టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌కు గ్లోబల్‌ NCAP లో 5 స్టార్‌ రేటింగ్‌.. అడల్ట్‌, ఛైల్డ్‌ ప్రొటెక్షన్‌లో భేష్‌.!!

టాటా మోటార్స్‌కు చెందిన మరో కారు మరో అద్భుతమైన ఘనత సాధించింది. ఇటీవల నిర్వహించిన గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ పూర్తి 5 స్టార్‌ను రేటింగ్‌ను సాధించింది. కాగా ఇటీవల టాటా సఫారీ మరియు హారియర్‌ ఫేస్‌లిఫ్ట్‌ 5 స్టార్‌ రేటింగ్‌ జాబితాలో చేరగా.. తాజాగా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ కూడా చేరింది. పూర్తి సమాచారం ఈ కథనంలో..

టాటా మోటార్స్‌ నుంచి అత్యధికంగా అమ్ముడవతున్న ఎస్‌యూవీలలో టాటా నెక్సాన్‌ ఒకటి. ఇటీవల కొన్ని సాంకేతిక మార్పులతో టాటా Tata Nexon Facelift ను అప్‌గ్రేడ్‌ను సంస్థ విడుదల చేసింది. ఇంటీరియర్‌ ఎక్స్‌టీరియర్‌ పరంగా అధునాతన మార్పులు చేసిన నెక్సాన్‌ను సరికొత్త లుక్‌తో మార్కెట్లో ప్రవేశపెట్టింది.

Tata-Nexon-Facelift-2024-Global-NCAP-Crash-Test

కాగా టాటా నెక్సాన్‌కు సంబంధించిన అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే.. భారత్‌లో అత్యంత సురక్షితమైన కారుగా టైటిల్‌ను సాధించిన మొదటి కారుగా టాటా నెక్సాన్‌ ఘనత సాధించింది. మొదటగా.. నెక్సాన్‌ సబ్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీని సంస్థ 2017 లో విడుదల చేసింది. ఆ తర్వాత 2018 లో నిర్వహించిన గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో నెక్సాన్‌ 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించింది.

ఆ సమయంలో భద్రతా విభాగంలో గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌(Global NCAP Crash Test)లో 5 స్టార్‌ సాధించిన మొదటి భారతీయ కారుగా నెక్సాన్ నిలిచింది. ఇప్పుడు అంతకు మించి భద్రతా ప్రమాణాలతో ఫేస్‌లిఫ్టెడ్ టాటా నెక్సాన్ కారు ఇప్పుడు మళ్లీ గ్లోబల్ NCAPలో 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించి.. దానికదే సాటి అని నిరూపించుకుంది. అత్యంత సేఫ్టీ కారుగా నిలిచింది.

Tata-Nexon-Facelift-2024-Global-NCAP-Crash-Test

గ్లోబల్ NCAP క్రాష్‌ టెస్ట్‌లో పెద్దల భద్రతా విభాగంలో(Adult Safety) 2024 టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 34కి 32.22 పాయింట్లు సాధించింది. పిల్లల భద్రత(Child Protection)లో 49కి 44.52 స్కోర్ చేసింది. నెక్సాన్‌కి డోర్ ప్రొటెక్షన్ కూడా ఉండటంతో.. ఢీకొన్న సమయంలో టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ కారు బాడీ షెల్ మరియు ఫ్లోర్ స్థిరంగా ఉన్నాయని గ్లోబల్ NCAP ప్రశంసించింది.

గ్లోబల్ NCAP నివేదికల ప్రకారం ముందు సీటు ప్రయాణీకుల తల, మెడ, ఛాతీ రక్షణకు నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ అత్యంత భద్రతనిచ్చినట్లు వెల్లడించింది. డ్రైవర్ మరియు ప్రయాణీకుల యాంకిల్స్‌(Ankles)కు అత్యంత రక్షణనిచ్చిందని నివేదికలో పేర్కొంది. సైడ్స్‌ ఢీకొన్న సందర్భాల్లో.. ప్రయాణీకుల తల, పొట్ట, పొత్తికడుపు రక్షించబడుతోందని తెలిపింది. రోడ్డుపై పాదచారుల భద్రత కోసం UN127 మరియు GTR9 అవసరాలను 2024 టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ తీరుస్తుందని గ్లోబల్‌ NCAP పేర్కొంది.

Tata-Nexon-Facelift-2024-Global-NCAP-Crash-Test

గ్లోబల్‌ ఎన్‌క్యాప్‌లో టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించడానికి కారణం.. హై క్వాలిటీ బిల్ట్‌, సేఫ్టీ ఫీచర్లు. ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) ఫీచర్‌ ఉంది. ఈ కారణంగా ఇది గ్లోబల్ NCAPలో 5 స్టార్‌ రేటింగ్‌ సాధించడానికి దోహదపడుతుంది.

అంతేకాకుండా టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌లో సీటు ప్రయాణీకులందరికీ సీట్ బెల్ట్ రిమైండర్ ఆప్షన్‌ ఉంది. అంటే ప్రయాణీకుడు సీట్ బెల్ట్ ధరించకపోతే ఈ పరికరం హెచ్చరిస్తుంది. వీటితో పాటు, నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ కారు యొక్క అన్ని వేరియంట్లలో 6 ఎయిర్‌బ్యాగ్‌లను సంస్థ అందుబాటులో ఉంచింది.

అత్యంత భద్రతా ప్రమాణాల కారణంగా గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో టాటా నెక్సాన్‌ ఫేస్‌లిఫ్ట్‌ 5 స్టార్‌ రేటింగ్‌ను సాధించడమే కాకుండా.. ఇటీవల జరిగిన పలు ప్రమాదాల్లో టాటా కారు నాణ్యత పరంగా తనకు సాటి లేదని నిరూపించుకుంది. బలమైన బాడీ బిల్ట్‌తో యాక్సిడెంట్లలో ప్రయాణికులను కాపాడాయి.

More from DriveSpark

Article Published On: Thursday, February 15, 2024, 8:30 [IST]
English summary
Tata nexon facelift 2024 scores 5 star rating in global ncap crash test
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+