కిర్రాక్ ఫీచర్లు, కలర్స్‌తో 2025 నెక్సాన్ లాంచ్.. కేవలం రూ.7.99 లక్షలకే కొనేయొచ్చు!
దిగ్గజ ఆటోమొబైల్ సంస్థ టాటా మోటార్స్.. తమ కార్లతో భారత మార్కెట్లో ప్రత్యేక స్థానం సొంతం చేసుకుంది. అనేక సంవత్సరాలుగా ఈ సంస్థ నుంచి వచ్చిన కార్లు భారత రోడ్లపై చక్కర్లు కొడుతున్నాయి. ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఎస్‌యూవీల్లో టాటా నెక్సాన్.. వినియోగదారులను బాగా ఆకట్టుకున్న మోడల్. ఇది ఈ సంస్థకు మంచి లాభాలను కూడా తెచ్చిపెట్టింది. ఫీచర్లు, స్టైల్ లోనే కాకుండా సేఫ్టీ పరంగానూ ఈ కారు మంచి పేరు సొంతం చేసుకుంది. ఈ ఎస్‌యూవీని మారుతున్న వినియోగదారుల అవసరాలకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేసి తీసుకువస్తోంది టాటా సంస్థ. ఇప్పుడు ఈ టాటా నెక్సాన్‌కు సంబంధించి 2025 మోడల్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. రూ.7.99 లక్షల ప్రారంభ ధరతో అందుబాటులో ఉన్న ఈ కారు విశేషాలేంటో చూసేద్దాం.
టాటా నెక్సాన్ 2025 వెర్షన్‌ను మోడర్న్ ఫీచర్లు జోడించి కొత్త రంగుల్లో, కొత్త వేరియంట్లలో తీసుకువచ్చింది టాటా మోటార్స్ సంస్థ. Grassland Beige అనే కలర్ ఆప్షన్‌తో దీన్ని అందుబాటులోకి తెచ్చింది. ఇందులో న్యూ ప్యూర్ ప్లస్, క్రియేటివ్ ప్లస్, క్రియెటివ్ ప్లస్ పీఎస్ వేరియంట్లు కూడా ఉన్నాయి.

ఈ కొత్త మోడల్ కారులో వాయిస్- అసిస్టెడ్ పనోరమిక్ సన్‌రూఫ్, వెంటిలేటెడ్ leatherette సీట్లతో పాటు, 10.25 అంగుళాల కొత్త ఇన్‌ఫోటెయిన్మెంట్ డిస్‌ప్లే ఉంటుంది. సబ్‌వూఫర్‌తో 9 JBL స్పీకర్లు, e-shifterతో ఉండే 7- స్పీడ్ DCA ఆటోమేటిక్ గేర్ బాక్స్, ప్యాడిల్ షిఫ్టర్లు వంటి కొత్త ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇవి కాకుండా ఇంకా కొత్త మార్పులేవీ 2025 మోడల్‌లో లేవనే చెప్పవచ్చు.
నెక్సాన్ వేరియంట్ లైనప్‌లోని కార్లన్నీ 16 అంగుళాల వీల్స్‌తో ఉంటాయి. ఇందులో లోయర్ వెరియంట్లు స్టీల్ వీల్స్‌తో ఉండగా... టాప్ వేరియంట్లలో డైమండ్ కంట్ అలాయ్ వీల్స్‌ను టాటా మోటార్స్ సంస్థ అందిస్తుంది. ఇంజిన్ ఆప్షన్లు కూడా 2025 మోడల్‌లో అంతకుముందు ఉన్న వాటినే కొనసాగించారు.

నెక్సాన్ ఎస్‌యూవీ 1.2 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ రివోట్రాన్ పెట్రోల్, 1.5 లీటర్ టర్బో ఛార్జ్‌డ్ రివోటార్క్ డీజిల్‌తో ఉంటుంది. ఇందులోని 1,200 సీసీ పెట్రోల్ ఇంజిన్..5,500 rpm వద్ద 86.7 bhp ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1,750-4,000 rpm వద్ద 170 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ కారు సీఎన్‌జీ, bi-fuel ఆప్షన్లతో అందుబాటులో ఉంది.
సీఎన్‌జీతో నడిచినప్పుడు టాటా నెక్సాన్ కారు.. 5,000 rpm వద్ద 72.5 bhp ఉత్పత్తి చేస్తుంది. 2,000-3,000 rpm వద్ద 170Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. మరోవైపు.. 1,500 సీసీ డీజిల్ ఇంజిన్ 3,750 rpm వద్ద 83.3 bhp ఉత్పత్తి చేస్తుంది. అలాగే 1,500 -2,750 rpm వద్ద 260 Nm టార్క్ ఉత్పత్తి చేస్తుంది. వేరియంట్‌ను బట్టి.. ఇందులోని ఇంజిన్ 5- స్పీడ్ మ్యాన్యువల్, 6- స్పీడ్ మ్యాన్యువల్, 6- స్పీడ్ AMT, 7- స్పీడ్ DCT గేర్ బాక్స్ ఆప్షన్లలో లభిస్తుంది.

డైమెన్షన్స్, ఇతర స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే ఈ 2025 మోడల్ కారు.. పాత వాటిలానే ఉంటుంది. ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీ 3,995 మి.మీ పొడవులో, 1804 మి.మీ.ల వెడల్పుతో, 1,620 మి.మీ ఎత్తుతో ఉంటుంది. ఇది 208 మి.మీ.ల గ్రౌండ్ క్లియరెన్స్‌తో ఉంటుంది. ఈ కారు బూట్ స్పేస్ 382 లీటర్లుగా ఉంటుంది. ఇందులోని సీఎన్‌జీ వెర్షన్ కారు.. ట్విన్ సిలిండర్ టెక్నాలజీ కారణంగా 321 లీటర్ల లగేజ్ స్పేస్‌తో ఉంటుంది.
గతేడాది ప్రారంభంలో నెక్సాన్ మోడల్‌కు సంబంధించి రెండో ఫేస్‌లిఫ్ట్ మోడల్‌ను టాటా సంస్థ విడుదల చేసింది. మోడర్న్ డిజైన్, కొత్త ఫీచర్లతో వచ్చిన ఈ కారుకు వినియోగదారుల నుంచి మంచి స్పందన కనిపించింది. ఎప్పటికప్పుడు వాహనాలను అప్‌గ్రేడ్ చేస్తుండడంతో ఈ కార్ల అమ్మకాలు పెరుగుతున్నాయి.


Click it and Unblock the Notifications








