Nissan Magnite Facelift నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ వచ్చేస్తుంది.. డిజైన్, ఫీచర్ల తేడాలు చూశారా?
మార్కెట్‌లో నిస్సాన్ కార్లకు మంచి డిమాండ్ ఉంది. ఆ కంపెనీ అందించే లైనప్స్‌లలో నిస్సాన్ మాగ్నైట్ (Nissan Magnite) బాగా ప్రాచుర్యం చెందింది. ఈ కారుని భారీ సంఖ్యలో జనాలు కొనుగోలు చేస్తున్నారు. ఈ నిస్సాన్ మాగ్నైట్ XE, XL, XV, and XV Premium అనే వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఈ మాగ్నైట్ 2020లో భారతీయ మార్కెట్‌లో అడుగుపెట్టింది. అప్పటి నుంచి ఈ పాపులర్ ఎస్‌యూవీకి డిమాండ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం ఈ ఎస్‌యూవీని అప్‌డేటెడ్ 'మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్' మోడల్‌ని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి..
ఈ సరికొత్త ఎస్‌యూవీని అక్టోబర్ 4న విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటిచింది. ఈ ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లో భారీ మార్పులు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా డిజైన్, ఇంటీరియర్ ఇతర సేఫ్టీ ఫీచర్లను అప్‌డేట్ చేయనున్నారు. ఈ కారుకి ఉన్న డిమాండ్‌ని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడున్న దానికంటే భారీ అప్‌గ్రేడ్స్‌తో ఈ ఎస్‌యూవీని విడుదల చేయనుంది.

ముందుగా ఈ 2024 సరికొత్త నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అత్యాధునిక డిజైన్‌తో తీసుకురానున్నారు. అందులో భాగంగా ఫ్రంట్ ఫేసియాలో అప్‌గ్రేడెడ్ గ్రిల్, కొత్త బంపర్, రీడిజైన్‌తో వచ్చే హెడ్ లైట్స్, ఢిఫరెంట్ అల్లాయ్ వీల్స్, ఎల్‌ఈడీ టెయిల్ లైట్స్ డిజైన్‌లో మార్పులు ఉండే అవకాశం ఉంది. గత కొన్ని రోజుల క్రితమే ఆన్‌లైన్ ఈ కొత్త ఫేస్‌లిఫ్ట్ వెర్షన్ ఫోటోలు లీక్ అయ్యాయి.
ఫర్ఫామెన్స్ విషయానికి వస్తే నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ అదే శక్తివంతమైన ఇంజిన్‌తో నడిచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్స్‌తో అందుబాటులో ఉంది. ఇది 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో పని చేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్ / 5-స్పీడ్ ఆటోమేటిక్, సీవీటీ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ 5-సీటర్ ఆప్షన్‌లో లభిస్తుంది. యూత్‌ని ఎక్కువగా ఆకర్షించే అద్భుతమైన ఫీచర్లు ఇందులో ఉంటాయని భావిస్తున్నారు. ఇందులో 9 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉండనున్నాయి. ఇందులో 336 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. ఈ నంబర్ పెరిగే అవకాశం ఉంది.
ఇది ప్రయాణికులకు మంచి సేఫ్టీని అందిస్తుంది. ప్రస్తుతం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగ్స్ మాత్రమే ఉన్నాయి. త్వరలో రాబోయే ఫేస్‌లిఫ్ట్ వెర్షన్‌లోని అన్ని వేరియంట్లలో 6-ఎయిర్ బ్యాగ్స్ అందించనున్నారు. వీటితో ఇప్పుడు ఉన్న టీపీఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఐసోఫిక్స్ చైల్డ్ సీట్ యాంకరేజ్‌లు, 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కొనసాగనున్నాయి.
ఈ నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ ఎస్‌యూవీని అత్యంత సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.6.30 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ ఎస్‌యూవీ నేరుగా రెనో కిగర్, టాటా నెక్సాన్, మారుతి సుజుకి బ్రెజా, హ్యుందాయ్ వెన్యూ, మహీంద్రా XUV 3 XO, కియా సోనెట్, మారుతి సుజుకి ఫ్రాంక్స్ వంటి మోడళ్లకు ఈ కారు గట్టి పోటీని ఇస్తుంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








