనవచ్చా, లేదా?

భారతదేశంలో ఎంజీ మోటార్‌ కార్లు గత కొన్ని రోజులుగా దుమ్మురేపుతున్నాయి. ఈ కంపెనీ తాజాగా ZS ఎలక్ట్రిక్ SUV, కామెట్ EVల తర్వాత సరికొత్త కారుని విడుదల చేసింది. JSW భాగస్వామ్యంతో కొత్త ఎంజీ విండ్సర్ EVని (MG Windsor EV)ని ఆ సంస్థ మార్కెట్‌లో ప్రవేశపెట్టింది. దీని ప్రారంభ ధర కేవలం రూ. 9.99 లక్షలు (ఎక్స్-షోరూమ్)మాత్రమే. ఈ సీయూవీని మా డ్రైవ్స్‌పార్క్‌ టీమ్‌ టెస్ట్‌ డ్రైవ్‌ చేసింది. దీనికి సంబంధించిన పూర్తి రివ్యూ మీకోసం..

ఈ ఎంజీ విండ్సర్‌ ఎంజీ కామెట్‌ ఈవీ భారీ వెర్షన్‌గా కనిపిస్తుంది. దూరం నుంచి ఇది అచ్చం కామెట్‌ ఈవీ మాదిరివలె ఉంటుంది. దీని ముందు భాగంలో LED లైట్‌బార్, స్టైలింగ్‌తో కూడిన DRLలు ఉన్నాయి. బంపర్‌ కింది భాగంలో LED హెడ్‌లైట్స్‌ ఉంటాయి. దీనిపైనే మోరిస్ గ్యారేజెస్ నేమ్‌ప్లేట్‌ని అందించారు. సైట్‌లో ఫ్లష్‌డోర్ హ్యాండిల్స్‌, 18-అంగుళాల డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ ఆకర్షణీయంగా ఉంటాయి.

ఇక ఇంటీరియర్‌లో 8.8-అంగుళాల డ్రైవర్ డిస్‌ప్లే ఉంటుంది. ఇది డ్రైవర్‌కి పూర్తి సమాచారాన్ని అందిస్తుంది. దీనిలోని డాష్‌బోర్డ్‌ వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లేకి సపోర్ట్‌ చేసే క్లాస్-లీడింగ్ 15.6-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌కి సపోర్ట్‌ చేస్తుంది. ఇది ఇన్ఫోటైన్‌మెంట్ సెటప్‌ ద్వారా మీకు ఇష్టమైన ట్యూన్‌లను ప్లే చేయడానికి ఇన్ఫినిటీ నుంచి 9-స్పీకర్ ఆడియో సిస్టమ్‌ని అందించారు.

ఈ స్క్రీన్ Jio ద్వారా ఆధారిత MG యాప్ స్టోర్‌ ద్వారా గేమ్స్‌, మ్యూజిక్ స్ట్రీమింగ్, OTTలను ప్రయాణికులు యాక్సెస్‌ చేసుకోవచ్చు. వీటితో పాటు మల్టీ వాయిస్ అసిస్ట్‌తో (ఇంగ్లీష్, గుజరాతీ, హిందీ, మరాఠీ, తమిళం,తెలుగు) కంటెంట్‌ని యాక్సెస్‌ చేసుకోవచ్చు. దీనిలోని ముందు వెంటిలేటెడ్ సీట్లు, డ్రైవర్‌ సీట్‌ 6-వే పవర్‌ అడ్జస్ట్‌మెంట్స్‌తో వస్తుంది. డ్రైవర్ ఆర్మ్‌రెస్ట్ దగ్గర, డోర్ కార్డ్స్‌ల వద్ద కప్‌హోల్డర్స్‌ కూడా ఉన్నాయి.

ఈ కారులోని 38kWh బ్యాటరీ ప్యాక్ సింగిల్‌ ఛార్జ్‌పై 331km రేంజ్‌ని అందిస్తుంది. ఈ విండ్సర్ బ్యాటరీ ప్యాక్ 45kW ఫాస్ట్ DC ఛార్జర్‌ కేవలం 55 నిమిషాల్లో 0-80% ఛార్జ్ చేయవచ్చు. 3.3kW ఛార్జర్స్‌తో 13.8 గంటలు, 7.4kW AC ఛార్జర్స్‌తో 6.5 గంటలు ఇంట్లోనే ఛార్జింగ్‌ చేయవచ్చు. ఇది ఒక ప్లస్‌ పాయింట్‌గా చెప్పవచ్చు.

MG Windsor EV Review

More from DriveSpark

Article Published On: Monday, September 23, 2024, 13:58 [IST]
English summary
Mg windsor ev review video driving impressions specs features check here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+