భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో 2024.. 8 కార్లను ప్రదర్శించనున్న టాటా మోటార్స్‌.. లిస్ట్‌ ఇదే.!!

దేశ రాజధాని ఢిల్లీలో నేటి(ఫిబ్రవరి 1) నుంచి మూడురోజుల పాటు మొదటి భారత్ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో(Bharat Mobility Global Expo 2024) జరుగుతోంది. ఈ ఈవెంట్‌లో కార్ల తయారీ కంపెనీలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. ఈ జాబితాలో భారత బ్రాండ్ టాటా మోటార్స్ కూడా ఉంది. ఈ ఈవెంట్‌లో టాటా మోటార్స్‌ ఎనిమిది మోడళ్లను ప్రదర్శించనుంది.

ప్రస్తుతం వాహన తయారీదారులకు అందుబాటులో ఉన్న అతిపెద్ద మార్కెట్‌లలో భారత్‌ ఒకటిగా ఉంది. అంతే కాకుండా ప్రపంచ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి వైపు అడుగులు వేస్తున్న నేపథ్యంలో.. నేటి నుంచి ఈ నెల 3 వ తేదీ వరకు దేశ రాజధాని ఢిల్లీలో భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పో (Global Mobility Expo 2024) జరుగుతోంది.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut

టాటా నెక్సాన్‌ సీఎన్‌జీ: సీఎన్‌జీ కార్ల రంగంలో టాటా మోటార్స్‌ రెండో స్థానంలో ఉంది. 2023లో పంచ్ మరియు ఆల్ట్రోజ్ ఎస్‌యూవీలను గ్రీన్ ఫ్యూయల్ వెహికల్స్‌గా మార్చిన తర్వాత.. టాటా ఇప్పుడు ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్‌లో దీన్ని పరిచయం చేయడానికి సన్నాహాలు చేస్తోంది.

ఈ క్రమంలో Tata Nexon CNG ని భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో ప్రదర్శించనుంది. టాటా నెక్సాన్‌ CNG కిట్‌ను 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌తో అందించనుంది. ఈ ఇంజిన్‌ 120 PS పవర్‌తో 170 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. Nexon CNGని మాన్యువల్ మరియు AMT ట్రాన్స్‌మిషన్ ఆప్షన్లతో అందించనుంది.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut

టాటా సఫారీ కాన్సెప్ట్‌: అక్టోబర్ 2023లో, ఫేస్‌లిఫ్టెడ్ టాటా సఫారీని మెరుగైన స్టైలింగ్ మరియు మరింత ఆధునిక ఫీచర్లతో టాటా మోటార్స్‌ ప్రవేశపెట్టింది. ఈ కారు మూడు వరుస సీట్లతో పాటు బ్లాక్ అవుట్ అల్లాయ్ వీల్స్, గ్రిల్, క్యాబిన్ థీమ్ మరియు అప్‌హోల్స్టరీ ఇంకా ఎక్ట్సీరియర్‌లో 'డార్క్' బ్యాడ్జ్‌లతో ఆకర్షణీయంగా ఉంది.

కాగా ఇప్పుడు, భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో టాటా సఫారీ(Tata Safari Concept)ని కాన్సెప్ట్ రూపంలో ప్రదర్శించనుంది. ఇది రెడ్ డార్క్ ఎడిషన్‌లో ఉండగా.. ఇంటీరియర్‌ అండ్‌ ఎక్స్‌టీరియర్‌ రెడ్‌ కలర్‌లో ఉండే అవకాశాలు ఉన్నాయి. అంతే కాకుండా సేఫ్టీ ఫీచర్లను హైలైట్‌ చేస్తూ కాన్సెప్ట్‌తో పాటు క్రాస్-సెక్షన్ డిస్‌ప్లేను కూడా ప్రదర్శించనుంది. కాగా భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ పొందిన మొదటి కార్ల జాబితాలో ఇది కూడా ఒకటి.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut-Tata-Curvv

టాటా కర్వ్‌ EV: టాటా SUV లైనప్‌లో మరో కొత్త కారు Curvv ను కూడా ఎక్స్‌పోలో టాటా మోటార్స్‌ ప్రదర్శిస్తుంది. మొదట దీనిని EVగా లాంచ్ చేయనుంది. ఆ తర్వాత ఐసీఈ వెర్షన్‌లో రానుంది. 500 కి.మీ ఎక్కువ రేంజ్‌తో మల్టీ బ్యాటరీ ప్యాక్‌తో ఈ కారును సంస్థ విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు, Curvv ICE పెట్రోల్ మరియు డీజిల్ పవర్‌ట్రెయిన్‌లను ప్రవేశపెట్టవచ్చు.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut-Tata-Altroz-Racer

టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌: ఆటో ఎక్స్‌పో 2023లో మొదటిసారిగా టాటా ఆల్ట్రోజ్ రేసర్‌(Tata Altroz Racer)ను సంస్థ ఆవిష్కరించింది. ఫేస్‌లిఫ్టెడ్‌ మాదిరిగానే ఈ కారు కూడా వివిధ ఫీచర్‌ అప్‌డేట్‌లతో రానుంది. అయితే పవర్‌ట్రెయిన్‌లో టర్బో ఇంజిన్‌ ఆప్షన్‌ మినహా పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు. భారత్‌ మొబిలిటీ ఎక్స్‌పోలో ఈ కారును సంస్థ ప్రదర్శించనుంది.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut-Tata-Punch-EV

టాటా పంచ్‌ ఈవీ: టాటా మోటార్స్‌ కొత్తగా అభివృద్ధి చేసిన Acti.EV ప్లాట్‌ఫారమ్ ఆధారంగా పంచ్ EV(Tata Punch EV)ని తన మొదటి ఎలక్ట్రిక్ మోడల్‌గా ఇటీవల లాంచ్‌ చేసింది. కొత్త డిజైన్‌ను కలిగి ఉంటుంది. భారత్‌ మొబిలిటీ గ్లోబల్‌ ఎక్స్‌పోలో ఈ కారును ప్రదర్శించనుంది. 421 కి.మీ వరకు రేంజ్‌తో లాంచ్ అయిన ఈ టాటా పంచ్‌ ఈవీ రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లతో వస్తుంది.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut-Tata-Nexon-EV

టాటా నెక్సాన్‌ ఈవీ డార్క్‌: ఎక్స్‌పోలో ప్రదర్శించనున్న మరో కారు నెక్సాన్ EV Dark. ఇది ముందుగా ఫేస్‌లిఫ్ట్ Nexon EV మ్యాక్స్‌లో పరిచయమైంది. ఈ కారు ఫేస్‌లిఫ్టెడ్ Nexon EVపై ఆధారపడి ఉంటుండగా.. మల్టీ స్టైలింగ్‌ అప్‌డేట్లను కలిగి ఉంటుంది. డార్క్ ఎడిషన్ కావడంతో.. బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, ఆల్-బ్లాక్ క్యాబిన్ థీమ్‌తో సహా పలు మార్పులతో రానుంది. కాగా దాని ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్‌లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చు.

Bharat-Mobility-Global-Expo-2024-Tata-Motors-Debut-Tata-Harrier-EV

టాటా హారియర్‌ ఎలక్ట్రిక్‌: ఆటో ఎక్స్‌పో 2023 లో టాటా మోటార్స్‌.. ఫేస్‌లిఫ్టెడ్ టాటా Harrier 2024 EV ప్రదర్శించింది. ఇప్పుడు ఎక్స్‌పోలో దీనిని ప్రదర్శించనుంది. ఐసీఈ హారియర్‌ మాదిరిగానే హారియర్‌ EV లో కూడా అదే డిజైన్‌, ఫీచర్లు ఉండొచ్చు. అయితే మల్టీ బ్యాటరీ ప్యాక్‌ను అందించవచ్చు. ఆల్‌-వీల్‌- డ్రైవ్‌ వేరియంట్‌ను కూడా పరిచయం చేయనుంది. రేంజ్‌ 500 కి.మీ కంటే ఎక్కువగా ఉండొచ్చని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Thursday, February 1, 2024, 12:22 [IST]
English summary
Tata motors will showcase these 8 car models at bharat mobility global expo 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+