తక్కువ ధరలో మంచి ఆఫ్‌-రోడింగ్‌ కారు కోసం చూస్తున్నారా.??.. మైలేజ్‌, పనితీరులో వీటిని ఢీకొట్టేదే లేదు.!!

ఈ మధ్య కాలంలో ఆఫ్‌ రోడింగ్‌ కార్లకు డిమాండ్‌ ఎక్కువగా ఉంది. సాధారణ కార్లతో పోటీపడుతూ ఈ వాహనాలు మార్కెట్లో దూకుడు కొనసాగిస్తున్నాయి. అయితే ఆఫ్‌ రోడింగ్‌ కారు కొనేముందు కస్టమర్లు.. ధరతో పాటు మైలేజ్‌, పనితీరుకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. భారత మార్కెట్‌లో అందుబాటులో ఉన్న చవకైన నాలుగు చక్రాల 4X4 (4X4 Off Road) వాహనాల వివరాలను ఇక్కడ మీకు అందిస్తున్నాం.

మహీంద్రా థార్: ప్రముఖ దేశీ బ్రాండ్‌ మహీంద్రా నుంచి మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన ఆఫ్-రోడ్ వాహనం Mahindra Thar. మహీంద్రా థార్ విషయానికొస్తే, 3-డోర్ మహీంద్రా థార్ ధర రూ. 10.98 లక్షల నుండి రూ. 16.94 లక్షల ఎక్స్-షోరూమ్ ధర వద్ద కొనుగోలు కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు.

Mahindra-Thar

కొత్త మహీంద్రా థార్‌ ఆఫ్‌ రోడర్‌లో 3 ఇంజిన్ ఆప్షన్లు ఉన్నాయి. 1.5-లీటర్ డీజిల్, 2.2-లీటర్ డీజిల్ మరియు 2.0-లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజన్లను కలిగి ఉంటుంది. ఇది 6-స్పీడ్ మ్యాన్యువల్/ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపికను కూడా కలిగి ఉంటుంది.

మారుతి సుజుకి జిమ్నీ: భారత మార్కెట్లో అందుబాటులో ఉన్న అత్యంత సరసమైన 4X4 ఆఫ్‌రోడ్ వాహనాల్లో Maruti Suzuki Jimny ఒకటి. ఇది 6000 rpm వద్ద 104.8 Ps గరిష్ట శక్తిని మరియు 4000 rpm వద్ద 134.2 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Maruti-Suzuki-Jimny

పవర్‌ ఫుల్‌ మారుతి సుజుకి జిమ్నీ ఆఫ్‌ రోడర్‌ ఎస్‌యూవీ ఐడిల్ స్టార్ట్/స్టాప్ బటన్ ఫీచర్‌ను కలిగి ఉంది. ఇది 1.5L K-సిరీస్ పెట్రోల్ ఇంజన్‌తో పనిచేస్తుంది. భారతీయ మార్కెట్లో ఈ కారు ధర 12.74 లక్షల నుంచి అందుబాటులో ఉంది.

మహీంద్రా స్కార్పియో ఎన్: మహీంద్రా కొత్త Mahindra Scorpio N ను విడుదల చేయడం ద్వారా చాలా ఏళ్లుగా మార్కెట్లో స్కార్పియో లేని లోటును ఇది భర్తీ చేస్తోంది. మహీంద్రా స్కార్పియో N ను రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో సంస్థ ప్రవేశపెట్టింది. ఇందులోని 2.0 లీటర్ టర్బోచార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ గరిష్ఠంగా 200 bhp శక్తిని మరియు 380 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Isuzu-Vcross-D-Max

ఇసుజు వి క్రాస్ డి మాక్స్: భారతీయ మార్కెట్లో లైఫ్‌స్టైల్ పికప్ ట్రక్ సెగ్మెంట్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు ఇసుజు వి క్రాస్ డి మాక్స్(Isuzu V Cross D Max). ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్‌లతో నాలుగు సిలిండర్లను కలిగి ఉంటుంది. 1.9-లీటర్ డీజిల్ ఇంజిన్ మరియు 3.0-లీటర్ డీజిల్ ఇంజన్‌లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది.

ఫోర్స్ గూర్ఖా: భారత్‌లో మంచి ఆఫ్‌- రోడ్‌ వాహనం(Off Road Vehicles In India) కోసం వెతుకుతున్న వారికి ఫోర్స్‌ గూర్ఖా మంచి ఆప్షన్‌ అని చెప్పవచ్చు. ఈ కారు పనితీరు పరంగా మెరుగ్గా ఉంటుందని నిరూపించబడింది. కొత్త గూర్ఖా మోడల్ 2.6-లీటర్ టర్బో డీజిల్ ఇంజన్ ఆప్షన్‌తో పనిచేస్తుంది.

Force-Gurkha

ఫోర్స్‌ గూర్ఖా(Force Gurkha) 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. కొత్త తరం ఆఫ్-రోడ్ ఔత్సాహికులను ఈ కారు విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులోని 2.6-లీటర్ టర్బో డీజిల్ ఇంజిన్ మోడల్ 90 bhp మరియు 250 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అయితే కొత్త కారు 4X4 డ్రైవ్ టెక్నాలజీతో స్టాండర్డ్‌ ఫీచర్‌గా వస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, March 4, 2024, 9:10 [IST]
English summary
Most affordable 4x4 off road cars list in india check price engine specs details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+