ఓలా స్కూటర్లపై ప్రత్యేక ఆఫర్లకు ఆ రోజే లాస్ట్‌.. ఆ దేశాల్లో ఓలా క్యాబ్స్‌ సేవలు బంద్‌.!!

ప్రముఖ ఎలక్ట్రిక్‌ టూ వీలర్‌ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్‌(Ola Electric).. తన ఎంపిక చేసిన స్కూటర్లపై ప్రకటించిన ఆఫర్లు త్వరలో ముగియనున్నాయి. సంస్థ ప్రకటించిన ప్రత్యేక ఆఫర్లను పొందాలనుకునే కస్టమర్లు ఏప్రిల్‌ 15 లోపు సద్వినియోగం చేసుకోవచ్చు. మరి ఏయే స్కూటర్లపై ఈ ఆఫర్లు ఉన్నాయి.. పూర్తి వివరాలు ఈ కథనంలో..

భారత మార్కెట్లో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు దిగ్గజ స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. ప్రతి నెలా సేల్స్‌ పరంగా దూసుకుపోతున్నాయి. అంతే కాకుండా ప్రత్యేక ఆఫర్లను కూడా ప్రకటిస్తూ కస్టమర్లకు ఫేవరెట్‌గా మారాయి. ఈ క్రమంలో ఓలా ఎలక్ట్రిక్‌ తన S1 సిరీస్‌ స్కూటర్లపై ప్రకటించిన ఆఫర్లు త్వరలో ముగియనున్నాయి.

Ola-Electric-Offers

ఏప్రిల్ 15 లోపు ఓలా ఎస్ 1 ప్రో, ఓలా ఎస్ 1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్స్‌పై కస్టమర్లు క్యాష్‌ బ్యాక్‌ ఆఫర్లతో పాటు ప్రత్యేక తగ్గింపులను సొంతం చేసుకోవచ్చు. ఎంపిక చేసిన బ్యాంకు రుణాలు, ఈఎంఐలపై ఓలా ఎలక్ట్రిక్‌ రూ.5,000 క్యాష్ బ్యాక్ అందిస్తోంది. ఇంకా నాలుగు రోజుల్లో ఈ ఆఫర్‌ ముగియనుంది.

పూర్తి సమాచారం కోసం మీ సమీపంలోని ఓలా ఎలక్ట్రిక్‌ ఎక్స్‌పీరియన్స్‌ సెంటర్‌ లేదా డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు. కాగా ఈ ఏడాది మార్చి లో ఓలా ఎలక్ట్రిక్ తన ప్రముఖ స్కూటర్లపై రికార్డు స్థాయిలో బుకింగ్‌లను సొంతం చేసుకుంది. ఏకంగా 53,000 కి పైగా రిజిస్ట్రేషన్లతో టాప్‌లో కొనసాగుతోంది. సంస్థ సాధించిన అత్యధిక నెలవారీ అమ్మకాల పరంగా ఇదే రికార్డు కావడం విశేషం.

Ola-Electric-Offers

అంతేకాకుండా గత ఆర్థిక సంవత్సరంలో ఓలా ఎలక్ట్రిక్‌ స్కూటర్లు రికార్డు స్థాయిలో అంటే 115 శాతం అమ్మకాల వృద్ధి సాధించి ప్రత్యర్థి కంపెనీలకు గట్టి పోటీనిస్తున్నాయి. మొత్తంగా 2023-24 లో 3,28,785 యూనిట్ల స్కూటర్ల విక్రయాలు జరిగాయి. ఎప్పటికప్పుడు అప్‌డేట్లు, ఆఫర్లను ప్రకటించడమే ఈ గణనీయమైన సేల్స్‌కు కారణంగా తెలుస్తోంది.
.
ప్రస్తుతానికి, ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) కంపెనీ తన పోర్ట్ ఫోలియోలో మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తోంది. ఓలా ఎస్1 ఎక్స్ (Ola S1 X), ఓలా ఎస్1 ఎయిర్ (Ola S1 Air), ఓలా ఎస్1 ప్రో (Ola S1 Pro)లను సేల్ చేస్తోంది. కాగా ఎలక్ట్రిక్ టూ వీలర్‌ సెగ్మెంట్‌లోకి రాకముందు సంస్థ క్యాబ్‌ రంగంలో దేశంలోనే అగ్రగామిగా ఉంది.

Ola-Electric-Offers-Cabs-Shutdown

ఈ నేపథ్యంలో ఓలా క్యాబ్స్‌(Ola Cabs) విదేశాల్లో తన సేవల్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో ఈ నెలాఖరు నాటికి ఓలా క్యాబ్స్‌ సర్వీసులకు స్వస్తి పలకనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు యూజర్లకు నోటిఫికేషన్‌ పంపింది. కాగా 2018 లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాల్లో క్యాబ్స్‌ సేవలను ఓలా తీసుకువచ్చింది.

ఈ క్రమంలో విదేశాల్లో క్యాబ్స్‌ సేవలను నిలిపివేయడానికి గల కారణాలు ఇలా తెలుస్తున్నాయి. క్యాబ్‌ ఇంధన వాహనాల్ని ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చమని ఆయా దేశాలు ఓలాపై ఒత్తిడి తేవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. డీజిల్‌ వాహనాల్ని ఎలక్ట్రిక్‌ వాహనాలుగా మార్చడానికి ఖర్చు ఎక్కువగా అవుతుంది.

Ola-Electric-Offers-Cabs-Shutdown

ఇందుకు పెట్టుబడి కూడా భారీగా పెట్టాల్సి రావడం.. అదే కాకుండా ఆయా దేశాల్లో క్యాబ్‌ రంగంలో తీవ్రంగా పోటీ కూడా నెలకొనడంతో ఓలా క్యాబ్స్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే భారత్‌లో క్యాబ్స్‌ విస్తరణకు ఎక్కువ అవకాశాలు ఉండటంతో విదేశాల నుంచి వైదొలగాలని సంస్థ నిర్ణయించుకున్నట్లు మార్కెట్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

More from DriveSpark

Article Published On: Thursday, April 11, 2024, 9:36 [IST]
English summary
Ola electric offers on s1 pro and s1 air scooters valid till april 15th ola cabs service shut down
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+