కారు అంటే ఇది.. ఆఖరికి దీని డిమాండ్ చూసి కంపెనీయే ఆశ్చర్యపోయింది.. మరి అంతలా దీనిలో ఏముంది?
భారత్‌లోనే కాకుండా అంతర్జాతీయంగా కూడా ప్రముఖ ఆటోమొబైల్ సంస్థగా ఉన్నటువంటి నిస్సాన్ మోటార్ ఇండియా తన అమ్మకాలలో దూసుకుపోతుంది. ఇతర కంపెనీలకు పోటీగా నిలుస్తూ పండుగ సీజన్‌లో వినియోగదారుల నుంచి బలమైన డిమాండ్‌ను సాధించింది. తాజాగా విడుదలైన డేటా ప్రకారం, దసరా, దీపావళి సందర్భంగా నిస్సాన్ అక్టోబర్ నెలలో 5,570 కార్ల అమ్మకాలను నమోదు చేసింది. ఈ సమయంలో కస్టమర్ల నుంచి భారీ డిమాండ్‌ను ఊహించిన కంపెనీ ఆ అంచనాలను మొత్తానికి సాధించింది. మార్కెట్లోకి కంపెనీ అధునాతన ఫీచర్లతో వాహనాలను విడుదల చేయడం, అలాగే వాటిపై పలు తగ్గింపులు, క్యాష్‌బ్యాక్‌లు అందించడం , అదనంగా ప్రత్యేక బ్యాంక్ తగ్గింపులను ఇవ్వడం నిస్సాన్ అమ్మకాలు పెరగడానికి దోహద పడినట్టయింది.
అక్టోబర్ నెల అమ్మకాల విషయానికి వస్తే, నిస్సాన్ మోటార్ దేశీయంగా 3,121 కార్లు విక్రయించగా, అంతర్జాతీయంగా కూడా కార్లకు డిమాండ్ నేపథ్యంలో 2,449 కార్లను ఎగుమతి చేసి ఇతర కంపెనీలకు ఏమాత్రం తీసిపోని విధంగా అమ్మకాలను సాధించింది. ముఖ్యంగా నిస్సాన్ 5 వేలకు పైగా విక్రయాలను నమోదు చేయడానికి ప్రధాన కారణం నిస్సాన్ మాగ్నైట్. ఈ పండుగ సీజన్‌లో నిస్సాన్ మాగ్నైట్ అమ్మకాలు ఆశ్చర్యకరంగా ఉన్నాయి.

ఈ కారును ఎక్కువ మంది జనాలు కొనుగోలు చేయడం వలన మొత్తం కార్ల అమ్మకాలు పెరగడానికి ఇది సహాయపడింది. ప్రస్తుతం ఈ కారు ధర రూ. 5.99 లక్షల నుండి రూ. 11.50 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్) ఉంది. బడ్జెట్ ధరలో లభించడం, అలాగే ఫీచర్లు కూడా డజన్ల కొద్ది ఉండటం కూడా ఈ మోడల్ ఎక్కువ అమ్మకాలను నమోదు చేయడానికి ప్రధాన కారణం.
నిస్సాన్ మాగ్నెట్ రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. మొదటిది 1-లీటర్ నేచురల్-ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 5-స్పీడ్ AMTతో వస్తుంది. రెండోది 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్‌తో వచ్చింది. నిస్సాన్ మాగ్నెట్‌ను జనాలు ఎక్కువగా కొనడానికి ఇంకో కారణం ఏంటంటే దీని మైలేజ్.

ఇది 1-లీటర్ మాన్యువల్ గేర్‌బాక్స్‌లో 19.4 కి.మీ, ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌లో 19.7 కి.మీ, 1-లీటర్ టర్బో-పెట్రోల్ CVTలో 17.9 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ప్రయాణికుల సేఫ్టీ పరంగా కూడా నమ్మకమైంది. ముఖ్యంగా ఇది 6 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉంది. ఇంకా హిల్-స్టార్ట్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, చుట్టూ చూడటానికి 360-డిగ్రీ కెమెరాను కలిగి ఉంది.
నిస్సాన్ ప్రస్తుతం భారతదేశంలో కేవలం రెండు కార్లను మాత్రమే విక్రయిస్తోంది. వాటిలో Xtrail ఒకటి. ఇది కొంచెం ఎక్కువ ధరతో లభిస్తుంది. దీంతో మొత్తం అమ్మకాలలో ఎక్కువ భాగం మాగ్నెట్ మోడల్‌దే ఉంది. ఈ అమ్మకాల మైలురాయిపై నిస్సాన్ మోటార్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స మాట్లాడుతూ.. కస్టమర్ల ఇష్టానికి అనుగుణంగా కార్లలో అధునాత ఫీచర్లను అందిస్తున్నామని అన్నారు.

ముఖ్యంగా కొత్త నిస్సాన్ మాగ్నైట్‌కు అఖండమైన విక్రయాల విజయాన్ని అందించినందుకు కస్టమర్లకు ధన్యవాదాలు, మాగ్నైట్‌కు వచ్చిన డిమాండ్ ఆటోమొబైల్ మార్కెట్లో కంపెనీకి కొత్త ఉత్సాహాన్ని తెచ్చిపెట్టిందని అన్నారు. అలాగే, ఈ పండుగ సీజన్ ఆటోమోటివ్ పరిశ్రమకు బాగా కలిసి వచ్చింది. దేశయంగానే కాకుండా, అంతర్జాతీయంగా కూడా 'మేడ్ ఇన్ ఇండియా' మాగ్నెట్ కు పెరుగుతున్న డిమాండ్‌తో నిస్సాన్ తన ఎగుమతులను పెంచిందని అన్నారు.
అధునాతన ఫీచర్లు, అధిక నాణ్యత కలిగిన వాహనాలను కస్టమర్లకు అందించడానికి నిస్సాన్ ఎప్పుడు ముందు ఉంటుంది. పండుగల సీజన్ ఆటోమోటివ్ పరిశ్రమకు వచ్చిన కొత్త ఉత్సాహం రాబోయే నెలల్లో కూడా కొనసాగుతుందని మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ వత్స ఒక ప్రకటనలో తెలిపారు.



Click it and Unblock the Notifications








