టాటాకు సవాల్ విసురుతున్న చైనా కంపెనీ.. ఎంజీ విండ్‌సర్ ఈవీ వర్సెస్ టాటా నెక్సాన్ ఈవీ..ఏది బెస్ట్ ?
ఇండియాలో ఎలక్ట్రిక్ కార్లకు డిమాండ్ పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో విసిగిపోయిన ప్రజలు ఎలక్ట్రిక్, హైబ్రిడ్ కార్ల వైపు మొగ్గు చూపుతున్నారు. ముఖ్యంగా ఎలక్ట్రిక్ కార్లు మరింత ప్రజాదరణ పొందుతున్నాయి. ప్రస్తుతం భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్ల అమ్మకాల్లో టాటా మోటార్స్ దూసుకుపోతుంది. ప్రతి నెలా రికార్డు స్థాయిలో ఈవీలను టాటా డెలివరీ చేస్తోంది.
ముఖ్యంగా టాటా నెక్సాన్ ఈవీకి విపరీతమైన డిమాండ్ ఉంది. అయితే ఇప్పుడు చైనాకు చెందిన ఎంజీ మోటార్ నెక్సాన్‌కు సరైన పోటీదారుని భారత మార్కెట్‌లోకి దింపింది. అదే ఎంజీ విండ్‌సర్ ఈవీ. ఈ రెండు కార్ల మధ్య ధర, ఫీచర్లు, పర్ఫామెన్స్‌లను పోల్చి చూద్దాం. కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు ధర రూ.12.49 లక్షల నుండి ప్రారంభమై రూ.17.19 లక్షల(ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

ఇది 30 kWh, 45 kWh అనే రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.కొత్త ఎంజీ విండ్‌సర్ ధర భారతదేశంలో వేరియంట్‌లను బట్టి అందుబాటు ధరలో లభిస్తుంది. దీని ప్రారంభ ధర రూ.14 లక్షలు, టాప్ వేరియంట్ ధర రూ.16 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇందులో ఐదుగురు ప్రయాణించవచ్చు. ఇది 604 లీటర్ల బూట్ స్పేస్‌ను కలిగి ఉంది. అలాగే IP67-సర్టిఫైడ్ 38 kWh బ్యాటరీని కలిగి ఉంది.
టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ SUV 30 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ ఒక పూర్తి ఛార్జ్‌పై 275 కిలోమీటర్ల రేంజ్‌ను అందిస్తుంది. అలాగే 45 kWh బ్యాటరీ ప్యాక్ కలిగిన మోడల్ ఒక పూర్తి ఛార్జ్‌పై 489 కిలోమీటర్లు ప్రయాణిస్తుందని టాటా పేర్కొంది.

ఎంజీ విండ్‌సర్ విషయానికి వస్తే, ఈ ఈవీ కారులో కేవలం 38 kWh సామర్థ్యం గల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ మాత్రమే అందించారు. ఇది ఒకే ఛార్జ్‌పై 332 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్‌ను కలిగి ఉంది. ఇందులోని సింగిల్ ఎలక్ట్రిక్ మోటార్ 134 bhp పవర్, 200 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.
కొత్త టాటా నెక్సాన్ ఎలక్ట్రిక్ కారు 12.3-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 10.25-అంగుళాల ఫుల్ డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, 9-స్పీకర్ JBL సౌండ్ సిస్టమ్, ఆటో AC, క్రూయిజ్ కంట్రోల్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్, సన్‌రూఫ్‌తో సహా అనేక ఫీచర్లను కలిగి ఉంది.

ఎంజీ విండ్‌సర్ విషయానికి వస్తే.. ఏరో లౌంజ్ సీట్లు, 15.6-అంగుళాల గ్రాండ్‌వ్యూ టచ్ డిస్‌ప్లే, రియల్ టైమ్ నావిగేషన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, కీ లెస్ ఎంట్రీ, పుష్-బటన్ స్టార్ట్‌తో పాటు రిమోట్ వెహికల్ కంట్రోల్, సేఫ్టీ అలర్టులతో సహా 80కి పైగా కనెక్టెడ్ ఫీచర్లను కలిగి ఉంది.
డ్రైవ్‌స్పార్క్ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.


Click it and Unblock the Notifications








