24 కి.మీ. మైలేజ్, రూ.8 లక్షల ధర, 5-సీటర్.. ఈ టాటా SUVకి ఫుల్ డిమాండ్
టాటా నెక్సన్ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన కార్లలో ఒకటి. కాంపాక్ట్ ఎస్‌యూవీ విభాగంలో తనదైన ముద్ర వేసుకున్న ఈ కారు నమ్మకానికి, అద్భుతమైన పనితీరుకు పేరుగాంచింది. ఈ జూన్ నెలలో 11,602 యూనిట్ల నెక్సన్ కార్లు అమ్ముడయ్యాయి. గత సంవత్సరం జూన్ 2024లో 12,066 యూనిట్లు అమ్ముడవగా, ఈసారి అమ్మకాలలో ఏడాదివారీగా కేవలం 4% స్వల్ప తగ్గుదల మాత్రమే నమోదైంది.
ఈ సంవత్సరం మొదటి 5 నెలల్లో కూడా టాటా నెక్సన్ ఎస్‌యూవీలు మంచి సంఖ్యలో అమ్ముడయ్యాయి. మొత్తం 75,665 యూనిట్లు విజయవంతంగా విక్రయించబడ్డాయి. ఈ సంఖ్యను లెక్కించినప్పుడు, ప్రతి నెలా సగటున 15,000 యూనిట్లు అమ్ముడయ్యాయని తెలుస్తోంది. ఈ ఎస్‌యూవీ సరసమైన ధరలో అందుబాటులో ఉంటుంది, మధ్యతరగతి, ధనిక వర్గాల కస్టమర్‌లు కూడా సులభంగా కొనుగోలు చేయవచ్చు.

దీని ధర రూ.8 లక్షల నుండి రూ.15.60 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. స్మార్ట్, స్మార్ట్ ప్లస్, ప్యూర్ ప్లస్, ప్యూర్ ప్లస్ ఎస్, క్రియేటివ్, క్రియేటివ్ ప్లస్, ఫియర్‌లెస్, ఫియర్‌లెస్ ప్లస్ అనే వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. కొత్త నెక్సన్ బాహ్యంగా చాలా ఆకర్షణీయమైన డిజైన్‌ను కలిగి ఉంది. ఓషన్ బ్లూ, ప్యూర్ గ్రే, ప్యూర్ వైట్, గ్రాస్‌ల్యాండ్ బీజ్ వంటి వివిధ కలర్ ఆప్షన్లలో కూడా లభిస్తుంది.
ఈ కారు 3995mm పొడవు, 1804mm వెడల్పు, 1620mm ఎత్తు. 208mm గ్రౌండ్ క్లియరెన్స్, 2498mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది. ఇది శక్తివంతమైన పవర్‌ట్రైన్ ఆప్షన్లను కలిగి ఉంది. 1.2-లీటర్ టర్బో పెట్రోల్, 1.5-లీటర్ డీజిల్, 1.2-లీటర్ సిఎన్‌జి ఇంజిన్. వేరియంట్‌లను బట్టి 5-స్పీడ్ మ్యాన్యువల్, 6-స్పీడ్ మ్యాన్యువల్/6-స్పీడ్ ఆటోమేటిక్, 7-స్పీడ్ డీసీటీ(డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్) గేర్‌బాక్స్‌లు ఉన్నాయి. ఏ బైక్‌కు తీసిపోకుండా 17.01నుండి 24 కి.మీ. వరకు మైలేజ్ ఇస్తుంది.

ఈ కారులో 5 సీట్లు ఉన్నాయి. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. ప్రయాణికుల రక్షణ కోసం 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఏబీఎస్ (యాంటీలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఈబీడీ (ఎలక్ట్రానిక్ బ్రేక్‌ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), 360-డిగ్రీ కెమెరాతో వస్తుంది.

నెక్సన్ ఎస్‌యూవీలో ఎలక్ట్రిక్ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది. దీని ధర రూ.12.49 లక్షల నుండి రూ.17.19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుంది. 30 కిలోవాట్ (kWh), 45 కిలోవాట్ (kWh) బ్యాటరీ ప్యాక్‌లతో వస్తుంది. ఒక్కసారి పూర్తిగా ఛార్జ్ చేస్తే 275 నుండి 489 కిలోమీటర్ల వరకు రేంజ్ ఇస్తుంది.
ఈ కారులో కూడా 5 సీట్ల ఆప్షన్ ఉంది. 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-స్పీకర్ జేబీఎల్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీతో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది. 6-ఎయిర్‌బ్యాగ్‌లు, ఈఎస్‌సీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్), టీపీఎంఎస్ (టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్), 360-డిగ్రీ కెమెరా వంటి భద్రతా ఫీచర్లు ఉన్నాయి.


Click it and Unblock the Notifications








