బ్యాటరీతోనూ ఎంజీ విండ్సర్‌ ధర చాలా తక్కువ.. వేరియంట్ల వారీగా ధరలు వెల్లడి!

ఎంజీ మోటార్ ఇండియా (MG Motor) ఇటీవలే విండ్సర్ ఈవీ (MG Windsor EV) విడుదల చేసింది. ఈ కారు లాంచ్ సమయంలో ఎంట్రీ లెవల్ వేరియంట్ ధరను రూ .10 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో కంపెనీ ప్రకటించి ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే దీని బ్యాటరీ కిలోమీటర్‌కి రూ.3.50 చొప్పున (BaaS-బ్యాటరీ యాజ్‌ ఏ యూజ్‌ సర్వీస్‌) కింద సబ్ స్క్రైబ్ చేసుకోవాల్సి ఉంటుంది. తాజాగా ఈ ఎంజీ విండ్సర్‌కి సంబంధించిన వేరియంట్లు, వాటి ధరలను ఆ కంపెనీ వెల్లడించింది. కంపెనీ ఇదివరకు ప్రకటించిన ధరతో బ్యాటరీ ఆప్షన్‌ని సబ్ స్క్రైబ్ చేసుకోవడానికి ఇష్టపడని వారు ఈ కారు బేస్‌ వేరియంట్‌ని రూ.13.50 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో కొనుగోలు చేయవచ్చు. దీని టాప్‌ వేరియంట్‌ ధర రూ.15.50 లక్షలుగా ఉంది. ఆ వివరాలపై ఓ లుక్కేయండి.

ఎంజీ విండ్సర్ ఈవీని మూడు వేరియంట్లలో కంపెనీ తీసుకువచ్చింది.
ఇది ఎక్సైట్ (Excite), ఎక్స్‌క్లూజివ్‌ (Exclusive), ఎసెన్స్ (Essence) అనే వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. కస్టమర్ల అభిరుచులకు తగినట్లుగా వేరియంట్లను కంపెనీ ప్రవేశపెట్టింది. కావున కస్టమర్లు తమకు ఇష్టమైన వేరియంట్లను ఎంచుకోవచ్చు. ఇక దీనిలోని బేస్ మోడల్ ఎక్సైట్ ధర రూ .13.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది.

MG Windsor EV Launch

ఎక్సైట్‌: బేస్‌ వేరియంట్‌లో LED లైటింగ్, ఫ్లష్‌ డోర్ హ్యాండిల్స్, ఫ్యాబ్రిక్ సీట్లు, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌, వైర్‌లెస్‌ కనెక్టివిటీతో కూడిన 7 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్ ఉన్నాయి. అంతే కాకుండా ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, రియర్ ఏసీ వెంట్స్, రిక్లైనింగ్ రియర్ సీట్లు, క్రూయిజ్ కంట్రోల్, సిక్స్ స్పీకర్ సౌండ్ సిస్టమ్ వంటి అదనపు ఫీచర్లు ఈ బేస్‌ వేరియంట్‌లో అందించారు.

ఎంజీ మోటార్స్ ఈ విండ్సర్‌ లోని అన్ని వేరియంట్లలో సేఫ్టీకి అధిక ప్రాధాన్యతను ఇచ్చింది. స్టాండర్డ్ సేఫ్టీ ఫీచర్లుగా ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, హిల్-స్టార్ట్ అసిస్ట్, రియర్ పార్కింగ్ సెన్సార్లు, ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్‌ ఉన్నాయి. అయితే ఎక్సైట్ వేరియంట్ పెరల్ వైట్‌లోనే మాత్రమే లభిస్తుంది. ఇందులో 3.3 కిలోవాట్ల పోర్టబుల్ ఛార్జింగ్ కేబుల్, హోమ్ ఛార్జింగ్ బాక్స్ ఆప్షన్స్‌తో వస్తుంది.

MG Windsor EV Variants

ఎక్స్‌క్లూజివ్‌: దీని ధర రూ .14.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది అదనపు లగ్జరీయస్‌గా, భారీ టెక్నాలజీ ఫీచర్లతో బెస్ట్‌ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఇందులో 18 అంగుళాల అల్లాయ్ వీల్స్, క్రోమ్ ఫినిషింగ్స్, లెదర్ ఇంటీరియర్స్, 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌ డిస్ప్లే, 8.8 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ ప్యానెల్స్‌, పవర్ అడ్జస్టబుల్ సీట్లు, వైర్‌లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ కూడా ఇందులో ఉన్నాయి.

ఇందులో సేఫ్టీ కోసం కనెక్టెడ్‌ కారు ఫీచర్లతో 360 డిగ్రీల కెమెరా, LED కార్నరింగ్ లైట్స్‌తో వస్తుంది. ఈ వేరియంట్‌ పెర్ల్ వైట్, స్టార్‌బర్ట్స్‌ బ్లాక్ కలర్‌ ఆప్షన్స్‌తో లభిస్తుంది. ఈ వేరియంట్ ఎలివేటెడ్ డ్రైవింగ్ ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఇది కారులోని ప్రయాణికులకు సైతం బెస్ట్‌ అనుభూతిని ఇవ్వగలదు.

MG Windsor EV Sunroof

ఎసెన్స్‌: టాప్-స్పెక్ ఎసెన్స్ వేరియంట్ ధర రూ .15.50 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో పనోరమిక్ గ్లాస్ రూఫ్‌ కలదు. మంచి ఇంటీరియర్ కోసం యాంబియంట్‌ లైటింగ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో తొమ్మిది స్పీకర్ల ఆడియో సిస్టమ్ మెరుగైన సౌండ్ క్వాలిటీని అందిస్తుంది. ఇందులో వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌ అదనపు సౌకర్యాన్ని అందిస్తాయి.

ఈ వేరియంట్ ఇతర మోడళ్లతో పోలిస్తే 7.4 కిలోవాట్ల ఏసీ ఫాస్ట్ ఛార్జర్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది టర్కోయిస్ గ్రీన్, స్టార్‌బర్ట్స్‌ బ్లాక్, క్లే బీజ్, పెర్ల్ వైట్ అనే నాలుగు కలర్‌ ఆప్షన్లలో లభిస్తుంది. ఈ ఎసెన్స్ అధునాతన టెక్నాలజీతో పాటు, విలాసవంతమైన ప్రయాణాన్ని కోరుకునేవారికి సరిపోతుంది.

More from DriveSpark

Article Published On: Monday, September 23, 2024, 7:20 [IST]
English summary
Mg windsor ev variants and prices announced check all details in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+