ఇదేం ఆఫర్ బాబోయ్.. అస్సలు నమ్మశక్యంగా లేదు.. సిట్రోయెన్ కార్లపై ఏకంగా రూ.2.80లక్షల డిస్కౌంటా ?

మీరు కొత్త కారు కొనాలనుకుంటున్నారా? అది కూడా భారీ డిస్కౌంట్‌తో, అదిరిపోయే ఆఫర్లతో కావాలా? అయితే మీకో గుడ్ న్యూస్. సిట్రోయెన్ ఇండియా తన 4వ వార్షికోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ సందర్భంగా తమ అన్ని కార్లపైనా నమ్మశక్యం కాని ఆఫర్‌లను ప్రకటించింది. ఏకంగా రూ.2.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీ, తక్కువ EMIలు.. ఇలా బోలెడు ఆఫర్లతో సిట్రోయెన్ కస్టమర్లను ఆకట్టుకుంటోంది.

కస్టమర్లు ఇప్పుడు ఏ సిట్రోయెన్ కారు కొనుగోలు చేసినా ఆకర్షణీయమైన క్యాష్ బెనిఫిట్స్, ఎక్స్‌టెండెడ్ వారంటీ ప్యాకేజీలు, తక్కువ EMI ఫైనాన్స్ స్కీమ్‌లతో సహా ప్రత్యేక, పరిమిత కాల ఆఫర్‌లను పొందవచ్చు. జూన్ 2025 చివరి వరకు లేదా స్టాక్ ఉన్నంత వరకు సెలక్ట్ చేసిన మోడళ్లపై కస్టమర్లు రూ.2.80 లక్షల వరకు ఆకర్షణీయమైన పొదుపును పొందవచ్చు.

Citroen offers

ఇప్పటికే సిట్రోయెన్ కార్లు ఉన్న కస్టమర్లు నెల పొడవునా తమ సిట్రోయెన్ కోసం ఫ్రీ కార్ స్పా సర్వీసును పొందవచ్చు. భారతదేశం అంతటా ఉన్న అన్ని సిట్రోయెన్ షోరూమ్‌లలో.. అధికారిక సిట్రోయెన్ ఇండియా వెబ్‌సైట్‌లో ఈ ఆఫర్‌లు లిమిటెడ్ టైంకు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. మరింత సమాచారం కోసం కస్టమర్లు Citroën.in ను విజిట్ చేయవచ్చు లేదా దగ్గర్లోని షోరూమ్‌ను సంప్రదించవచ్చు.

భారతదేశపు మొదటి SUV కూపే అయిన సిట్రోయెన్ బసాల్ట్, ఇటీవల లాంచ్ అయిన సిట్రోయెన్ సి3 CNG వెర్షన్‌తో సహా చాలా అద్భుతమైన మోడళ్లను విడుదల చేయడం నుండి, సిటీ డ్రైవర్ల కోసం ఇంధన-సమర్థవంతమైన ఆల్-ఎలక్ట్రిక్ ë-C3ను లాంచ్ చేయడం వరకు, భారతీయ కస్టమర్లకు నిరంతరం డిజైన్, సౌకర్యం, టెక్నాలజీని అందిస్తూ ముందుకు దూసుకుపోతోంది.

Citroen offers

కొత్త సిట్రోయెన్ కారు ఉత్పత్తి మైలురాళ్లతో పాటు, కంపెనీ భవిష్యత్తు సేల్స్ విధానాన్ని, మరింత లోకల్ ప్రొడక్షన్ ఫుట్‌ప్రింట్‌ను నిర్మించింది. ఇది భారతీయ మార్కెట్‌కు తగ్గింపు ధరలో కార్లను అందించేందుకు ఉపయోగపడుతుంది.

స్టెల్లాంటిస్ ఇండియా బిజినెస్ హెడ్, డైరెక్టర్ కుమార్‌ ప్రియేష్ మాట్లాడుతూ.. "భారతదేశంలో కొత్త ఆలోచనలు, ఆశయాలు, కస్టమర్లకు మంచి ఎక్స్ పీరియన్స్ అందించడంపై మా కంపెనీ దృష్టి పెట్టింది. కేవలం నాలుగు సంవత్సరాలలో సిట్రోయెన్ గ్లోబల్, లోకల్ ప్రెజెన్స్‌తో కూడిన వాహనాల పోర్ట్‌ఫోలియోను మా కస్టమర్లకు పరిచయం చేశామన్నారు.

Citroen offers

భారతదేశంలో సిట్రోయెన్ నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా తమ బ్రాండ్‌ను నమ్మినందుకు కస్టమర్లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఉత్పత్తుల నుంచి అమ్మకాల తర్వాత సర్వీసుల వరకు కొత్త ఆఫర్‌లను రూపొందించడంలో వారి ఫీడ్‌బ్యాక్ కీలక పాత్ర పోషించాయి. దేశవ్యాప్తంగా ఇంకా చాలా మంది కస్టమర్‌లకు 'సిట్రోయెన్ కంఫర్ట్' అనుభవాన్ని అందించడానికి ప్రయత్నిస్తున్నట్లు ఆయన తెలిపారు.

భారతీయ మార్కెట్‌లోకి వచ్చినప్పటి నుండి, సిట్రోయెన్ ఒక డిఫరెంట్ ఓనర్‌షిప్ అనుభవాన్ని అందించడంపై దృష్టి సారించింది. ఇండస్ట్రీ లీడింగ్ వారంటీ ప్రోగ్రామ్‌లు, డిజిటల్-ఫస్ట్ సర్వీస్ మోడల్, భారతీయ రోడ్లు, కస్టమర్ల అంచనాలకు అనుగుణంగా అభివృద్ధి చెందుతున్న వాహనాల శ్రేణి దీనికి సపోర్ట్ ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది.

Citroen offers

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం: సిట్రోయెన్ తమ వార్షికోత్సవం సందర్భంగా అందిస్తున్న ఈ ఆఫర్‌లు చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. రూ.2.80 లక్షల వరకు ఆదా చేసుకునే అవకాశం కస్టమర్‌లకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా ఉచిత కార్ స్పా లాంటివి పాత కస్టమర్‌లను కూడా ఆకట్టుకుంటాయి. సిట్రోయెన్ తమ సేల్స్‌ను పెంచుకోవడానికి ఇది మంచి అవకాశం.

More from DriveSpark

Article Published On: Tuesday, June 10, 2025, 13:24 [IST]
English summary
Citroen announces unbelievable offer save up to rs 2 80 lakh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+