Nissan Magnite Facelift ఎవ్వరూ ఊహించని ధరలో లాంచ్‌ అయిన నిస్సాన్‌ మాగ్నైట్‌ ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్!

ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిస్సాన్ (Nissan) సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌ వెర్షన్‌ని విడుదల చేసింది. 2020లో ఈ మాగ్నైట్‌ని భారత్‌లో ప్రవేశపెట్టింది. నేడు ఈ మాగ్నైట్‌ ఫేస్‌లిఫ్ట్ (Nissan Magnite Facelift) వెర్షన్‌ని విడుదల చేసింది. ప్రస్తుతం ఇది పాపులర్ ఎస్‌యూవీలలో ఒకటిగా ఉంది. ఈ మాగ్నైట్‌ని జనాలు భారీ సంఖ్యలో కొనుగోలు చేస్తున్నారు. నిస్సాన్‌ మాగ్నైట్‌కి ఉన్న పాపులారిటీతో సేల్స్‌ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ సరికొత్త అప్‌డేటెడ్‌ కారు ధర, ఫర్ఫామెన్స్‌, ఫీచర్ల ఇతర తదితర అంశాలకు సంబంధించిన వివరాలు ఈ కథనంలో..

ఈ సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీ చాలా సరసమైన ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంటుంది. దీనిని కేవలం రూ.5.99 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) ధరతో విడుదల చేసింది. దీని టాప్‌ ఎండ్‌ ధర రూ.11.50 లక్షలుగా ఉంది. ఈ నిస్సాన్‌ విసియా (VISIA), విసియా ప్లస్, అసెంటా (Acenta), ఎన్-కనెక్టా (N-Connecta), టెక్నా (Tekna), టెక్నా ప్లస్ అనే 6 వేరియంట్లలో లభిస్తుంది.

Nissan Magnite Facelift version Launch

ఈ కారు ఎక్స్‌టీరియర్‌ ఆకర్షణీయమైన డిజైన్‌ని కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, L షేప్‌తో కూడిన DRLs, ఆక్టాగోనల్‌ గ్రిల్, కొత్త ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్ ఉన్నాయి. ఇందులో 16 అంగుళాల డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. బ్లాక్‌ బాడీ క్లాడింగ్స్‌తో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇంకా మరెన్నో ఆకర్షణీయమైన కలర్ ఆప్షన్స్‌తో ఈ కారు అందుబాటులో ఉంటుంది.

ఫర్ఫామెన్స్‌ పరంగా చూస్తే కొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ పవర్‌ట్రైన్‌లో ఎటువంటి మార్పులు లేవు. ఇది మునుపటి మోడల్ మాదిరిగానే 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఈ ఇంజిన్‌ 72 ps హార్స్ పవర్, 96 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్ / ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ జతచేయబడి ఉంటుంది.

Nissan Magnite Facelift

ఇందులోని మరో 1-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ 100 ps హార్స్ పవర్ 160 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 5-స్పీడ్ మాన్యువల్, సీవీటీ గేర్ బాక్స్ ఆప్షన్లతో జతచేయబడి ఉంటుంది. వేరియంట్లను బట్టి ఇది లీటరుకు 17.4 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీ అందించనుంది. ఇది మంచి ఫర్ఫామెన్స్‌తో పాటు మైలేజీని కోరుకునే చిన్న ఫ్యామిలీలకు సరిపోతుంది.

ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్‌లో 5 మంది సులభంగా ప్రయాణించవచ్చు. ఇందులోని ఇంటీరియర్‌ మంచి ఎక్స్‌పీరియన్స్‌ని అందిస్తుంది. ఇంటీరియర్‌లో 8 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, వైర్‌లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 4 కలర్ యాంబియంట్ లైటింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Nissan Magnite Facelift

ఈ సరికొత్త ఫేస్‌లిఫ్ట్‌లో సేఫ్టీ కూడా భేష్‌ అని చెప్పవచ్చు. ప్రయాణంలో సేఫ్టీని అందించేందుకు 6-ఎయిర్‌బ్యాగ్స్‌, ESC( ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), TPMS (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ముందు అలాగే వెనుక పార్కింగ్ సెన్సార్లు, ఆటో డిమ్మింగ్ IRVM, 360-డిగ్రీ కెమెరాలు ఉన్నాయి.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ రెనాల్ట్ కిగర్, మారుతి సుజుకి బ్రెజా, టాటా నెక్సాన్, కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా ఎక్స్‌యూవీ3ఎక్స్‌ఓ, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. ఈ పండుగ సీజన్‌లో సేల్స్‌ని టార్గెట్‌ చేస్తూ నిస్సాన్‌ దీనిని విడుదల చేసింది. ఈ కారుకి ఉన్న ఫేమ్‌ని పరిగణలోకి తీసుకుంటే త్వరలోనే భారీ సంఖ్యలో జనాలు ఈ ఫేస్‌లిఫ్ట్‌ని కొనుగోలు చేసే అవకాశం ఉంది.

More from DriveSpark

Article Published On: Friday, October 4, 2024, 17:23 [IST]
English summary
Nissan magnite facelift launched at rs 5 99 lakh check specifications in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+