టాటా 5-స్టార్‌ కారులో ఇకపై కొత్త ఫీచర్‌, అదేంటో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. ఇక ఆ కారు ఆటలు సాగవు!

పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఎలక్ట్రిక్ వెర్షన్‌లో లబిస్తున్న ఏకైక ఎస్‌యూవీగా టాటా నెక్సాన్ (Tata Nexon) మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఈ నెక్సాన్‌ విడుదలైన కొద్ది నెలలకే భారతదేశంలో అత్యధికంగా అమ్ముడైన ఎస్‌యూవీగా నిలిచింది. అయితే ఈ ఎస్‌యూవీ సేల్స్ మందగించాయి. ఈ ఏడాది ఏప్రిల్‌లో విడుదలైన మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO వచ్చినప్పటి నుంచి నెక్సాన్ అమ్మకాలు గణనీయంగా పడిపోయాయి. నెక్సాన్‌ని కొనుగోలు చేయాల్సిన కస్టమర్లు ఈ కారు వైపు షిఫ్ట్‌ అవుతున్నారు. దీనితో పాటు టాటా కర్వ్‌కి కూడా ఈ మహీంద్రా ఎక్స్‌యూవీ 3XO చుక్కలు చూపిస్తోంది. ప్రస్తుతం దేశంలో అత్యధిక వెయిటింగ్‌ పీరియడ్‌ కలిగిన కారుగా ఇది అవతరించింది.

కొన్ని రోజులుగా అమ్మకాలను గాడిలో పెట్టేందుకు టాటా ప్రయత్నిస్తోంది. తాజాగా నెక్సాన్ అమ్మకాలను పెంచడానికి టాటా కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా నెక్సాన్‌ ఐ సీఎన్‌జీ వెర్షన్‌ని పనోరమిక్ సన్‌రూఫ్ ఆప్షన్‌లో తీసుకువచ్చింది. ప్రస్తుతం దేశంలో సింగిల్ పేన్ ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్ బడ్జెట్ కార్లలో అందుబాటులో ఉన్నప్పటికీ, పనోరమిక్ సన్‌రూఫ్‌ కోసం కొంచెం అదనపు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది.

Tata Nexon Petrol Diesel Variants Panoramic Sunroof

అయితే ఎక్స్‌యూవీ 3XO సబ్-4 మీటర్ల ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో తొలిసారిగా పనోరమిక్ సన్‌రూఫ్‌ని అందించి మహీంద్రా ఆశ్చర్యపరిచింది. ఈ సెగ్మెంట్ ఫస్ట్ ఫీచర్ దీనిని హిట్‌ చేయడంలో సహాయపడింది. ఇక టాటా ఇటీవల నెక్సాన్ సీఎన్‌జీ వెర్షన్‌ని పనోరమిక్ సన్‌రూఫ్‌తో విడుదల చేసి మహీంద్రాకు ఎక్స్‌యూవీ 3XO కి సవాలు విసురనుంది. అయితే ఈ పనోరమిక్ సన్‌రూఫ్ నెక్సాన్ సీఎన్‌జీ హై వేరియంట్లలో మాత్రమే అందుబాటులో ఉండనుంది.

ఇకపై నెక్సాన్ పెట్రోల్, డీజిల్ వేరియంట్లు కూడా పనోరమిక్ సన్‌రూఫ్‌తో వస్తాయి. దీంతో మహీంద్రా XUV 3XOతో పాటు రెండు సన్‌రూఫ్ ఆప్షన్లను అందిస్తున్న తొలి కంపెనీగా టాటా నెక్సాన్ నిలిచింది. నెక్సాన్ లో-వేరియంట్లు కూడా ఎలక్ట్రానిక్ సన్‌రూఫ్‌ని పొందుతాయి. టాప్-స్పెక్ ఫియర్ లెస్ వేరియంట్‌లో వాయిస్-యాక్టివేటెడ్ పనోరమిక్ సన్‌రూఫ్‌ని పొందుతుంది. ఇక ప్రస్తుతం నెక్సాన్ మొత్తం 17 వేరియంట్లు పనోరమిక్ సన్‌రూఫ్‌ని పొందుతాయి.

Tata Nexon iCNG

ఇక పనోరమిక్ స్‌రూఫ్ ఉన్న పెట్రోల్ వేరియంట్ ధరలు రూ.13.6 లక్షల నుంచి ప్రారంభం అవుతాయి. అలాగే సన్‌రూఫ్ కలిగిన డీజిల్ వెర్షన్ ధర రూ.15 లక్షలుగా ఉంది. ఇక డ్యూయల్ పేన్‌ సన్‌రూఫ్‌తో వచ్చే నెక్సాన్ సీఎన్‌జీ ధర రూ.12.8 లక్షలుగా ఉంది. ఇవి అన్ని ఎక్స్ షోరూమ్ ధరలు మాత్రమే.

ఇక సన్‌రూఫ్, నాన్ సన్‌రూఫ్ వేరియంట్ల మధ్య ధర వ్యత్యాసం రూ.60,000 వరకు ఉంది. కొత్త సన్‌రూఫ్ మినహా ఫీచర్ల జాబితాలో ఎటువంటి మార్పులు కూడా కంపెనీ చేయలేదు. 10.25 అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, 10.25 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్‌మెంట్‌ సిస్టమ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్స్‌, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, వైర్‌లెస్‌ ఛార్జర్, ఎయిర్ ప్యూరిఫైయర్ ఉన్నాయి.

Tata Nexon Petrol Diesel Variants Panoramic Sunroof

సేఫ్టీ పరంగా 6 ఎయిర్‌బ్యాగ్స్‌, ఏబీఎస్ విత్ ఈబీడీ, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, 360 డిగ్రీల కెమెరా, టైర్‌ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ వ్యూ మానిటర్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ ఉన్నాయి. టాటా మోటార్స్ నెక్సాన్ కొనాలనుకునేవారికి పండుగ సీజన్ ఆఫర్లలో భాగంగా రూ .80,000 వరకు డిస్కౌంట్‌ పొందవచ్చు. ఈ మోడల్ ఆన్‌రోడ్‌ ప్రారంభ ధర రూ .9.54 లక్షలుగా ఉంది.

డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Tuesday, October 29, 2024, 17:51 [IST]
English summary
Tata nexon petrol diesel variants now comes with panoramic sunroof
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+