భారత మార్కెట్లో గేమ్ చేంజ్ చేయబోతున్న సిట్రోయెన్.. ఎంఎస్ ధోనీతో కలిసి 2.0 పేరుతో సరికొత్త ప్లాన్

కారు మార్కెట్లో సత్తా చాటడానికి సిట్రోయెన్ ఇండియా కొత్త వ్యూహంతో ముందుకు వచ్చింది. ఈ కొత్త వ్యూహానికి సిట్రోన్ 2.0 అని పేరు పెట్టింది. ఈ వ్యూహం ప్రధాన ఉద్దేశం, భారతదేశంలో తమ ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడం. ఇందుకోసం ఇప్పటికే ఉన్న మోడల్స్‌లో కొత్త అప్‌డేట్స్‌, రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించడం, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని అందించడం వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నారు. ఈ వ్యూహం అంతా కస్టమర్ల నుంచి వచ్చిన అభిప్రాయాల ఆధారంగా రూపొందించినట్టు కంపెనీ తెలిపింది.

సిట్రోయెన్ కంపెనీ తీసుకొచ్చే ఈ కొత్త మార్పులు ముఖ్యంగా తమ C3, ఎయిర్‌క్రాస్, బసాల్ట్ కూపే ఎస్‌యూవీ మోడల్స్‌లో కనిపిస్తాయి. ఈ కార్లలో మరింత ఆధునిక ఇంటీరియర్స్, మెరుగైన కనెక్టివిటీ ఫీచర్స్, ఇంకా ఎక్కువ సౌకర్యం వంటి అప్‌డేట్స్ ఉంటాయని కంపెనీ తెలిపింది. ఈ అప్‌డేట్స్‌ను, భారతదేశంలో ఉన్న డ్రైవింగ్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని స్థానికంగానే రూపొందిస్తున్నారు.

Citro n Announces 2 0 Strategy for India New Models Expanded Network and MS Dhoni

వీటి తయారీలో ఏకంగా 98% వరకు స్థానిక పరికరాలను ఉపయోగించనున్నారు. స్థానిక వినియోగదారులకు క్వాలిటీ ప్రొడక్ట్స్ అందించడమే తమ లక్ష్యమని స్టెల్లాంటిస్ ఇండియా సీఈఓ, ఎండీ శైలేష్ హజేలా తెలిపారు. సిట్రోయెన్ 2021లో కేవలం 10 ఔట్‌లెట్‌లతో తమ ప్రయాణాన్ని ప్రారంభించింది. ఇప్పుడు దేశవ్యాప్తంగా 80కి పైగా టచ్‌పాయింట్‌లను ఏర్పాటు చేసుకుంది. ఇప్పుడు ఈ సంఖ్యను ఈ ఏడాది చివరికల్లా దాదాపు రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.

దీనివల్ల దేశంలో ఏ కస్టమర్‌ కూడా సేల్స్ లేదా సర్వీస్ సెంటర్ కోసం 100 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరం ప్రయాణించాల్సిన అవసరం ఉండదు. ముఖ్యంగా టైర్-2, టైర్-3, టైర్-4 నగరాలపై కంపెనీ దృష్టి పెడుతోంది. అలాగే, సిట్రోన్ డిజిటల్ సర్వీస్ మోడల్‌ను కూడా పరిచయం చేస్తోంది. దీని ద్వారా పారదర్శక ధరలు, సర్వీస్ ట్రాకింగ్ వంటి సేవలను రియల్-టైమ్‌లో అందించనున్నారు.

Citro n Announces 2 0 Strategy for India New Models Expanded Network and MS Dhoni

సిట్రోన్ కంపెనీ ఇప్పటికే భారతదేశంలో తమ తయారీ కేంద్రాలు, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ (R&D), స్థానికీకరణ వంటి వాటి కోసం రూ.5,300 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టింది. భవిష్యత్తులో కూడా ఎలక్ట్రిక్, పెట్రోల్ ఇంజిన్ ప్లాట్‌ఫారమ్‌ల విస్తరణపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపింది. ఈ సిట్రోన్ 2.0 వ్యూహం ప్రారంభం సందర్భంగా, క్రికెట్ దిగ్గజం ఎంఎస్ ధోనీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించుకుంది.

ధోనీతో కలిసి కొత్త టీజర్ క్యాంపెయిన్‌ను కూడా ప్రారంభించింది. ఈ క్యాంపెయిన్‌లో కొత్త కార్లు, విస్తరించిన డీలర్ నెట్‌వర్క్, కస్టమర్లకు మొదటి ప్రాధాన్యత వంటి అంశాలను చూపించారు. గతంలో కూడా బసాల్ట్ కారును లాంచ్ చేసినప్పుడు ధోనీనే బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు.

Citro n Announces 2 0 Strategy for India New Models Expanded Network and MS Dhoni

డ్రైవ్‌స్పార్క్‌ తెలుగు వెబ్‌సైట్ ఆటోమొబైల్‌కి సంబంధించిన తాజా వార్తలను అందిస్తుంది. వివిధ సోషల్ మీడియాల ద్వారా సరికొత్త వార్తలను ఎప్పటికప్పుడు యూజర్లకు చేరవేస్తుంది. తాజా కార్ల వార్తలు, బైక్ వార్తలు, టెస్ట్ డ్రైవ్ రివ్యూల వీడియోల కోసం మా Facebook, Instagram, YouTube పేజీలతో కనెక్ట్ అవ్వండి. మీకు ఏదైనా వార్త నచ్చితే లైక్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అలానే మీతోటి స్నేహితులతో ఈ వార్తను పంచుకోగలరు. ధన్యవాదాలు.

More from DriveSpark

Article Published On: Saturday, August 9, 2025, 10:23 [IST]
English summary
Citro n announces 2 0 strategy for india new models expanded network and ms dhoni
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+