ఆటో డ్రైవర్లకు గుడ్‌న్యూస్.. బడ్జెట్ ఫ్రెండ్లీ ధరలో త్వరలో ఓలా ఎలక్ట్రిక్ ‘ఆటో'.!!
ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో 40 శాతం వాటాతో ఓలా ఎలక్ట్రిక్(Ola Electric) ప్రస్తుతం భారత మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఓలా S1 సిరీస్ స్కూటర్ల విక్రయాలతో ప్రతి నెలా అత్యధిక సేల్స్‌ను నమోదు చేసుకుంటోంది. ఈ క్రమంలో ఓలా త్వరలో ఎలక్ట్రిక్ ఆటోను విడుదల చేయనున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఈ కథనంలో..
క్యాబ్ రంగంలో అడుగుపెట్టి.. దేశవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఓలా ఆన్‌లైన్ క్యాబ్ సర్వీస్.. తర్వాత ఎలక్ట్రిక్ సెగ్మెంట్‌లోకి అడుగుపెట్టింది. ఓలా ఎలక్ట్రిక్ పేరుతో మార్కెట్లో హవా సృష్టిస్తోంది. కాగా ఇప్పటివరకూ ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసి విక్రయిస్తున్న ఓలా.. ఎలక్ట్రిక్ బైక్, మరియు ఎలక్ట్రిక్ కార్లను ప్రవేశపెట్టాలని చూస్తోంది. వీటికి సబంధించి ఇంట్రెస్టింగ్ టీజర్లు కూడా ఇటీవల విడుదలయ్యాయి.

ఈ నేపథ్యంలో కొత్త ఎలక్ట్రిక్ ఆటో(Ola Electric Auto Rickshaw)ను విడుదల చేయడం ద్వారా మొదటిసారిగా వాణిజ్య వాహనాల వ్యాపారంలోకి ప్రవేశించడానికి Ola సన్నాహాలు చేస్తోంది. అందుబాటులో ఉన్న సమచారం ప్రకారం.. ఓలా ఎలక్ట్రిక్ ఆటో ఈ నెలాఖరులోగా మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ ఎలక్ట్రిక్ ఆటోకు ఓలా సంస్థ.. రాహీ అని నామకరణం చేసింది.
అయితే ఇక్కడ 'రాహి'(Ola Raahi) అనేది హిందీ పదం. హిందీలో రాహి అంటే ప్రయాణికుడు అని అర్థం. ఓలా ఎలక్ట్రిక్.. తన ఎలక్ట్రిక్ ఆటోను ఈ పేరుతో విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉంది. భారత మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న మహీంద్రా ట్రియో, పియాజియో ఏప్ సిటీ, బజాజ్ ఆర్‌ఈల ఎలక్ట్రిక్ ఆటోలకు ఓలా ఎలక్ట్రిక్ ఆటో పోటీగా రానుంది.
కమర్షియల్ వెహికల్(Ola Electric Auto Commercial Vehicle) వ్యాపారంలోకి ప్రవేశించాలని ఓలా ఎలక్ట్రిక్ చాలా కాలంగా ఎదురుచూస్తోంది. ఆ దిశగా ఈ దిగ్గజ సంస్థ ఇప్పుడు తొలి అడుగు వేసింది. దీంతో పాటు రాబోయే నెలల్లో ఓలా తన గిగా ఫ్యాక్టరీని కూడా ప్రారంభించాలనే యోచనలో ఉంది.
ఇక భారత మార్కెట్లో ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలకు మంచి ఆదరణ ఉంది. దేశంలో గతేడాది మొత్తం 5.8 లక్షల ఎలక్ట్రిక్ త్రీ వీలర్ల విక్రయాలు నమోదయ్యాయి. 2022 గణాంకాలతో పోలిస్తే.. ఇది 66 శాతం అధికంగా ఉంది. ఫలితంగా ఈ విభాగంలోకి ప్రవేశించేందుకు ఓలా ఎలక్ట్రిక్ ఆసక్తి చూపిస్తోంది.
ఓలా ఎలక్ట్రిక్ యొక్క Raahi ఎలక్ట్రిక్ ఆటో ధర విషయానికొస్తే.. మహీంద్రా, బజాజ్, పియాజియో సంస్థలు తమ ఇ ఆటో రిక్షాలను రూ. 2 లక్షల నుంచి రూ. 3.5 లక్షల ధరలో విక్రయిస్తున్నాయి. ఇక ఓలా ఎలక్ట్రిక్ కూడా ఈ ధరలను ఆధారంగా చేసుకునే విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
ఎలక్ట్రిక్ టూ వీలర్ సెగ్మెంట్‌లో ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు ఓలా ఎలక్ట్రిక్ తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. ఫిబ్రవరి 2024లో, కంపెనీ తన అన్ని ఇ స్కూటర్ వేరియంట్‌లకు బ్యాటరీ వారంటీని 8 సంవత్సరాలకు పొడిగించి కస్టమర్లకు గుడ్‌న్యూస్ అందించింది. 10,000 ఫాస్ట్ ఛార్జింగ్ పాయింట్‌లను ఏర్పాటు చేయడంతో పాటు.. కస్టమర్‌లకు పోర్టబుల్ ఫాస్ట్ ఛార్జర్‌లను విక్రయించడం, ఏప్రిల్ నాటికి సర్వీస్ సెంటర్ నెట్‌వర్క్‌ను 600కి విస్తరించడం లక్ష్యంగా పనిచేస్తోంది


Click it and Unblock the Notifications