Bharat Mobility Global Expo టాటా నెక్సాన్‌ CNG వెర్షన్‌ ప్రదర్శన.. ఈ SUV ప్రత్యేకత తెలుసా?

టాటా నెక్సాన్‌ భారత్‌ మార్కెట్‌లో ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌, ఎలక్ట్రిక్‌ వెర్షన్లలో అందుబాటులో ఉంది. తాజాగా ఈ టాటా నెక్సాన్‌ CNG వెర్షన్‌ను ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న భారత్‌ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2024లో (Bharat Mobility Global Expo 2024) ప్రదర్శించారు. ఈ నెక్సాన్ CNG త్వరలో అధికారికంగా విడుదల అయ్యే అవకాశం ఉంది.

మొబిలిటీ షోలో ప్రదర్శించిన టాటా నెక్సాన్‌ CNG వెర్షన్‌ (Tata Nexon CNG SUV) 1.2 లీటర్‌ టర్బోఛార్జ్‌డ్‌ పెట్రోల్ ఇంజిన్‌ను కలిగి ఉంది. ఈ CNG వెర్షన్‌లో టర్బో ఇంజిన్‌ను కలిగి ఉన్న తొలి SUV ఇదే. ఈ కారు పెట్రోల్‌ వెర్షన్‌లో 120ps శక్తి, 170Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

Tata showcased Nexon CNG version

అయితే అదే CNG వేరియంట్‌ శక్తి, టార్క్‌ తక్కువగా ఉత్పత్తి అయ్యే అవకాశం ఉంది. పెట్రోల్ వెర్షన్‌ కంటే ఎక్కువ మైలేజీ ఇచ్చే అవకాశం ఉంది. ఈ నెక్సాన్‌ CNG వేరియంట్ 5-స్పీడ్‌ మాన్యువల్, 6-స్వీడ్‌ మాన్యువల్‌, 6-స్పీడ్‌ ఆటోమేటిక్‌, 7-స్పీడ్‌ DCA ట్రాన్స్‌మిషన్‌ ఆప్షన్‌లలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

టాటా నెక్సాన్‌ CNG వేరియంట్‌ 30 లీటర్ల సామర్థ్యం కలిగిన 2 ట్యాంకులను కలిగి ఉంది. ఇతర సీఎన్‌జీ కార్ల కంటే ఎక్కువ బూట్‌స్పేస్‌ను కలిగి ఉంటుంది. మెరుగైన భద్రతా ఫీచర్లను కలిగి ఉంది. లీకేజీ ప్రూఫ్ మెటీరియల్స్‌, మైక్రో స్విచ్‌, సింగిల్‌ అడ్వాన్సడ్‌ ECU, థర్మల్‌ ఇన్‌సిడెంట్‌ ప్రొటెక్షన్‌, ప్యూయల్‌ ఆటో స్విచ్‌, లీక్‌ డిటెక్షన్ ఫీచర్‌, మాడ్యులర్‌ ఫ్యూయల్‌ ఫిల్టర్‌ వంటి కీలక ఫీచర్లను కలిగి ఉంది.

Tata Nexon CNG version

ఫిబ్రవరి 1న ప్రారంభం అయిన భారత్‌ మొబిలిటి గ్లోబల్‌ ఎక్స్‌పో 2024 లో టాటా అనేక కార్లను ప్రదర్శించింది. ఇందులో టాటా నెక్సాస్‌ సీఎన్‌జీ, టాటా హారియర్ ఈవీ, టాటా Curvv ఎస్‌యూవీ, టాటా ఆల్ట్రోజ్‌ రేసర్‌ కాన్సెప్ట్‌, టాటా సఫారీ డార్క్‌ ఎడిషన్‌ కాన్సెప్ట్‌, టాటా పంచ్‌ ఈవీ ఉన్నాయి.

* 2024 భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో షోలో టాటా ప్రొడక్షన్‌- స్పెక్‌ Curvv తోపాటు హారియర్‌ EVని కూడా సంస్థ ప్రదర్శించింది. టాటా హారియర్‌ ఈవీ ఫుల్‌ ఛార్జింగ్‌పై 500 కి.మీ రేంజ్‌తో విడుదల కానుంది. దీంతో అత్యధిక రేంజ్‌ ఇచ్చే బ్రాండ్‌ ఫ్లాగ్‌షిప్‌ SUV లలో టాటా హారియర్‌ ఈవీ అగ్రస్థానంలో ఉండనుంది. అంతే కాకుండా ఇది వెహికల్-టు-లోడ్ మరియు వెహికల్-టు-వెహికల్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది.

Tata Nexon CNG

ఫీచర్ల విషయానికొస్తే టాటా హారియర్‌ ఈవీ డిజైన్‌, ఇంటీరియర్‌ పరంగా అనేక అధునాతన ఫీచర్లను కలిగి ఉంటుంది. బ్యూటిఫుల్‌ బాడీ వర్క్‌తో పాటు ప్రకాశవంతమైన లోగో, ఎక్స్‌టీరియర్‌ పరంగా విస్తృత LED డేటైమ్ రన్నింగ్ లైట్లు ఫంక్షనల్ మరియు ఎమోటివ్ లైటింగ్‌తో పాటు ఏరోడైనమిక్‌ సెరేటెడ్ టర్బైన్ బ్లేడ్ వీల్స్‌ను కలిగి ఉంటుంది.

10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, లేయర్డ్ డ్యాష్‌బోర్డ్, టూ-స్పోక్ స్టీరింగ్ వీల్ వంటి టాప్‌ రేంజ్‌ ఫీచర్లతో రానుంది. ఇంకా ఆల్-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్‌ క్లస్టర్, టచ్-ఆధారిత కంట్రోలింగ్‌తో పాటు సేఫ్టీ పరంగా మల్టీ ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 ADAS సిస్టమ్ ఇంకా అధునాతన ఫీచర్లతో వస్తుంది. ధర విషయానికొస్తే రూ. 25 లక్షలు కంటే ఎక్కువ ఉంటుందని తెలుస్తోంది.

More from DriveSpark

Article Published On: Friday, February 2, 2024, 12:19 [IST]
English summary
Tata nexon cng showcased with turbo cng powertrain
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+