రూ.8 లక్షలకే అదిరిపోయే టాటా SUV.. 24కిమీ మైలేజ్.. నెలకు 15,000 యూనిట్లు సేల్..రికార్డుల మీద రికార్డులు!

కొత్త కారు కొనాలని చూస్తున్నారా ? అది కూడా బడ్జెట్ ధరలో మంచి మైలేజ్ ఇచ్చే SUV కావాలా? అయితే టాటా నెక్సాన్ గురించి మీరు కచ్చితంగా తెలుసుకోవాలి. ఇది కేవలం రూ.8 లక్షల నుంచే మొదలవుతుంది. 24 కి.మీ. మైలేజ్ ఇస్తుంది. మార్కెట్‌లో దీనికి ఎంత డిమాండ్ ఉందంటే కంపెనీ ఊహించిన దానికంటే చాలా ఎక్కువ యూనిట్లు అమ్ముడవుతున్నాయి. టాటా నెక్సాన్ ఎందుకు ఇంత పాపులర్ అయ్యిందో తెలుసుకుందాం.

టాటా నెక్సాన్ చాలా నమ్మకమైన SUV. ఇది బడ్జెట్ ధరలోనే దొరుకుతుంది. పెద్ద సంఖ్యలో సేల్ అవుతోంది. రీసెంట్‌గా దేశీయ మార్కెట్‌లో ఈ 'మే' నెలలో ఎక్కువగా సేల్ అయిన ప్రముఖ కార్ల లిస్ట్ రిలీజ్ అయ్యింది. దానిలో ఈ 'నెక్సాన్' 10వ స్థానంలో ఉంది.

Tata Nexon

కంపెనీ ఎక్స్‌పెక్ట్ చేసిన దానికంటే మంచి నెంబర్లలోనే సేల్ అయ్యింది. మే-2025లో టాటా మోటార్స్ ఏకంగా 15,457 యూనిట్ల 'నెక్సాన్' SUVలను సేల్ చేసింది. 2024 'మే'లో 11,457 యూనిట్లు సేల్ అయ్యాయి. దాంతో పోలిస్తే సేల్స్ విషయంలో ఇయర్-ఆన్-ఇయర్ (YoY) 14% గ్రోత్ సాధించింది.

ఈ సంవత్సరం మొదటి 4 నెలల్లో కూడా 'టాటా నెక్సాన్' SUVలు పెద్ద సంఖ్యలోనే సేల్ అయ్యాయి. మొత్తం 62,569 యూనిట్లు అమ్ముడయ్యాయి. అందులో ఏప్రిల్‌లో 15,457 యూనిట్లు, మార్చిలో 16,366 యూనిట్లు, ఫిబ్రవరిలో 15,349 యూనిట్లు, జనవరిలో 15,397 యూనిట్లు కంపెనీ సక్సెస్‌ఫుల్‌గా సేల్ చేసింది.

Tata

ఈ నెంబర్లను బట్టి చూస్తే ప్రతి నెలా 15,000 యూనిట్ల 'టాటా నెక్సాన్' SUVలు అమ్ముడయ్యాయి. ఈ కారు సేల్స్ పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా 'నెక్సాన్' చాలా ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను కలిగి ఉంది. అలాగే, తక్కువ ధరలో దొరుకుతుండటంతో కస్టమర్లు ఇష్టపడి తీసుకుంటున్నారని అనలిస్ట్స్ చెబుతున్నారు.

ఇదొక కాంపాక్ట్ SUV. రూ.8 లక్షల నుండి రూ.15.60 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో దొరుకుతుంది. ఈ కారు బయట భాగంలో చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ప్రిస్టీన్ వైట్, డేటోనా గ్రే, గ్రాస్‌ల్యాండ్ బీజ్, ప్యూర్ గ్రే, ఓషన్ బ్లూ అనే కలర్ ఆప్షన్స్‌లో కూడా దొరుకుతుంది.

Tata

ఈ కొత్త కారులో 5 సీట్ల ఆప్షన్ ఉంది. ఎక్కువ లగేజ్ తీసుకెళ్లడానికి వీలుగా 382 లీటర్ల బూట్ స్పేస్ ఉంది. పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ ఇంజిన్‌లను కలిగి ఉంది. లీటరుకు 17 నుండి 24 కిమీ వరకు మైలేజ్ ఇస్తుంది. టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్స్‌తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి.

ఇది ఎలక్ట్రిక్ SUV. రూ.12 లక్షల నుండి రూ.17 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్) ధరలో దొరుకుతుంది. 45, 46.08 కిలో వాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఫుల్ ఛార్జ్‌పై 275 నుండి 489 కిలోమీటర్ల రేంజ్ (మైలేజ్) ఇస్తుంది. 12.3-అంగుళాల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో సహా చాలా ఫీచర్స్ ఉన్నాయి.

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: టాటా నెక్సాన్ ఒక ఆల్-రౌండర్ SUV. తక్కువ ధర, మంచి మైలేజ్, ఆధునిక ఫీచర్స్, పెట్రోల్, డీజిల్, సీఎన్‌జీ, ఈవీ వంటి బహుళ ఇంజిన్ ఆప్షన్స్‌తో ఇది మార్కెట్‌లో దూసుకుపోతోంది. ఈ సేల్స్ నెంబర్స్ టాటా నెక్సాన్ పట్ల కస్టమర్లలో ఎంత నమ్మకం ఉందో చూపిస్తున్నాయి. ఒక కొత్త SUV కొనాలని చూస్తున్నట్లయితే టాటా నెక్సాన్‌ను కచ్చితంగా పరిశీలించొచ్చు.

More from DriveSpark

Article Published On: Monday, June 9, 2025, 14:40 [IST]
English summary
24 km mileage rs 8 lakh this tata suv is in high demand selling in shocking numbers
Read more on: #tata nexon #india #auto news
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+