బ్లాక్ కలర్ వావ్.. మార్కెట్లోకి టాటా ‘డార్క్ ఎడిషన్' కార్లు లాంచ్.. వీటిని చూస్తే కొనకుండా ఉండగలరా.??
భారత మార్కెట్లో టాటా మోటార్స్(Tata Motors Dark Edition) ప్రత్యేక ఎడిషన్ మోడల్‌లతో దూకుడు కొనసాగిస్తోంది. కాగా కంపెనీ ఇప్పటి వరకు మార్కెట్లో డార్క్, కజిరంగా, జెట్ వంటి అనేక వేరియంట్లను విడుదల చేసింది. ఈ మోడళ్లలో బాగా హిట్ అయింది ఏదీ అని అడిగితే నిస్సందేహంగా బ్లాక్ బీస్ట్ లుక్‌తో ఉన్న డార్క్ ఎడిషన్ అని చెప్పువచ్చు. ఇవి బాగా పాపులర్ అయ్యాయి.
ఇప్పుడు తాజాగా టాటా మోటార్స్(Tata Cars Dark Edition Launch) ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్, నెక్సాన్ EV, హారియర్ మరియు సఫారి మోడళ్లలో డార్క్ ఎడిషన్‌లను సంస్థ లాంచ్ చేసింది. ఈ కొత్త వేరియంట్‌ల ధరలు 11.45 లక్షల నుండి 20.69 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉన్నాయి. బ్లాక్ కలర్ థీమ్‌తో నిజంగా స్పోర్టియర్ లుక్‌తో వాహన ప్రియులను ఇట్టే ఆకర్షిస్తున్నాయి.

2019 లో, టాటా మోటార్స్ మొదటిసారిగా హారియర్ నుండి డార్క్ ఎడిషన్ మోడల్‌లను పరిచయం చేసింది. డార్క్ ఎడిషన్ థీమ్‌కు డిమాండ్ ఎక్కువ కావడంతో.. ఆ తర్వాతి రెండేళ్లలో బ్లాక్ సఫారి మరియు నెక్సాన్ SUVల వంటి ఇతర మోడళ్లను బ్లాక్ ఎడిషన్‌లో తీసుకువచ్చింది. ఆల్-బ్లాక్ ట్రీట్‌మెంట్‌తో టాటా కార్ల లుక్‌ను పూర్తిగా మార్చేస్తూ మంచి అనుభూతి కలిగేలా సంస్థ వీటిని రూపొందించింది.
కాగా ప్రస్తుతం మార్కెట్లో లాంచ్ అయిన అత్యంత సరసమైన ఎస్‌యూవీ టాటా డార్క్(Tata Nexon Dark Edition) ఎడిషన్ నెక్సాన్. దీని ప్రారంభ ధర రూ.11.45 లక్షలు(ఎక్స్-షోరూమ్) గా ఉంది. ఇది బ్లాక్-క్లాడ్ అల్లాయ్ వీల్స్ మరియు డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌తో సహా ఎక్స్‌టీరియర్ మార్పులతో వస్తుంది. ఇక ఇంటీరియర్ కూడా బ్లాక్ థీమ్‌లో వస్తుంది.

కాగా టాటా నెక్సాన్ Nexon SUV శ్రేణి ప్రస్తుతం రూ. 8.15 లక్షల నుండి రూ. 15.60 లక్షల మధ్య అందుబాటులో ఉంది. ఇందులోని డార్క్ ఎడిషన్ SUV అమెజాన్ అలెక్సా మరియు టాటా వాయిస్ అసిస్టెన్స్ ఫీచర్‌లను ప్రత్యేకంగా కలిగి ఉంటుంది, ఇవి 'హిడెన్ టు లిట్' కెపాసిటివ్ టచ్ క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్, ఆరు భాషల్లో 200 వాయిస్ కమాండ్‌లు, వైర్‌లెస్ ఛార్జర్‌తో వస్తాయి.

ఇక Nexon EV డార్క్ ఎడిషన్(Dark Edition) కూడా ఇలాంటి కాస్మెటిక్ మార్పులతో వస్తుందని సంస్థ వెల్లడించింది. దీనికి అదనంగా ఆల్-బ్లాక్ లెథెరెట్ సీట్లు మరియు డార్క్ ఎడిషన్ బ్యాడ్జింగ్‌తో వస్తాయి. ఈ ఎలక్ట్రిక్ SUV బ్లాక్ బీస్ట్ ఎక్స్-షోరూమ్ ధర రూ.19.49 లక్షల నుండి అందుబాటులో ఉంటుంది. ఇక హారియర్ మరియు సఫారి డార్క్ ఎడిషన్ SUVల విషయానికొస్తే..

హారియర్ మరియు సఫారి SUVలు.. డార్క్ ఎడిషన్ లోగోలతో పాటు, బోల్డ్ ఒబెరాన్ బ్లాక్ ఎక్స్‌టీరియర్స్, బ్లాక్‌స్టోన్ ఇంటీరియర్ థీమ్ మరియు పియానో బ్లాక్ యాక్సెంట్‌లతో బ్లాక్ ఎక్ట్సీరియర్ కలర్ ఆప్షన్‌ను కలిగి ఉంటాయి. హెడ్‌రెస్ట్‌లపై ముదురు బ్యాడ్జింగ్‌తో ఆకర్షణీయంగా ఉంటుంది. హారియర్ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 19.99 లక్షలుగా ఉంది. సఫారీ డార్క్ ఎడిషన్ ప్రారంభ ధర రూ. 20.69 లక్షలు(ఎక్స్-షోరూమ్).
ఇక పవర్‌ట్రెయిన్ విషయానికొస్తే ఈ నాలుగు మోడల్‌లు ఎటువంటి మార్పులను పొందలేదు. నెక్సాన్ డార్క్ ఎడిషన్ రెండు ఇంజన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంది. 1.2-లీటర్ మూడు-సిలిండర్ టర్బో పెట్రోల్ లేదా 1.5-లీటర్ నాలుగు-సిలిండర్ టర్బో డీజిల్ ఇంజిన్‌తో వస్తుంది. పెట్రోల్ మోడల్ 118 bhp శక్తిని 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

ఇక టాటా నెక్సాన్ డీజిల్ ఇంజిన్.. 116 బిహెచ్‌పి పవర్ మరియు 260 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేసేలా ఇంజిన్ ట్యూన్ చేయబడింది. వేరియంట్‌పై ఆధారపడి, SUV 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు కొత్త 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT) గేర్‌బాక్స్ ఆప్షన్లను కలిగి ఉంటుంది.
ఇక మరోవైపు, హారియర్(Tata Harrier Dark Edition) మరియు సఫారి(Tata Safari Dark Edition) డార్క్ ఎడిషన్‌లు అదే 2.0-లీటర్ క్రియోటెక్ డీజిల్ ఇంజిన్‌తో వస్తాయి. 4-సిలిండర్ డీజిల్ ఇంజిన్ గరిష్ఠంగా 170 bhp శక్తిని, 350 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఆరు-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా సిక్స్-స్పీడ్ టార్క్ కన్వర్టర్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది.

ఇక Nexon EV డార్క్ ఎడిషన్ మీడియం మరియు లాంగ్ రేంజ్ వెర్షన్లలో కూడా అందుబాటులో ఉంటుంది. Nexon EV యొక్క మీడియం రేంజ్ వేరియంట్ 30.2 kWh బ్యాటరీ ప్యాక్, లాంగ్ రేంజ్ ట్రిమ్ 40.5 kWh బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. MR పూర్తి ఛార్జ్‌పై 325 కిమీల రేంజ్‌ను.. లాంగ్ రేంజ్ వెర్షన్ గరిష్ఠంగా 465 కి.మీల రేంజ్‌ను అందిస్తుంది.


Click it and Unblock the Notifications








