కారు బాగానే ఉంది.. కానీ కొనడానికి ఎవరూ రావట్లేదు..కన్నీళ్లు పెడుతున్న C5 ఎయిర్‌క్రాస్ డీలర్లు
ప్రయాణ సౌలభ్యం విషయంలో ప్రీమియం బ్రాండ్‌లకు సైతం గట్టి పోటీ ఇవ్వగల సామర్థ్యం ఉన్న కంపెనీ సిట్రోయెన్ (Citroen). ఆ బ్రాండ్‌లోని మోడల్స్‌లోకెల్లా అద్భుతమైనది C5 ఎయిర్‌క్రాస్ (Aircross). అయితే నవంబర్ నెలలో ఈ మోడల్ అమ్మకాల గణాంకాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. గత నెలలో ఒక్క యూనిట్ కూడా అమ్ముడుపోకుండానే సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ వెనుకబడింది.
ఫ్రెంచ్ వాహన తయారీ సంస్థ అయిన సిట్రోయెన్ భారతదేశంలో మంచి నాణ్యత గల మోడళ్లను విడుదల చేస్తున్నప్పటికీ, అమ్మకాలలో స్థిరత్వం చూపడానికి చాలాసార్లు ఇబ్బంది పడుతున్నట్లు కనిపిస్తోంది. అయినప్పటికీ, మొత్తం మీద కంపెనీ అమ్మకాలు మాత్రం మెరుగ్గానే ఉన్నాయి.

గత నెలలో సిట్రోయెన్ మొత్తం 1224 కార్లను విక్రయించి బ్రాండ్ రెండవ అత్యుత్తమ నెలవారీ అమ్మకాల రికార్డును నమోదు చేసింది. జీఎస్టీ పన్ను తగ్గింపుల కారణంగా కంపెనీ ప్రీమియం మోడల్స్ ధరలు రూ.2.67 లక్షల వరకు తగ్గాయి. గతంలో రూ.39.99 లక్షలు ఉన్న ధర ఇప్పుడు రూ.37.32 లక్షలకు తగ్గింది. అంటే సుమారు 6.68 శాతం ధర తగ్గింది.
సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ప్రస్తుతం సింగిల్ వేరియంట్‌లో మాత్రమే లభిస్తోంది. ఈ వాహనం సింగిల్ టోన్, డ్యూయల్ టోన్ అనే రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. 1997 సీసీ DW10 FC 4-సిలిండర్ డీజిల్ ఇంజన్ ఈ సి5 ఎయిర్‌క్రాస్‌కు శక్తినిస్తుంది. ఈ ఇంజన్ 177 PS పవర్, 400 NM పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేయగలదు.

ఈ వాహనం 8-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌తో వస్తుంది. సిట్రోయెన్ సి5 ఎయిర్‌క్రాస్ ఇంధన ట్యాంక్ సామర్థ్యం 52.5 లీటర్లు. లీటరుకు 17.5 కిలోమీటర్ల మైలేజీని అందించే ఈ ఎస్‌యూవీ 4500 mm పొడవు, 1969 mm వెడల్పు, 1710 mm ఎత్తు మరియు 2730 mm వీల్‌బేస్‌ను కలిగి ఉంది.
సి5 ఎయిర్‌క్రాస్‌లో ఎల్‌ఈడీ విజన్ ప్రొజెక్టర్ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ డీఆర్‌ఎల్‌లు, 3డీ ఎల్‌ఈడీ రియర్ లైట్లు, ఎల్‌ఈడీ టర్న్ ఇండికేటర్, 31.24 సెం.మీ టీఎఫ్‌టీ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 25.4 సెం.మీ టచ్‌స్క్రీన్ సెంటర్ కన్సోల్ వంటివి ఉన్నాయి. ఆపిల్ కార్‌ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, ఎలక్ట్రిక్ అడ్జస్టబుల్ సీట్లు, ఎలక్ట్రిక్ టెయిల్‌గేట్, 580 లీటర్ల బూట్ కెపాసిటీ వంటి ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.

సేఫ్టీ విషయంలో సి5 ఎయిర్‌క్రాస్ వెనుకబడలేదు. బ్లైండ్ స్పాట్ మానిటరింగ్ సిస్టమ్, 6 ఎయిర్‌బ్యాగ్‌లు, కాఫీ బ్రేక్ అలర్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ డిసెంట్ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్, ట్రాక్షన్ కంట్రోల్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు రివర్స్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు ఇందులో ఉన్నాయి.
సిట్రోయెన్ ఉత్పత్తులకు మంచి పేరు ఉన్నప్పటికీ, సి5 ఎయిర్‌క్రాస్ చాలా గట్టి పోటీ ఉన్న ప్రీమియం ఎస్‌యూవీ విభాగంలో విక్రయించబడుతోంది. ఈ విభాగంలో ఇతర కార్లకు డిమాండ్ ఎక్కువగా ఉండటం వలన సి5 ఎయిర్‌క్రాస్ అమ్మకాలు తగ్గుతున్నాయి. ఈ మోడల్‌పై వినియోగదారులకు మరింత అవగాహన కల్పించడం లేదా కారులో అవసరమైన మార్పులు తీసుకురావడం కంపెనీకి అత్యంత అవసరం.


Click it and Unblock the Notifications








