సేఫ్టీలో ఈ కారు 5-స్టార్.. అందుకే జనాల నీరాజనం.. దీనిని కొనడానికి గల కారణాలు ఇవే
ఇండియాలో ప్రయాణికుల భద్రత పరంగా దిగ్గజ కంపెనీ టాటా మోటార్స్(Tata Motors) ముందు వరుసలో ఉంటుంది. తన అన్ని కార్లలో కూడా అత్యంత అధునాతన భద్రత ఫీచర్లను అందిస్తూ, ప్రయాణికులకు నమ్మకమైన కంపెనీగా టాటా మోటార్స్ గుర్తింపు పొందింది. దీనిని మరోసారి రుజువు చేస్తూ, దేశంలో ఎక్కువగా అమ్ముడవుతున్న టాటా నెక్సాన్ కారు, ప్రమాద సమయంలో పెద్దలు, పిల్లల రక్షణకు సంబంధించి భారత్ న్యూకార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్(Bharath NCAP)క్రింద నిర్వహించిన క్రాష్ టెస్ట్‌లో 5 స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను సాధించింది. దీంతో ప్రమాద సమయంలో లోపల కూర్చున్న ప్రయాణికులకు ఎలాంటి తీవ్ర గాయాలు అయ్యే అవకాశం లేదని ఈ టెస్ట్ ద్వారా వెల్లడైంది.
ఇటీవల నిర్వహించిన భారత్ ncap క్రాష్ టెస్ట్‌లో యాక్సిడెంట్ సమయంలో పెద్దల రక్షణకు సంబంధించి 32కి 29.86 పాయింట్లు సాధించగా, అదే పిల్లల రక్షణకు సంబంధించి 49కి 44.95 ఆకట్టుకునే స్కోర్‌ను పొందింది. దీంతో టాటా నెక్సాన్ పెద్దలు, పిల్లలకు రక్షణకు అత్యుత్తమ సామర్థ్యాన్ని ప్రదర్శిస్తుందని తెలిసిపోయింది.

భారత్ NCAP అసెస్‌మెంట్‌లో టాటా నెక్సాన్ ముందు ప్రయాణికుల సేఫ్టీకి సంబంధించిన నిర్వహించిన ఫ్రంటల్ ఆఫ్‌సెట్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00కి 14.65 పాయింట్లు సాధించింది. డ్రైవర్ ఛాతీ, కాళ్ళతో పాటు సహ ప్రయాణికుడి కాళ్ళకు 'తగినంత' రక్షణ లభించినట్లు పరీక్షలో వెల్లడైంది
సైడ్ సేఫ్టీ మూవబుల్ డిఫార్మబుల్ బారియర్ టెస్ట్‌లో 16.00కి 14.76 స్కోర్ సాధించింది. దీనిలో డ్రైవర్ ఛాతీతో పాటు, ప్రయాణికుల అన్ని శరీర భాగాలు తగినంత రక్షణ పొందుతున్నట్టు తేలింది. ఫ్రంట్, సైడ్ రెండు టెస్ట్‌లలో కూడా నెక్సాన్ బాగా రాణించింది.

ఆటోమొబైల్ రంగంలో టాటా నెక్సాన్ సేఫ్టీ పరంగా అగ్రగామిగా ఉంది. గతంలోనే గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించిన మొదటి కారుగా నెక్సాన్ నిలిచింది. పెద్దల సేఫ్టీలో 32కి 29.41 పాయింట్లు, పిల్లల సేఫ్టీలో 49కి 43.83 పాయింట్లు సాధించింది. టాటా నుంచి ఇప్పటికే పలు మోడళ్లు భారత్ ncap క్రాష్ టెస్ట్‌లో 5-స్టార్ రేటింగ్ సాధించగా, ఈ జాబితాలో నెక్సాన్ కూడా చేరింది.
ప్రయాణికుల భద్రతకు సంబంధించి నెక్సాన్‌లో ఆరు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి. అదనపు భద్రత కోసం ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, వెనుక పార్కింగ్ సెన్సార్లు, సెంట్రల్ లాకింగ్, అన్ని వాతావరణ పరిస్థితులలో కూడా కారును సులభంగా డ్రైవింగ్ చేయడానికి డ్రైవర్‌కు సహాయంగా నెక్సాన్ హిల్ హోల్డ్ కంట్రోల్‌ని కూడా ఈ కారులో టాటా అందించింది. దీంతో ఎత్తుగా ఉన్న స్థలాలపై కూడా కారును సులభంగా డ్రైవింగ్ చేయచ్చు.

వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, వెనుక డీఫాగర్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి. అలాగే, నెక్సాన్ కార్నరింగ్ టెక్నాలజీతో ఫ్రంట్ ఫాగ్ ల్యాంప్‌లు, ఆటో-డిమ్మింగ్ ఇన్‌సైడ్ రియర్-వ్యూ మిర్రర్ (IRVM), బ్లైండ్ వ్యూ మానిటర్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, వివిధ వాతావరణ పరిస్థితులలో సురక్షిత డ్రైవింగ్ కోసం ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు, రెయిన్ సెన్సింగ్ వైపర్‌లు టాటా నెక్సాన్‌లో ఉన్నాయి.
టాటా మోటార్స్ నుంచి ఈ ఏడాది విడుదలైన కర్వ్ (Curvv), కర్వ్ ఈవీ (Curvv EV) కార్లు క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సాధించాయి. భారత్ న్యూకార్ అసెస్‌మెంట్ ప్రోగ్రామ్ (Bharat NCAP) కింద ఈ రెండు కార్లూ అత్యధిక రేటింగ్ పాయింట్లు అందుకున్నాయి. వీటితో పాటు టాటా పంచ్ ఈవీ, టాటా హారియర్,టాటా సఫారీ కార్లు కూడా 5 స్టార్ రేటింగ్‌ను సాధించాయి.

భారత ఆటోమొబైల్ మార్కెట్‌లో భద్రతకు బ్రాండ్ అంబాసిడర్‌గా నిలలిచేందుకు టాటా కంపెనీ బాగా కృషి చేస్తుంది. దానిలో భాగంగా ఇతర కార్లతో పాటు నెక్సాన్ సైతం సేఫ్టీ విషయంలో ముందు వరుసలో నిలిచింది. ఇప్పటికే టాటా నెక్సాన్‌కు ఇండియా మార్కెట్లో మంచి క్రేజ్ ఉంది. సురక్షితమైన ప్రయాణం, భద్రత కావాలని కోరుకునే వారికి నెక్సాన్ మంచి ఆప్షన్‌గా ఉంది.


Click it and Unblock the Notifications








