మరో స్పెషల్ ఎడిషన్‌లో నిస్సాన్ మాగ్నైట్ విడుదల.. ధర రూ. 9.84 లక్షలు
నిస్సాన్ మాగ్నైట్ గెజా ఎడిషన్ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిస్సాన్ కంపెనీ ఈ రోజు మాగ్నైట్ గెజా సీవీటీ ఎడిషన్‌ని భారత మార్కెట్‌లో విడుదల చేసింది. మాగ్నైట్ ఎస్‌యూవీ GEZA మోడల్ లోని XL, XV వేరియంట్లను 2023లో విడుదల చేసింది. ఈ గెజా వెర్షన్ కార్లు ఏడాది కాలంలో దాదాపు 30,000 యూనిట్ల వరకు సేల్ అయ్యాయి.
2020 నుంచి భారతీయ మార్కెట్‌లో నిస్సాన్ మాగ్నైట్ ఎస్‌యూవీలను విక్రయిస్తోంది. ఈ కార్లు సేల్స్‌లో ఇతర కంపెనీ కార్లకు గట్టి పోటీనిస్తున్నాయి. తాజాగా వస్తున్న గెజా సీవీటీ 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది 98.63 bhp వద్ద 160 nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. దీని ప్రారంభ ధర రూ. 9.84 లక్షలుగా ఉంది.

2024 నిస్సాన్ మాగ్నైట్ గెజా స్పెషల్ ఎడిషన్ ఆకట్టుకునే ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అప్‌గ్రేడ్ చేయబడింది. ఈ కారులో 9-అంగుళాల HD టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే, ప్రీమియం JBL స్పీకర్లు, స్ట్రిప్ రియర్‌వ్యూ కెమెరా, యాప్ కంట్రోల్ యాంబియంట్ లైటింగ్ వంటివి ఉన్నాయి. ఇందులో అద్భుతమైన ఇంటీరియర్ మరియు గెజా ఎడిషన్ బ్యాడ్జింగ్ ఉన్నాయి.
మాగ్నైట్ గెజా సీవీటీ స్పెషల్ ఎడిషన్ మార్కెట్‌లో ఏ కంపెనీ అందించని ఫీచర్లతో తక్కువ ధరలో బెస్ట్ ఫీచర్లను అందిస్తున్నామని నిస్సాన్ మోటార్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ (ఎన్ఎమ్ఐపిఎల్) మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స తెలిపారు. అత్యుత్తమ సాంకేతిక పరిజ్ఞానం, ప్రీమియం ఫీచర్లు, అధునాతన ఇన్ఫోటైన్మెంట్ సామాన్య ప్రయాణికులకు అందుబాటు ధరల్లో అందించడమే తమ లక్ష్యమని ఆయన చెప్పారు.

దేశీయంగా కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉన్న నిస్సాన్ మాగ్నైట్ యొక్క రెగ్యులర్ వేరియంట్ల ధరలు రూ. 6 లక్షల నుంచి రూ .11.27 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య
ఉన్నాయి. ఈ కార్లు బ్లేడ్ సిల్వర్, ఫ్లేర్ గార్నెట్ రెడ్ మరియు ఓనిక్స్ బ్లాక్ వంటి కలర్లలో లభిస్తున్నాయి. ఈ కారులో ఐదుగురు వ్యక్తులు సులభంగా ప్రయాణించవచ్చు. తక్కువ ధరలో ఎక్కవ ఉపయోగాలు ఉండటంతో ఈ కార్లను కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు.
ఈ ఎస్‌యూవీ మోడళ్లు 1-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ పవర్ట్రెయిన్ పనిచేస్తాయి. అలాగే 5-స్పీడ్ మాన్యువల్, 5-స్పీడ్ ఆటోమేటిక్ / సీవీటీ (కంటిన్యూయస్ వేరియబుల్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్ ఆప్షన్స్‌తో రానున్నాయి. ఇక ఈ కార్లు లీటరుకు 17.4 నుంచి 20 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలవు. ఈ కార్లు అన్ని FWD (ఫ్రంట్ వీల్ డ్రైవ్) టెక్నాలజీతో వస్తాయి.

నిస్సాన్ మాగ్నైట్ వేరియంట్లలో 8 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జర్ వంటి అనేక ఫీచర్లు ఉన్నాయి. డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగులు, టిపిఎంఎస్ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఇఎస్ సి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








