హైబ్రిడ్ కారుతో అదరగొట్టిన ఎంజీ మోటార్.. ఈ క్రాస్‌ఓవర్ మోడల్‌లో ఫీచర్లన్నీ కిర్రాక్!

బ్రిటన్‌కు చెందిన దిగ్గజ వాహన తయారీ సంస్థ జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా.. దిల్లీ వేదికగా జరుగుతున్న భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో అదరగొడుతోంది. తమ బ్రాండ్ నుంచి కొత్త మోడళ్లను పరిచయం చేసి, వీక్షకులను చూపుతిప్పుకోనివ్వకుండా చేస్తోంది. ఈ సంస్థ ఆవిష్కరించిన హైబ్రిడ్- స్పెక్ ZS ఎస్‌యూవీ ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. గతేడాది ఏస్టర్ మోడల్ కారును తీసుకువచ్చి ఆకట్టుకుందీ సంస్థ. ఇప్పుడు ఈ కారుకు సంబంధించి అప్డేటెడ్ వెర్షన్‌గా ZS HEV పేరుతో ఈ కొత్త కారును ఆవిష్కరించింది. ఈ కారు పూర్తి విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ క్రాస్‌ఓవర్ మోడల్... ముందు భాగం ఓవల్- షేప్ గ్రిల్‌తో ఉంటుంది. L- ఆకారంపు ఎయిర్ ఇన్లెక్ట్స్ రెండు పక్కలా నిలువుగా అమర్చి ఉంటాయి. ఇది ఈ కాంపాక్ట్ ఎస్‌యూవీకి రాయల్ లుక్ అందిస్తోంది. దీంట్లో కొత్త స్టైల్ LED ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఉంటాయి. ఇది డేటైమ్ రన్నిగ్స్ లైట్(DRL's)తో జోడించి ఉంటాయి. ఇది ఈ అప్డేటెడ్ మోడల్‌లో ఉన్న మోడర్న్ సొబగుగా చెప్పవచ్చు.

Auto Expo 2025 JSW MG Motor ZS HEV

ఈ కారులో రీడిజైన్ చేసిన బానెట్ ఉంటుంది. ఇది పెద్ద సైజులో ఉండి, ఫార్వార్డ్ యాంగిల్‌లో డ్రైవర్‌కు కేబిన్ లోపల నుంచి మంచి వ్యూ అవకాశం కల్పిస్తుంది. ఈ ZS HEV మోడల్ ఇతర డిజైన్ అప్డేట్లను పరిశీలిస్తే.. ఈ కారు కొత్త బాడీ క్లాడింగ్‌తో ఉంటుంది. ఇది రీడిజైన్ చేసిన 17 అంగుళాల అలాయ్ వీల్స్‌తో, షార్పర్ షోల్డర్ లైన్స్‌తో ఉంటుంది.

వెనుకవైపు... టెయిల్‌ల్యాంప్ చుట్టూ Horizontal wrap ఉంటుంది. ఇది ఈ కారుకు మెరుగైన రియర్ వ్యూ అవకాశం కల్పిస్తుంది. అదే సమయంలో దీంట్లోని ట్విన్ ఎగ్జాస్ట్ ఔట్‌లెట్స్‌తో ఉండే బంపర్... ఈ కారుకు స్పోర్టీ టచ్ ఇస్తుంది. మొత్తానికి ఈ ZS HEV రీఫ్రెష్‌డ్ టచ్‌తో తీసుకువచ్చారు అని చెప్పవచ్చు.

MG Motor ZS HEV Launch

ఈ జెడ్ఎస్ కొత్త మోడల్‌లో సరికొత్త ఫీచర్లు ఎన్నో ఉన్నాయి. దీంట్లో 12.3 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్‌ఫోటెయిన్మెంట్ సిస్టం, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ సిస్టం, 6- స్పీకర్ ఆడియో సెటప్, బ్లాక్- ఫినిష్ డ్ సీట్లు, 7.0- అంగుళాల డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్, సెంట్రల్ ఆర్మ్‌రెస్ట్, ఫ్లోట్- బాటమ్ స్టీరింగ్ వీల్ వంటి కీ ఫీచర్లు ఉంటాయి.

అంతర్జాతీయ మార్కెట్లో ఈ కారు... ADAS స్టాండర్డ్‌గా వస్తోంది. MG ZS Hybrid కారు 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో, ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానించి వస్తుంది. ఇది 1.83 kWh బ్యాటరీ ప్యాక్‌తో ఉంటుంది. దీంట్లోని ఈ హైబ్రిడ్ సెటప్‌తో కలిపి ఈ కారు 193 bhp పవర్ ఉత్పత్తి చేస్తుంది. 8.7 సెకన్లలోనే ఈ కారు సున్నా నుంచి 100 కేఎంపీహెచ్ వేగాన్ని అందుకుంటుంది.

MG Motor ZS HEV New Version of MG Astor

WLTP ప్రకారం ఈ కారు 23.5 కేఎంపీహెచ్ మైలేజీ అందిస్తుంది. ఇది పర్ఫార్మెన్స్, ఎఫీషియన్సీ విషయంలో బ్యాలెన్స్ సాధిస్తుంది. కర్బన ఉద్గారాలను తగ్గించేందుకు ప్రత్యామ్నాయ సాంకేతికతతో కూడిన వానాలను తీసుకురావాలనే లక్ష్యంలో భాగంగా ఈ కొత్త కారును తీసుకువచ్చిందీ ఎంజీ మోటార్. ఈ ఆటో ఎక్స్‌పోలో ఎంజీ సంస్థ HS ప్లగ్- ఇన్ హైబ్రిడ్ మోడల్‌ను కూడా ప్రదర్శించింది.

ఇవి మాత్రమే కాకుండా.. సైబర్‌స్టర్ ఎలక్ట్రిక్‌ డ్రాప్- టాప్ రోడ్‌స్టర్, ఎం9 ఎలక్ట్రిక్ ఎంపీవీ, మ్యాజెస్టర్ ఫుల్- సైజ్ ఎస్‌యూవీలను కూడా ప్రదర్శించింది ఎంజీ సంస్థ. ఈ మోడళ్లన్నీ ఈ ఏడాది భారత్ మార్కెట్లో సందడి చేయనున్నాయి. దాంతోపాటు.. తమ గ్లోబల్ లైనప్ నుంచి కొన్ని మోడళ్లను కూడా ఈ ఈవెంట్‌లో పరిచయం చేసింది.

More from DriveSpark

Article Published On: Tuesday, January 21, 2025, 13:58 [IST]
English summary
Auto expo 2025 jsw mg motor zs hev unveiled with enhanced features check details here
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+