బడ్జెట్‌లో బెస్ట్ ఇదే..24 కి.మీ మైలేజ్, 8 లక్షలు, 5 సీట్లు.. ఈ పాపులర్ 'టాటా SUV'కి ఫిదా అయిన జనం!
టాటా నెక్సాన్ జనాల్లో ఎంతో పాపులారిటీ సంపాదించుకున్న కాంపాక్ట్ SUV. గల్లి నుంచి ఢిల్లీ వరకు ప్రతి ఊరిలోని ప్రతి ఇంటిలోనూ దీని ప్రస్తావన వచ్చే ఉంటుంది. ఈ కారు ఎట్రాక్టివ్ డిజైన్, ఫీచర్లను కలిగి ఉండడంతో పాటు భారీ సంఖ్యలో అమ్ముడవుతోంది. కస్టమర్లు కూడా దీని కోసం షోరూంల ఎదుట ఎగబడుతున్నారు. ఈ ఏప్రిల్ నెలలో కూడా ఈ 'నెక్సాన్' భారీ స్థాయిలో అమ్ముడైంది. మరిన్ని వివరాలు తెలుసుకుందాం.
గత నెల (ఏప్రిల్-2025)లో టాటా కంపెనీ దాదాపు 15,457 యూనిట్ల నెక్సాన్ కార్లను సక్సెస్‌ఫుల్‌గా విక్రయించింది. దీని ద్వారా దేశీయ మార్కెట్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 కార్ల జాబితాలో 'నెక్సాన్' SUV 6వ స్థానంలో నిలిచింది.

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో టాటా నెక్సాన్ కారు మంచి సంఖ్యలోనే అమ్ముడైంది. మార్చిలో 16,366 యూనిట్లు, ఫిబ్రవరిలో 15,349 యూనిట్లు, జనవరి నెలలో 15,397 యూనిట్లను విక్రయించారు. అలాగే 2024 నవంబర్‌లో 13,536 యూనిట్లు, డిసెంబర్‌లో 15,329 యూనిట్లను అమ్మారు.
ఈ గణాంకాలను పరిశీలిస్తే టాటా కంపెనీ నెలకు సగటున 15,000 యూనిట్ల నెక్సాన్ కాంపాక్ట్ ఎస్యూవీలను విక్రయించడంలో సక్సెస్ సాధించింది. నెక్సాన్ కారు బడ్జెట్ ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండడం, అంతేకాకుండా అనేక లేటెస్ట్ ఫీచర్లను కలిగి ఉండటంతో మధ్యతరగతి ప్రజల కుటుంబానికి ఇది ఒక మంచి ఆప్షన్ గా విశ్లేషిస్తున్నారు.

ఈ కారు చాలా సరసమైన ధరలో కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉంది. ఇది రూ.8 లక్షల నుంచి రూ.16 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. ఇందులో 5 సీట్లు ఉండటంతో ప్రయాణికులు సులభంగా ప్రయాణించవచ్చు. బయటి భాగంలో అద్భుతమైన డిజైన్ ఉంటుంది. ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే, గ్రాస్‌ల్యాండ్ బీజ్, ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూతో సహా వివిధ రంగులలో కూడా లభిస్తుంది.
కొత్త నెక్సాన్ SUV ధరలకు తగిన పవర్‌ట్రెయిన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ CNG ఇంజిన్లతో వస్తుంది. ఇది లీటరకు 17.01 నుంచి 24 కిలోమీటర్ల వరకు మైలేజ్ ఇస్తుంది. 10.25 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లేతో సహా వివిధ ఫీచర్లను కలిగి ఉంది. సేఫ్టీ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లను పొందింది.

టాటా నెక్సాన్ ఈవీ కూడా అందుబాటులో ఉంది: ఈ కారు రూ.13 లక్షల నుండి రూ.17 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉంది. ఇది 45 కిలోవాట్ (kWh), 46.08 కిలోవాట్ (kWh) కెపాసిటీ గల బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇది పూర్తి ఛార్జ్‌పై 275 నుంచి 489 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్) అందిస్తుంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు


Click it and Unblock the Notifications








