Tat Nexon iCNG Launch టాటా నెక్సాన్‌ సీఎన్‌జీ వెర్షన్‌ విడుదల.. భారీ మైలేజీ, సన్‌రూఫ్‌ ఇంకా మరెన్నో ఫీచర్లు!

టాటా మోటార్స్ నేడు నెక్సాన్‌ సీఎన్‌జీ వెర్షన్‌ని మార్కెట్‌లో విడుదల చేసింది. దీనిని కేవలం రూ .8.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధరతో ప్రవేశపెట్టింది. టర్బోఛార్జ్డ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌తో విడుదలైన తొలి సీఎన్‌జీ కారుగా టాటా నెక్సాన్‌ నిలిచింది. ఇందులోని 1.2 లీటర్ రెవోట్రాన్ పెట్రోల్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. ఎంట్రీ లెవల్ స్మార్ట్ అే కొత్త వేరియంట్‌తో అందుబాటులో ఉండనుంది. దీని ధర పెట్రోల్‌ బేస్‌ మోడల్‌ కంటే రూ. 29,000 ఎక్కువ.

ఈ టాటా నెక్సాన్‌ సీఎన్‌జీ వెర్షన్‌ మొత్తం 8 కొత్త వేరియంట్స్‌లో వస్తుంది. ఇందులోని స్మార్ట్ ప్లస్ వేరియంట్‌ సన్‌రూఫ్ ధర రూ.9.99 లక్షలు కాగా, ప్యూర్, ప్యూర్ ఎస్ వేరియంట్ల ధరలు రూ.10.69 లక్షలు, రూ.10.99 లక్షలు (ఎక్స్ షోరూమ్)గా ఉన్నాయి. టాప్-స్పెక్ క్రియేటివ్ వేరియంట్‌ ధర రూ.11.69 లక్షలు కాగా.. క్రియేటివ్ ప్లస్ ధర రూ.12.19 లక్షలుగా ఉంది.

Tata Nexon iCNG Launched At Rs 8 99 Lakh

ఇక ఫైనల్‌గా ఫుల్లీ లోడెడ్ ఫియర్‌లెస్‌ ప్లస్ PS ధర రూ.14.59 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. అందరు ఊహించినట్లుగానే ఈ నెక్సాన్ సీఎన్‌జీని మల్టిపుల్‌ వేరియంట్స్‌లో కంపెనీ ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం ప్రారంభంలోనే భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో ఈ కారుని కంపెనీ ప్రదర్శించింది. అప్పటి నుంచే దీని విడుదలపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి.

టాటా సీఎన్‌జీ మార్కెట్‌లో ఉన్న ఇతర మోడళ్ల మాదిరిగానే ట్విన్ సిలిండర్ టెక్నాలజీతో దీనిని తీసుకువచ్చింది. ఇటీవలి కాలంలో సీఎన్‌జీ అమ్మకాలకు మంచి డిమాండ్‌ వస్తుండటంతో ఈ విభాగాన్ని కంపెనీ విస్తరించే పనిలో నిమగ్నమైంది. ప్రస్తుతం ఈ కంపెనీ నుంచి టాటా పంచ్ దేశంలోనే అత్యధికంగా అమ్ముడవుతున్న మోడల్‌గా ఉంది. ఇది కూడా ఇప్పటికే సీఎన్‌జీ వెర్షన్‌లో అందుబాటులో ఉంది.

Tata Nexon iCNG Launched At Rs 8 99 Lakh

టాటా పంచ్‌ జోరుతో ఇటీవల టాటా నెక్సాన్ అమ్మకాలు క్షీణించాయి. అయినప్పటికీ ఇది ఇప్పటికీ టాప్ టెన్ బెస్ట్ సెల్లింగ్ మోడళ్లలో ఒకటిగా ఉంది. ఈ సీఎన్‌జీ వేరియంట్ రాక ఈ కార్ల మొత్తం అమ్మకాలకు కలిసి రానుంది. ఈ పండుగ సీజన్‌లో మరింత మందికి చేరువ అయ్యేంందుకు ఈ సీఎన్‌జీ వెర్షన్‌ని తీసుుకవచ్చినట్లు తెలుస్తోంది.

టాటా నెక్సాన్ సీఎన్‌జీ 230 లీటర్ల బూట్ స్పేస్‌ని కలిగి ఉంటుంది. ఇందులోని సిలిండర్లను చక్కగా ఇంటిగ్రేట్ చేసింది. టూల్ కిట్‌ని నిర్దేశిత స్టోరేజ్ ఏరియాలో స్టోర్‌ చేశఆరు. వాహనం కింద స్పేర్ వీల్‌ని అందించారు. ఇందులో అమర్చిన సీఎన్‌జీ సిస్టమ్ మల్టిపుల్‌ సేఫ్టీ ఫీచర్లను కలిగి ఉంటుంది.

Tata Nexon iCNG Launched At Rs 8 99 Lakh

మైక్రో స్విచ్, సిక్స్ పాయింట్ సిలిండర్ మౌంటింగ్ సిస్టమ్, సింగిల్ ఈసీయూ యూనిట్, హై క్వాలిటీ మెటీరియల్స్‌తో ఈ కిట్ ఉంటుంది. ఇందులోని ఇంజిన్‌ 170 nm గరిష్ట టార్క్‌ని 100 పవర్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఇది 6-స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది కిలోకి 24 కి.మీ మైలేజీని అందించనుంది.

ఇక ఈ నెక్సాన్‌ని ఇది వరకే సఫారీ, హారియర్‌లో సక్సెస్‌ సాధించిన డార్క్‌ రెడ్‌ వేరియంట్‌లో తీసుకురానుంది. ఈ డార్క్ వేరియంట్లలో కూడా భారీ మార్పులు ఉంటాయి. డిజైన్ పరంగా కొత్త రెడ్ డార్క్ వేరియంట్ అత్యద్భుతంగా ఉంటుంది. అప్ డేటెడ్ ఇంటీరియర్‌తో ఆకర్షణీయమైన లుక్‌ కోసం చూసేవారు ఈ నెక్సాన్ డార్క్ ఎడిషన్‌ని ఎంచుకోవచ్చు.

టాటా నెక్సాన్ ఈవీ కూడా ఇప్పుడు పెద్ద 45 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో అప్‌డేట్‌ చేయబడింది. ఇది ఇప్పుడు 489 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది (క్లెయిమ్ చేయబడింది), రియల్ వరల్డ్ రేంజ్ 350-370 కిలోమీటర్ల రేంజ్‌ని అందించనుంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ.13.99 లక్షలుగా ఉంది.

More from DriveSpark

Article Published On: Tuesday, September 24, 2024, 14:01 [IST]
English summary
Tata nexon icng launched at rs 8 99 lakh check all specifications in telugu
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+