రూ. 8 లక్షలకే 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కారు.. దీనిలో 5 మంది ఆడుతూ పాడుతూ వెళ్లవచ్చు!
నేడు ప్రతీ ఇంట్లో ఓ కారు ఉండటం అనేది ట్రెండింగ్ అవుతుంది. ప్రతి ఒక్కరూ వాయిదాల రూపంలో (EMI) చెల్లిస్తూ కొత్త కార్లను ఇంటికి తీసుకెళ్తున్నారు. తద్వారా ప్రపంచంలోనే భారత్ అతిపెద్ద అతిపెద్ద కార్ల మార్కెట్‌గా అవతరిస్తోంది. దేశంలో కార్ల వినియోగం పెరుగుతుందని నెలవారి నివేదికలు కూడా స్పష్టం చేస్తున్నాయి. తాజాగా 2024 జూలై అమ్మకాల గణాంకాలు విడుదల అయ్యాయి. దేశీయ మార్కెట్లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో హ్యుందాయ్ క్రెటా అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాత మారుతి సుజుకి స్విఫ్ట్ నిలిచింది. టాటా కార్లు కూడా ఈ జాబితాలో చోటు సంపాదించాయి. ఇతర కంపెనీలకు చెందిన కార్లతో టాటా ఉత్పత్తులు పోటీ పడుతున్నాయి.
జూలైలో టాప్ 10 కార్ల జాబితాలో టాటా నెక్సాన్ (Tata Nexon) 7వ స్థానంలో నిలిచింది. గత నెలలో ఫ్యూయల్, ఎలక్ట్రిక్ నెక్సాన్ కార్లు మొత్తం కలిపి 13,902 యూనిట్లు అమ్ముడయ్యాయి. 2023 ఇదే నెలలో 12,349 యూనిట్లు సేల్స్‌తో పోల్చితే 12.58% వృద్ధిని నమోదు చేసింది. దీని ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.80 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది.

ఈ టాటా నెక్సాన్ 1.2-లీటర్ టర్బో పెట్రోల్ మరియు 1.5-లీటర్ డీజిల్ ఇంజిన్ ఆప్షన్‌లతో పనిచేస్తుంది. ఇది 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ ఆటోమేటిక్ మరియు 7-స్పీడ్ డ్యూయల్-క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT) గేర్‌బాక్స్‌తో జతచేయబడి వస్తుంది. ఇందులో వినియోగించిన ఇంజిన్‌నే తాజాగా టాటా విడుదల చేసిన కర్వ్‌లోనూ ఉపయోగించడం గమనార్హం. అయితే ఇంజిన్‌లో చిన్నపాటి మార్పులను చేసింది.
త్వరలో దీనిని త్వరలోనే సీఎన్‌జీ వెర్షన్‌లోనూ అందించనున్నారు. దీనిపై ఇప్పటికే టాటా కసరత్తు ప్రారంభించింది. ఈ కారు 6 మోనోటోన్ కలర్ ఆప్షన్స్‌తో పాటు, 7 డ్యూయల్ టోన్ కలర్ ఆప్షన్స్‌లో లభిస్తుంది. ఈ కారులో ఐదుగురు హాయిగా ప్రయాణించవచ్చు. లగేజీని తీసుకెళ్లడానికి 350 లీటర్ల సామర్థ్యం గల బూట్ స్పేస్ ఉంది. ఇది లాంగ్ జర్నీలో ఉపయోగపడుతుంది.

టాటా నెక్సాన్‌లో 10.25 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, ఆటో ఏసీ, వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ పరగం చూస్తే 6 ఎయిర్ బ్యాగులు, ఏబీఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఈఎస్పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) ఉన్నాయి.
ఇక నెక్సాన్ ఈవీ 30 kWh మరియు 40.5 kWh బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌తో వస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్‌పై 325 నుండి 465 కిలోమీటర్ల రేంజ్‌ని (మైలేజీ) అందిస్తుంది. నెక్సాన్ ఈవీ 10 వేరియంట్లలో అందుబాటులో ఉంది. డీసీ పవర్‌తో 56 నిమిషాలు, ఏసీ పవర్‌తో 6 గంటల సమయం పడుతుంది. ఈ ఈవీ BNCAP క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ రేటింగ్‌ని సాధించింది.

నెక్సాన్ ఈవీలో 10.25 అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, 9 స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ వంటి ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్లలో 6-ఎయిర్ బ్యాగ్, ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్),ఆల్-వీల్-వీల్ డిస్క్ బ్రేక్ ఉన్నాయి. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ .14.49 లక్షల నుంచి రూ .19.49 లక్షల మధ్య ఉంది.
డ్రైవ్స్‌పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








