రూ.4.99 లక్షలకే స్టైలిష్ ఎలక్ట్రిక్ కారు లాంచ్! చిన్నదైనా పవర్‌ఫుల్‌దే.. అప్‌డేటెడ్ కామెట్ EV వచ్చేసింది
దేశీయ వాహన పరిశ్రమలో MG మోటార్ ప్రసిద్ధ కార్ల తయారీ కంపెనీగా ఉంది. ఇది సంప్రదాయ మోడళ్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేస్తూ, భారతీయ వినియోగదారులకు బాగా చేరువ అయిన కంపెనీ. ఎలక్ట్రిక్ వాహనాల విభాగంలో తనదైన ముద్ర వేసిన MG తన ప్రసిద్ధ కామెట్‌ను మరింత కొత్తగా మార్చి తాజాగా మార్కెట్లోకి విడుదల చేసింది. ఇండియాలో ఈవీలకు పెరుగుతున్న ఆదరణ గమనించిన కంపెనీ 2025 ఎంజీ కామెట్ ఈవీ (2025 mg comet ev) కొత్త మోడల్ అధికారికంగా లాంచ్ చేసింది. ఇది మరింత ఆకర్షణీయమైన డిజైన్, స్టైలిష్ లుక్, అధునాతన ఫీచర్లతో చాలా తక్కువ ధరకు అమ్మకానికి అందుబాటులో ఉంది. ఇది ప్రధానంగా నగరాల్లో డ్రైవింగ్‌కు అనుకూలంగా ఉంటుంది.
కొత్త MG కామెట్ EV ప్రారంభ ధర రూ. 4.99 లక్షల నుంచి ఉంది, ఇది ఎక్స్ షోరూమ్ ధర. ఆన్‌రోడ్ వచ్చేసరికి స్వల్పంగా ఎక్కువగా ఉంటుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ కారును వినియోగదారులకు BaaS (బ్యాటరీ-యాజ్-ఎ-సర్వీస్) పథకం కింద కూడా విక్రయిస్తుంది. దీని వలన వినియోగదారునికి కి.మీ.కు రూ. 2.5 ఖర్చవుతుంది. ఇది 5 వేరియంట్లలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. కస్టమర్లు తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.

2025 MG కామెట్ EV ఎగ్జిక్యూటివ్, ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జర్, ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జర్ అనే వేరియంట్లో లభిస్తుంది. వేరియంట్‌ను బట్టి ధరలో మార్పులు ఉంటాయి. మరో విషయం ఏమిటంటే దీని ఎక్సైట్, ఎక్సైట్ ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్లలో రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు ఎలక్ట్రికల్‌గా మడతపెట్టగల బయటి రియర్‌వ్యూ మిర్రర్లను అందించారు. అంతకుముందు వీటిని టాప్-టాపింగ్ ఎక్స్‌క్లూజివ్ వేరియంట్‌లో ఇవ్వగా ఇప్పుడు మిడ్-స్పెక్ వేరియంట్లలో ఇచ్చారు.
ఇదే సమయంలో దీని ఎక్స్‌క్లూజివ్, ఎక్స్‌క్లూజివ్ ఫాస్ట్ ఛార్జర్ వేరియంట్‌లలో 4-స్పీకర్ ఆడియో సిస్టమ్, ప్రీమియం లెథరెట్ సీట్లను అందించారు. ఇక అన్ని వేరియంట్లు కూడా డ్యూయల్ 10.25-అంగుళాల ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, కీలెస్ ఎంట్రీ, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే, 55 కంటే ఎక్కువ కనెక్ట్ చేయబడిన కార్ టెక్ ఫీచర్స్ ఉంటాయి.

2025 MG కామెట్ ఎలక్ట్రిక్ హ్యాచ్‌బ్యాక్‌లో 17.3 kWh బ్యాటరీ ప్యాక్ ఉంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేసినట్లయితే 230 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. దీని కోసం ఈ కారులో మెరుగైన పెర్ఫామెన్స్ ఇచ్చే ఎలక్ట్రిక్ మోటార్‌ను అందించారు. ఈ మోటారు 17.3kWh లిథియం-అయాన్ బ్యాటరీ నుండి పవర్‌ను అందుకుంటుంది. ఇది 42 BHP హార్స్‌పవర్, 110 Nm గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 సీటర్ కారు.
ఈ కారు లోపలికి ఎంట్రీ ఇవ్వడానికి రెండు డోర్లు ఉంటాయి. ప్రయాణికులు కూర్చోడానికి సరిపడినంత స్థలం ఉంటుంది. ఇది సేఫ్టీ పరంగా కూడా అత్యంత అధునాతన ప్రమాణాలను కలిగి ఉంది. దీనిలో డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్‌బ్యాగులు,EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ABS (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్), ,ESC (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), రివర్స్ పార్కింగ్ కెమెరా, వెనుక డిస్క్ బ్రేక్‌లు వంటివి ఉన్నాయి. బుకింగ్స్ ప్రారంభం అయ్యాయి.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








