దేశంలోనే తక్కువ మెయింటైనెన్స్ కారు.. కిలోమీటర్‌కి కేవలం 39 పైసలు మాత్రమే.. అదెలా సాధ్యం అంటే!
కారు కొనడం ఓ ఎత్తైతే దానిని మెయింటైన్ చేయడం మరో సాహసం అనే చెప్పాలి. ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు కార్ల మెయింటైనెన్స్ ఖర్చుపై తీవ్ర ఆందోళన చెందుతాయి. కారు లోన్స్ లేదా ఇతర మార్గాల ద్వారా కొనవచ్చు కానీ దాని సర్వీస్, విడిభాగాల కోసం అయ్యే ఖర్చు ఆర్థికంగా భారం అవుతుంది. అంతే కాదు కారు కొన్న తర్వాత వీటి మెయింటైనెన్స్ ఖర్చుని భరించలేని కొందరు కార్లను అమ్మేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. దేశంలో ప్రస్తుతం మారుతి సుజుకి, హ్యుందాయ్, టయోటా వంటి బ్రాండ్ల కార్లు తక్కువ మెయింటైనెన్స్‌తో ఉన్నాయి.
ఈ రోజుల్లో ఎవరైనా కారు కొనాలని భావిస్తే ముందుంగా ఎస్‌యూవీల వైపు మాత్రమే చూస్తున్నారు. దీంతో మార్కెట్‌లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న టాటా నెక్సాన్, మారుతి బ్రెజా, ఫ్రాంక్స్, వెన్యూ వంటి కాంపాక్ట్ ఎస్‌యూవీలపై ఎక్కువ ఆసక్తి చూపుతారు. అయితే వీటి మెయింటైనెన్స్ కూడా కాస్త ఎక్కువే అని చెప్పాలి. పైన పేర్కొన్న ఈ కార్లకంటే ఓ ఎస్‌యూవీ తక్కువ నిర్వహణ వ్యయంతో మార్కెట్‌లో అందుబాటులో ఉంది.

అదే నిస్సాన్ మాగ్నైట్ ఫేస్‌లిఫ్ట్ (Nissan Magnite Facelift). ఈ కారుని తక్కువ మెయింటైనెన్స్ ఖర్చుని కలిగి ఉంటుంది. ఈ కొత్త నిస్సాన్ మాగ్నైట్ కిలోమీటర్‌కి 39 పైసల మెయింటెనెన్స్ ఖర్చుతో వస్తుంది. దీంతో పాటు నిస్సాన్ మూడు సంవత్సరాలు లేదా 1,00,000 లక్షల కిలోమీటర్ల వారంటీని స్టాండర్డ్‌గా అందిస్తోంది. వినియోగదారులు దీనిని 6 సంవత్సరాలు లేదా 1.50 లక్షల కిలోమీటర్ల వరకు అదనపు ఖర్చుతో పొడిగించుకోవచ్చు.
పొడిగించిన వారంటీలో విడిభాగాలు, మెయింటైనెన్స్, ఇతర ఖర్చులను కవర్ చేస్తుందని కంపెనీ తెలిపింది. ఇది ఓనర్‌షిప్‌ని సులభతరం చేస్తుంది. దీంతో కారులో ఏదైనా పార్ట్ దెబ్బతిన్నా లేదా పనిచేయకపోయిన కంపెనీయే దానిని రిప్లేస్ చేయడం లేదా ఖర్చుని భరిస్తుంది. ఈ నిస్సాన్ మాగ్నైట్ అదనపు ప్రయోజనాల్లో భాగంగా దేశవ్యాప్తంగా క్యాష్‌లెస్ రిపేర్, అపరిమిత క్లెయిమ్స్‌ని దేశంలోని అన్ని నిస్సాన్ అధీకృత సేవా కేంద్రాలలో పొందవచ్చు.

ఇక కస్టమర్లు 'నిస్సాన్ మాగ్నైట్ కేర్' అనే ప్రీపెయిడ్ మెయింటెనెన్స్ ప్లాన్ ఎంచుకుంటే 21 శాతం అదనపు లాభాలను పొందవచ్చు. ఇందులో కాంప్రెహెన్సివ్ మెయింటైనెన్స్ కోసం గోల్డ్ ప్యాక్, బేసిక్ సర్వీస్ కోసం సిల్వర్ ప్యాక్ ఆప్షన్ ఉన్నాయి. ఇందులో భాగంగా వాహనాన్ని విక్రయించేటప్పుడు కొత్త యజమానులకు సైతం ఈ మెయింటైనెన్స్ ప్లాన్‌ని ట్రాన్స్‌ఫర్ చేయవచ్చు. దీనివల్ల దీని రీసేల్ విలువ స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది.
ఆ కొత్త ఫేస్ లిఫ్ట్ ఎస్‌యూవీ ధర రూ .5.99 లక్షల నుంచి రూ .11.50 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హెక్సాగాన్ నమూనాతో బ్లాక్డ్-అవుట్ గ్రిల్, M-ఆకారంలో LED టెయిల్ ల్యాంప్స్, 16-అంగుళాల అల్లాయ్ వీల్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీని ఇంటీరియర్‌లో కొత్త అప్‌హోల్ స్టరీ, సాఫ్ట్ టచ్ మెటీరియల్స్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జర్ ఉన్నాయి.

అంతే కాకుండా TFT ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, ఎయిర్ ప్యూరిఫైయర్, ఫ్రేమ్‌లెస్ ఆటో డిమ్ IRVM, 360 డిగ్రీల కెమెరా ఉన్నాయి. సేఫ్టీ కోసం ఈ ఎస్‌యూవీలో ఆరు ఎయిర్‌బ్యాగ్స్‌ని స్టాండర్డ్‌గా అందిచారు. మొత్తం ఈ కారులో 55 రకాల సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. వీటిలో 40 స్టాండర్డ్‌గా అందుబాటులో ఉంటాయి. 60 మీటర్ల పరిధిలో ఉన్నప్పుడు రిమోట్ ద్వారా స్టార్ట్ చేయడానికి కంపెనీ కొత్త ఐ-కీని కూడా అందించింది.
ఇది 1.0 లీటర్ నేచ్‌రల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్, టర్పో పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఇక నేచురల్ ఆస్పిరేటెడ్ యూనిట్ 71 bhp వద్ద 96 nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు మాగ్నైట్ టర్బో వెర్షన్ 99 bhp వద్ద 152 nm టార్క్‌ని విడుదల చేస్తుంది. 5-స్పీడ్ మాన్యువల్, AMT, సీవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్స్ ఉన్నాయి.


Click it and Unblock the Notifications








