టాప్‌ సెల్లింగ్‌ టాటా కారు CNG వెర్షన్‌లో వచ్చేస్తుంది.. క్లచ్‌పై కాలు మోపకుండా 20 కి.మీ ప్రయాణించవచ్చు!

టాటా నెక్సాన్(Tata Nexon) దేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికిల్స్‌లో ఒకటిగా ఉంది. ఈ కారు కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో అన్నింటికంటే వేగంగా దూసుకుపోతుంది. ఈ టాటా నెక్సాన్ మారుతి బ్రెజా, కియా సోనెట్ వంటి వాటికి గట్టి పోటీని ఇస్తుంది. ఈ కారులో పెట్రోల్, డీజిల్, ఈవీ వంటి వెర్షన్‌లలో అందుబాటులో ఉంది. అందరికీ అందుబాటు ధరలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్‌ని కలిగి ఉండటంతో ఈ కారుని కొనేందుకు జనాలు ఎగబడుతున్నారు. ఇప్పుడు ఈ కారు సరికొత్త వెర్షన్‌లో రానుంది. ఆ వివరాలు ఈ కథనంలో..

టాటా మోటార్స్ నుంచి టాప్‌ సెల్లింగ్‌గా ఉన్న ఈ కారుని టాటా మోటార్స్‌ సీఎన్‌జీ పవర్డ్‌ ఎస్‌యూవీని విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. భారత్ మొబిలిటీ షో 2024లో సీఎన్‌జీ వెర్షన్‌ని ప్రదర్శించింది. సెప్టెంబర్‌ 2న టాటా కర్వ్‌ (Tata Curvv) పెట్రోల్‌, డీజీల్‌ వెర్షన్‌ తర్వాత తీసుకురాబోయే వెర్షన్‌ ఇదే కానుంది. పండుగ సీజన్‌కి ముందు లాంచ్ కానున్న ఈ సీఎన్‌జీ వెర్షన్‌ ఆటోమేటెడ్, మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో రానుంది.

Tata Nexon CNG Launching on Automatic transmission

టాటా మోటార్స్ ఇప్పటికే టియాగో (Tiago) మరియు టిగోర్ (Tigor)) వంటి సీఎన్‌జీ కార్లలో ఉపయోగించిన AMT టెక్నాలజీ ఉపయోగించబోతోంది. ఈ సంవత్సరం ప్రారంభంలో టియాగో మరియు టిగోర్ మోడళ్లలో సీఎన్‌జీ-AMT టెక్నాలజీని ప్రవేశపెట్టినప్పుడు బ్రాండ్‌కి భారీ ఆదరణ లభించింది. ఇప్పుడు ఫేమస్‌ కారుని ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వెర్షన్‌లో తీసుకువస్తుండటం మార్కెట్‌లో పలు సంచలనాలకు దారితీసే అవకాశం ఉంది.

రోడ్లపై పెరుగుతున్న రద్దీ కారణంగా, చాలా మంది ఆటోమేటిక్ కార్లకు మారడం ప్రారంభించారు. అందులో భాగంగా నెక్సాన్‌ని ఆటోమేటిక్‌ సీఎన్‌జీ వెర్షన్‌లో ప్రవేశ పెడుతుంది. కాంపాక్ట్ ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తొలి ఆటోమేటిక్ టర్బో-సీఎన్‌జీ ఎస్‌యూవీగా నెక్సాన్‌ నిలువనుంది. ఇది ఏఎంటీతో పాటు 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో అందించబడుతుంది. ఈ బై-ఫ్యూయల్ ఎస్‌యూవీలో 1.2-లీటర్ టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్ ఇంజిన్‌తో రానుంది.

Tata Nexon CNG Launching on Automatic transmission

నెక్సాన్ సీఎన్‌జీలో 1.2-లీటర్ 3 సిలిండర్ల టర్బోఛార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్‌ ప్రస్తుత పెట్రోల్ మోడల్ మాదిరిగానే 118 bhp పవర్‌ 170 nm గరిష్ట టార్క్‌ని ఉత్పత్తి చేయనుంది. అయితే సీఎన్‌జీ వెర్షన్‌లో ఫర్ఫామెన్స్‌ కాస్త తగ్గే అవకాశం ఉంటుంది. నెక్సాన్ సీఎన్‌జీలోని ట్విన్ సిలిండర్లు సుమారు 60 లీటర్ల గ్యాస్‌ని కలిగి ఉంటాయి. దీనిలోనూ భారీ సేఫ్టీని అందించేలా టాటా మోటార్స్ ప్రత్యేక దృష్టి పెట్టనుంది.

మైక్రో స్విచ్, లీకేజ్ ప్రూఫ్ మెటీరియల్స్, థర్మల్ ఇంటెంట్ ప్రొటెక్షన్, సింగిల్ అడ్వాన్స్‌డ్‌ ఈసీయూ, సీఎన్‌జీ మోడ్‌లో డైరెక్ట్ స్టార్ట్, ఫ్యూయల్‌ ఆటో స్విచ్, మాడ్యులర్ ఫ్యూయల్ ఫిల్టర్, లీక్ డిటెక్షన్ ఫైలర్ వంటి ఫీచర్లు ఇందులో ఉండనున్నాయి. ఇది సీఎన్‌జీ తగ్గితే ఆటోమేటిక్‌గా పెట్రోల్ మోడ్‌లోకి మారుతుంది. ఇందులోని సీఎన్‌జీ ట్యాంకులకు మరింత సురక్షితంగా వేగంగా ఇంధనం నింపుకోవచ్చని కంపెనీ పేర్కొంది.

Tata Nexon CNG Launching on Automatic transmission

ఇక దీని ధర విషయానికి వస్తే నెక్సాన్ స్టాండర్డ్‌ వెర్షన్ల కంటే దీని ధర సుమారు రూ .80,000 ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. ఈ సెగ్మెంట్‌లో టాటాకు ప్రధాన ప్రత్యర్థి మారుతి బ్రెజా సీఎన్‌జీ ఉంది. విడుదలకు ముందే ఈ సీఎన్‌జీ వెర్షన్‌ అంచనాలను పెంచుతోంది. ఈ కారుకి సంబంధించిన పూర్తి వివరాలను టాటా మోటార్స్‌ వెల్లడించడమే ఇక మిగిలింది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Monday, August 26, 2024, 12:52 [IST]
English summary
Tata nexon cng launching soon with 2 gearbox options check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+